- లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయిస్తాం
- అర్హులైన ప్రతి పేదకూ ఇల్లు సీఎం ఆశయం
- లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలి
- గృహ నిర్మాణ, ఐపీఆర్ మంత్రి కొలుసు పార్థసారథి
ఏలూరు(చైతన్యరథం): రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో అర్హులైన ప్రతిఒక్కరికీ ఇల్లు అందించాలన్న ఆశయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారని, వచ్చే మార్చి నాటికి లక్ష గృహ నిర్మాణాలను పూర్తిచేసి లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయిం చి ఇంటి తాళాలు అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేపడతారని గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఏలూరు మండలం పోణంగిలో ఎన్టీఆర్ గృహ లేఅవుట్‌ను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ య్య (చంటి), జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, గృహ నిర్మాణ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని, తాగునీరు, డ్రైనేజి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా లేఅవుట్లో ఏర్పాటు చేసిన సమా వేశంలో మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద అర్హులైన ప్రతీ నిరుపేదకు గృహం అందించాలన్న ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేయా ల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పోణంగి లేఅవుట్లో 7035 గృహాలకు గాను 5667 మందికి మంజూరు మంజూరు చేయడం జరిగిందని, 875 ప్రారంభించార న్నారు. లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి లబ్ధిదారులు గృహప్రవేశాలకు అనుగుణంగా గృహాలను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. లేఅవుట్లలో ఇసుక కొరత లేకుండా వారంరోజుల్లో స్టాక్ పాయింట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. 80 శాతానికి పైగా నిర్మాణపనులు పూర్తయిన గృహాలను పూర్తి చేయడంలో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పోణంగి లేఅవుట్లో మార్చి నాటికి రెండు వేల గృహాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. లే అవుట్లలోని గృహాలకు విద్యుత్, తాగునీరు, డ్రైనేజి పనులను కాంట్రాక్టర్లు నిర్దేశించిన సమయంలో పూర్తిచేసేలా అధి కారులు పర్యవేక్షించాలని సూచించారు. పనులు పూర్తికావడంలో అధికారుల పర్యవేక్షణ లోపం ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని మంత్రి హెచ్చరించారు. విద్యుత్ సమస్యలు కూడా పరిష్కరిస్తామన్నారు. ఏలూరు నియోజకవర్గంలో సుమారు 25 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని పట్టుదలతో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కృషి చేస్తున్నారని తెలిపారు.
గృహనిర్మాణానికి అదనపు నిధులపై పరిశీలన
ఇళ్ల నిర్మాణానికి డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణాన్ని రూ.35 వేల నుంచి లక్షకు పెంచే అంశాన్ని, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీలకు గృహ నిర్మాణానికి రూ.50 వేలు, రూ.75 వేలు అదనంగా అందించే విషయాన్ని సీఎం పరిశీలిస్తున్నారని వివరించారు. ఇల్లు మంజూరైన లబ్ధిదారులు 2026 డిసెంబర్ నాటికి ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేసుకోవాలని, లేకుంటే గృహాల మంజూరును రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదలకు గృహాల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఎన్టీఆర్ గృహ నిర్మాణాలను పట్టాలెక్కించి త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటుందని, ఎన్టీఆర్ గృహ లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, ఆర్టీసీ విజయవాడ రీజినల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఆర్డీవో అచ్యుత్ అంబరీష్, గృహనిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్యనారాయణ, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్, తహసీల్దార్ శేషగిరిరావు, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.
కొమడవోలు లేఅవుట్ పరిశీలన
అనంతరం కొమడవోలులోని ఎన్టీఆర్ గృహ లేఅవుట్‌ను మంత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు విద్యుత్, తాగునీరు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని కోరగా మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి ఆదేశించా రు. తమ లేఅవుట్లో గృహ నిర్మాణ మెటీరియల్‌ను కొందరు దొంగలు దొంగిలి స్తున్నారని ఫిర్యాదు చేయగా పోలీస్ పెట్రోలింగ్ చేయాలని మంత్రి ఆదేశించారు. ఇక్కడ లేఅవుట్లో మార్చి నాటికి 1500 గృహాలు పూర్తి చేయాలని ఆదేశించారు.