- భారీ ప్యాకేజీతో స్టీల్ ప్లాంటుకు జవసత్వాలు
- ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చారు
- ఇక వెంటిలేటర్‌పై ఉన్న ప్లాంట్‌ను గాడిన పెడతాం
- పూర్తి కెపాసిటీతో రెండేళ్లు నడిపితే సెయిల్‌లో విలీనం
- యాజమాన్యం, కార్మికులు సమష్టి కృషితో పనిచేయాలి
- గత ప్రభుత్వంలో ఎలా అమ్మాలన్న దానిపైనే ఆలోచన
- నేడు వైసీపీ నేతలు ప్రవచనాలు చెప్పడం హాస్యాస్పదం
- ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు జాగ్రత్త
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
విశాఖపట్నం(చైతన్యరథం): వైసీపీ ప్రభుత్వ దోపిడీ విధానాలకు బలై వెంటిలేటర్ దశకు చేరుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్లతో జీవం పోసిన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేతలతో కలిసి మాట్లాడారు. కేంద్రం రూ.11,440 కోట్ల ఆర్థికసాయాన్ని అం దించిన నేపథ్యంలో కీలకపాత్ర పోషించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర ప్రజలకు సెంటిమెంట్..దీనిని గౌరవించి కేంద్ర ఉక్కు పరిశ్రమల మంత్రి కుమారస్వామి సహకారం అందించారు. సహాయ మంత్రి శ్రీనివాసవర్మ, నిర్మలా సీతారామన్, పురందే శ్వరి తమ వంతు కృషి చేశారు. ఉత్తరాంధ్రకు చెందిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు. విశాఖ ఎంపీ శ్రీభరత్ అందరినీ సమన్వయం చేస్తూ విశాఖ ఉక్కును కాపాడేందుకు శ్రమించారు. కూటమి ప్రభుత్వం సమష్టి కృషితో విశాఖ ఉక్కు పరిరక్షణ సాధ్యమైంది. కొనఊపిరితో ఉన్న విశాఖ ఉక్కును ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు, నిర్వాసితుల మనోభావాలు, కార్మికుల కష్టాలను అర్థం చేసుకుని సమష్టి కృషితో కాపాడుకోగలిగాం. కేంద్రానికి మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.
ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్‌ను గుర్తించింది
ప్లాంటు కెపాసిటీ మొత్తాన్ని వినియోగించుకుంటేనే ప్లాంటు లాభాల బాటలో వెళుతుందని కేంద్రం గుర్తించి సహకరిస్తోంది. విశాఖ స్టీల్‌పై కేంద్రానికి నమ్మకం వచ్చింది. విశాఖ ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించారు..గుర్తించారు, నాయకులు, కార్మికుల పోరా టాలు, నిర్వాసితుల ఆలోచనలకు అనుగుణంగా కేంద్రం రూ.11,440 కోట్లను విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఇచ్చింది. ఈ ప్యాకేజీని కేంద్రం ప్రకటించే ముందు ముఖ్యమంత్రి, నాయకులు ప్లాంటు పూర్తి సామర్థ్యంతో రెండేళ్లు పనిచేస్తే దీన్ని సెయిల్‌లో విలీనం చేయడానికి అవకాశం ఉందని చెప్పారు. మా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాం. ఇకపై యాజమాన్యం, కార్మికులు ప్లాంటును పూర్తి సామర్థ్యంతో నిర్వహించే బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి. విశాఖ ఉక్కుకు వచ్చిన డబ్బులు ప్రజాధనం.. భవిష్యత్తు తరాలకు ఉద్యోగావకాశాలు పెంచాలనే ఉద్దేశంతో విశాఖ స్టీల్ ప్లాంటుకు కేంద్రం సహ కరిస్తోంది. ప్లాంటును పరిరక్షించే బాధ్యతను మేము తీసుకుంటాం. బాబు ఉంటేనే ప్లాం టు ఉంటుంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. కార్మికులు, యాజమాన్యం సమష్టి కృషితో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.
ఇచ్చిన మాట నిలుపుకున్నారు
0.5 మిలియన్ టన్నుల కెపాసిటీ ఉన్న ప్లాంటుకే రూ.15 వేల కోట్లు ఇచ్చారని కొందరు విమర్శిస్తున్నారు. ప్లాంటు రేటెడ్ కెపాసిటీకి అనుగుణంగా ప్లాంటును నిర్వహిస్తే మంచి ఫలితాలు వస్తాయి. విశాఖ స్టీల్ ప్లాంటును కొనఊపిరితో ఉన్న పరిస్థితి నుంచి రూ.11,440 కోట్లతో నిలదొక్కుకునేందుకు ఊతమిచ్చింది. గాజువాకలో ఎన్నికల సం దర్భంగా చంద్రబాబు సభకు వస్తున్న సందర్భంలో నేను, భరత్ విమానాశ్రయం నుంచి ఆయనను తీసుకొచ్చే సందర్భంలో విశాఖ స్టీల్ ప్లాంటు కార్మికులకు ఏం సమాధానం చెప్పాలని అడిగిన సందర్భంలో విశాఖ ఉక్కు పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. చెప్పిన మాట ప్రకారం అండగా నిలబడ్డారు. హుద్ హుద్ సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు కరెంటు సరఫరా ఆగిపోతే ముఖ్యమంత్రి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి త్వరితగతిన కరెంటును త్వరగా పునరుద్ధరించి అండగా నిలబడి ప్లాంటుకు నష్టాలు రాకుండా కాపాడిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు
కొంతమంది ఉద్యమాలు చేస్తున్నారు….కానీ వాళ్లు ఉద్యమాల మీదే ఆధారపడి బతుకుతున్నారు. ఉద్యమాలు ప్రజలను చైతన్యవంతం చేసేలా ఉండాలి. కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్యమాలను వాడుకుంటున్నారు. విశాఖ ప్లాంటు మొత్తాన్ని సమూ లంగా నాశనం చేసి రాజధాని కట్టాలని చూసిన వాళ్లు నేడు విశాఖ స్టీల్ ప్లాంటు గురిం చి నీతిసూక్తులు మాట్లాడుతున్నారు. గత సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం గత ప్రభుత్వం తాలూకు ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాజీనామా చేసేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంటు స్థానంలో రాజధాని కట్టాలని జగన్‌రెడ్డి అన్న సందర్భంలో ఆయన రాజీనామా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంటుకు చెందిన 7 వేల ఎకరాలు అమ్మేద్దామని, గంగవరం పోర్టు అమ్మేద్దామని ప్రయత్నాలు చేయలేదా? అని ప్రశ్నించారు. ప్రజల మనోభావాలతో ఆటలొద్దని వైసీపీ నేతలను హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంటుకు భూములు ఇచ్చిన 8 వేల మంది నిర్వాసితులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నేడు విశాఖ ఉక్కు ఉద్యమం నడుస్తుందంటే దానికి కారణం నిర్వాసితులే. వారి మనోభావాలతో ఆటలాడవద్దని కోరు తున్నాను. ఉద్యమాలు చేసేవాళ్లు ప్లాంటు ఫుల్ కెపాసిటీతో నడిచేలా సహకరించాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంటు రవాణాకు అనుకూలంగా ఉన్న ప్రాంతంలో నెలకొల్పారు.. దీన్ని పాడుచేయాలని చూడొద్దని హితవుపలికారు.
సొంత గనులు, ఇంకా సాయానికి ప్రయత్నిస్తాం
విశాఖ స్టీలు ప్లాంటుకు సొంత గనులు వచ్చేందుకు కృషి చేస్తాం. ఇంకా అవస రమైన ఆర్థికసాయం కోసం ప్రయత్నిస్తాం. విశాఖ స్టీల్ ప్లాంటుకు అవసరమైన ప్రతి అవసరాన్ని తీర్చడానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రం సిద్ధంగా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంటును పూర్తిస్థాయిలో వినియోగించి ఫుల్ కెపాసిటీతో నడిపించడంతో కార్మికులు, యాజమాన్యం సమష్టిగా కృషి చేయాలి. మేం అన్ని విధాలా అండగా ఉంటాం. విశాఖ ప్లాంటుకు అవసరమైన, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మాంగనీస్ మైన్‌ను వైసీపీ ప్రభు త్వం ఎందుకు రెన్యూవల్ చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చీపు రుపల్లి, సరిపల్లిలో ఉన్న శాండ్ మైన్‌ను ఎందుకు అప్రూవల్ చేయలేదో వైసీపీ నేతలు చెప్పాలని ప్రశ్నించారు. క్వార్జ్ మైన్‌ను ఎందుకు రెన్యూవల్ చేయలేదు? 50 ఏళ్ల ఒప్పం దం చేసుకున్న మైన్స్‌ను వైసీపీ ప్రభుత్వం ఎందుకు అప్రూవల్ చేయలేదు? అని నిల దీశారు. విశాఖ స్టీల్ ప్లాంటు అమ్మేద్దాం, వాటాలు కొట్టేద్దాం అని వైసీపీ నేతలు కుట్రపూ రితంగా గత ఐదేళ్లు వ్యవహరించారు. వైసీపీ నేతలే బహిరంగా చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మా నాయకుడు మాట్లాడొద్దనే విషయాన్ని మాతో చెప్పారు. యువనేత నారా లోకేష్ పాదయాత్ర చేసిన సందర్భంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో రాత్రిపూట బస చేసిన సందర్భంలో మా ఉత్తరాంధ్ర నేతలందరితో చర్చించి, స్టీల్ ప్లాంటు కార్మికులు, నాయకులతో చర్చించి విశాఖ ఉక్కు పరిరక్షణకు ఆ సమయంలో హామీ ఇచ్చారు. నేడు చేసి చూపించారని తెలిపారు. విశాఖ ఉక్కు పరిరక్షణే నా ఆశయం.. ఆ ఆశయం మేరకే ముందుకు వెళుతున్నాను. విశాఖ ఉక్కు కోసం టీడీపీలో రెండు తరాలు కృషి చేశాయి… చేస్తున్నాయని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు కోసం తాను, గంటా శ్రీనివాసరావు, ఉత్తరాం ధ్ర టీడీపీ నేతలంతా చిత్తశుద్ధితో గత ఐదేళ్లలో పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తుచే శారు. అధికారంలోకి వచ్చాక సమష్టి కృషితో విశాఖ ఉక్కును పరిరక్షించాం. విశాఖ ఉక్కు విషయంలో వైసీపీ నేతలు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి.. ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారని గ్రహించాలని హితవుపలికారు.