- సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ
అమరావతి(చైతన్యరథం): ఇరిగేషన్ శాఖలో డీఈ నుంచి సీఈ స్థాయి వరకు అడహాక్ పదోన్నతులు కల్పించేందుకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు అనుగు ణంగా చర్యలు తీసుకోవాలని ఇంజనీర్స్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం జలవన రుల మంత్రి నిమ్మల రామానాయుడును కోరారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పదోన్నతుల వల్ల వందల సంఖ్యలో ఉద్యోగులు లబ్ధిపొందుతారని, గత ఐదేళ్ల నుంచి పదోన్నతులు లేకపోవడం వల్ల ఎంతో నష్టపోయామని వివరించారు. జగన్‌రెడ్డి తుగ్లక్ పాలన ఫలితంగా అన్ని శాఖల ఉద్యోగు లు తీవ్రంగా నష్టపోయారని వివరించారు. స్పందించిన మంత్రి అడహాక్ పదోన్నతులకు ఉన్న అడ్డంకులను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దీంతో సభ్యులు, ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు.