- త్వరలో ఇంటి స్థలం కేటాయిస్తామని హామీ
అమరావతి(చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో గురువా రం ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఏసీఏ కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ సానా సతీష్, టీం ఇండియా క్రికెటర్ కె.నితీష్‌కుమార్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ ప్రకటించిన రూ.25 లక్షల చెక్కును నితీష్‌కు అం దజేశారు. అతి త్వరలో ఇంటి స్థలం కేటాయిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అంతర్జాతీయ క్రీడాకారులకు అండగా అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని, మరింతగా రాణించేందుకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడిరచారు. నితీష్ భవి ష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో తొలి టెస్టులోనే నితీష్ సెంచరీ చేసి ఆకట్టుకున్న విషయం తెలి సిందే. కాగా సీఎం చంద్రబాబు, ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్‌కు నితీష్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
నితీష్‌కు కేశినేని సత్కారం
అంతకుముందు నితీష్ విజయవాడ గురునానక్ కాలనీలో కేశినేని శివనాథ్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఏసీఏ కార్యదర్శి రాజ్యసభ ఎంపీ సానా సతీష్‌తో కలిసి నితీష్‌కు కేశినేని సాదర స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం శాలువా తో సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహూకరించారు. ఈ సందర్భంగా నితీష్ ను అభినందించిన కేశినేని ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా క్రికెట్‌లో రాణించాలను కునే ఎంతోమంది క్రీడాకారులకు నితీష్ స్ఫూర్తిగా నిలిచాడని కొనియాడారు. ఏపీ నుంచి ఏసీఏ తరపున మరింత మంది క్రికెటర్లు ఇండియా టీమ్, ఐపీఎల్‌లో ఆడేందుకు ఏసీఏ అధ్యక్షుడు కేశినేని ఎంతగానో కృషి చేస్తున్నారని నితీష్ ప్రశంసించారు. యంగ్ క్రికెట ర్లకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ ఉపాధ్య క్షుడు పి.వెంకట రామప్రశాంత్, కోశాధికారి దండమూడి శ్రీనివాస్, ఏసీఏ కౌన్సిలర్ దంతు గౌరు విష్ణుతేజ్, కె.ముత్యాలరెడ్డి పాల్గొన్నారు.