- మంత్రి నారాయణపై నిరాధార ఆరోపణలు
- టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి మండిపాటు
నెల్లూరు (చైతన్యరథం): మంత్రి నారాయణపై వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఆరోపణలకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి దిమ్మతిరిగేలా సమాధానం చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రశేఖర్ రెడ్డి రెడ్‌క్రాస్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తూ మంత్రి నారాయణపై నిరాధార ఆరోపణలు చేశారన్నారు. తనను రాజీనామా చేయాలంటూ మంత్రి నారాయణ తుపాకీతో బెదిరించారని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించడంపై వెంకట రమణా రెడ్డి మండిపడ్డారు. 2019 వరకూ చంద్రశేఖర్ రెడ్డి అసలు రెడ్‌క్రాస్ మెంబరే కాదన్నారు. 2019లో మొదటిసారి మెంబర్ అయినప్పటి నుంచి ఇప్పటివరకూ ఒక్క చుక్క బ్లడ్ కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. రెడ్ క్రాస్ చైర్మన్‌గా ఏదో ఉద్ధరించినట్లు చెబుతున్న చంద్రశేఖర్‌రెడ్డి గతం మర్చిపోయి మాట్లాడుతున్నాడన్నారు. చంద్రశేఖర్ రెడ్డికి, ఆయన నాయకుడికి మైండ్ పోయిందన్నారు. నెల్లూరులో మొదటిసారి రెడ్ క్రాస్‌ను స్థాపించింది రామచంద్రనాయుడు, సీవీ సుబ్రహ్మణ్యం అని గుర్తు చేశారు. రెడ్‌క్రాస్‌లో ఎప్పుడూ రాజకీయాలు లేవన్నారు.
చంద్రశేఖర్‌రెడ్డి రెడ్ క్రాస్ చైర్మన్ ఎలా అయ్యాడని ప్రశ్నించుకుంటే దొడ్డి దారిలో అని సమాధానం వస్తుందన్నారు. మనోహర్ రెడ్డి ప్యానల్ గెలిస్తే వెన్నుపోటు పొడిచి చంద్రశేఖర్‌రెడ్డి ప్రెసిడెంట్ అయ్యాడన్నారు. రెడ్ క్రాస్ ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డి ప్యానల్ గెలవలేదని తెలిపారు. మంత్రి నారాయణ గురించి చంద్రశేఖర్‌రెడ్డి లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడన్నారు. నెల్లూరు కోసం మంత్రి నారాయణ చేసిన మంచి కూడా ప్రజలకు చెప్పాలన్నారు. నారాయణ హాస్పిటల్ ద్వారా ప్రజలకు చేస్తున్న సేవ కూడా చెప్పాలన్నారు. చంద్రశేఖరరెడ్డి రాజీనామాకు మంత్రి నారాయణకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. రెడ్ క్రాస్ ఎంవోయూ అడిగితే తప్పేంటని నిలదీశారు. మంత్రి నారాయణ నిజంగా బెదిరించాలనుకుంటే ఒక్క స్కూల్ కూడా నడపలేవని హెచ్చరించారు. మంత్రి నారాయణ ఎప్పుడూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదన్నారు. నారాయణను మీరు, మీ నాయకుడు జగన్ ఎలా ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసన్నారు. చంద్రశేఖర్ లాంటి బచ్చాగాళ్ళకు స్పాట్ పెట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు. నెల్లూరు ప్రజలే చంద్రశేఖర్‌రెడ్డికి స్పాట్ పెడతారని హెచ్చరించారు.