- 104 మందికి 97 మంది ఉత్తీర్ణత
- బీసీ సంక్షేమ మంత్రి సవిత హర్షం
అమరావతి(చైతన్యరథం): సీఎంఏ (సర్టిఫైడ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ) ఫౌండేషన్ పరీక్షల్లో ఎంజేపీ గురుకుల కళాశాలల విద్యార్థులు ప్రతిభ చాటారు. ఈ పరీక్షకు 104 మంది విద్యార్థులు హాజరుకాగా 97 మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో 18 ఎంజేపీ గురుకుల కళాశాలలకు చెందిన 104 మంది విద్యార్థులు సీఎంఏ ఫౌండేషన్ పరీక్షకు శిక్షణ తీసుకున్నారు. వారికి నెల్లూరుకు చెందిన రావూస్ విద్యాసంస్థ ఉచితంగా ఆన్‌లైన్ ద్వారా శిక్షణ అందజేసింది. ఇటీవల ఫలితాలు విడుదల కాగా 97 మంది ఉత్తీర్ణత సాధించారు. వారంతా సీఎంఏ ఇంటర్మీడియట్ అర్హత సాధించారు. ఈ పరీక్షల్లో గట్టెక్కి తే సీఎంఏ ఫైనల్ చేరుకోనున్నారు. సీఎంఏ ఫౌండేషన్ పరీక్షా ఫలితాల్లో అర్హత సాధిం చిన విద్యార్థులకు ప్రైవేటు కంపెనీల్లో రూ.30 నుంచి రూ.40 వేల ప్యాకేజీ లభించే అవకాశముంది. 97 మంది గురుకుల కళాశాల విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంపై బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత మంగళవారం ఒక ప్రక టనలో హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా ఉచిత శిక్షణ అందజేసిన రావూస్‌కు, కళాశాల సిబ్బందికి, విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. బీసీ విద్యా ర్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, అత్యుత్తమ స్థానాలకు చేరుకో వాలని ఆకాంక్షించారు. బీసీ గురుకుల పాఠశాల, కళాశాలలో అత్యుత్తమ విద్య అంది స్తున్నారనడానికి ఎంజేపీ గురుకుల కళాశాల విద్యార్థుల ప్రతిభే ఇందుకు నిదర్శన మని పేర్కొన్నారు.