- గత ప్రభుత్వంలో అన్యాయంపై బాధితుల గోడు
- న్యాయం చేయాలని ప్రజావినతులలో అర్జీలు
- పరిష్కరించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం
మంగళగిరి(చైతన్యరథం): కడప జిల్లా జమ్మలమడుగు మండలం యర్రగుంట్ల గ్రామానికి చెందిన మైలాపురం లక్ష్మీదేవి తన సమస్యను వివరిస్తూ 2018లో టీడీపీ ప్రభుత్వం హయాంలో తనకు టిడ్కో ఇల్లు మంజూరైనా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ఇల్లు రద్దు చేసినట్లు మంగళవారం ప్రజావినతుల కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాల యంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అర్జీలు స్వీకరించారు. సమస్యను పరిశీలించి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఎక్కువగా భూ కబ్జాలకు సంబంధించిన ఫిర్యాదులు రాగా సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.
` మహానందిపల్లె గ్రామానికి చెందిన షేక్ అనే వ్యక్తి వైసీపీ నాయకుల అండతో దొంగ వికలాంగ సర్టిఫికెట్ పొంది పింఛన్ తీసుకుంటున్నాడని కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గ్రామానికి చెందిన బాలిబోయిన రమణయ్య ఫిర్యాదు చేశాడు. అతనిపై దర్యాప్తు చేసి పింఛన్ రద్దు చేయాలని వినతిపత్రం అందజేశాడు.
` తన కుటుంబం గత 35 సంవత్సరాలుగా సాగుచేస్తున్న వ్యవసాయ భూమిని కొంతమంది వైసీపీ నాయకులు మూడేళ్లుగా రౌడీయిజం చేస్తూ కబ్జా చేయాలని ప్రయ త్నిస్తున్నారని చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురానికి చెందిన కె.యశ్వంత్ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.
` వజ్రకరూరు మండలం జరుట్ల రాంపురం గ్రామంలో తనకు చెందిన 5 ఎకరాల భూమికి సంబంధించిన అడంగల్ రికార్డును ఆన్‌లైన్‌లో తొలగించి చంద్రప్ప అనే వైసీపీ నాయకుడు తన పేరుతో పట్టా నమోదు చేసుకున్నాడని అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం షేక్సానుపల్లి గ్రామానికి చెందిన వడ్డే ఎర్రిస్వామి ఫిర్యాదు చేశారు. తన భూమిని తిరిగి తనకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
` 2019 ముందు తనకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ లభించేదని..వైసీపీ అధికారం లోకి వచ్చిన తరువాత కక్షపూరితంగా తన పింఛన్ రద్దు చేసినట్లు అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం చిన్నతిప్పసముద్ర గ్రామానికి చెందిన బి.ఉత్తమరెడ్డి ఫిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి పింఛన్ పునరుద్ధర ణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
` తన కుమారుడు సలీమ్ మొహిద్దీన్ భార్య ప్యారేజాన్ వద్ద రూ.4 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు తెలిపారు. ఆ అప్పును తరువాత పూర్తిగా తీర్చినా మొహిద్దీన్ తనకు చెంది న రూ.30 లక్షల విలువైన ఇంటిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని తెనాలి తేలప్రోలు గ్రామానికి చెందిన షేక్ అక్షరున్నీసా ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.