- విజయసాయిరెడ్డి, అనుచరుల హస్తం
- విచారణ జరిపిస్తే వెలుగులోకి వాస్తవాలు
- ప్రజావినతుల కార్యక్రమంలో ఫిర్యాదు
- వైసీపీ నేతల భూ కబ్జాలపైనే అర్జీలు
- రీసర్వేలో ఒకరి భూమిని మరొకరికి
- కబ్జాకోరులకు అండగా గోరంట్ల మాధవ్
- వినతులు స్వీకరించిన మంత్రి వాసంశెట్టి
మంగళవారం(చైతన్యరథం): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ మెట్రోపాలి టన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) బృహత్తర ప్రణాళికలో అనేక అవకతవకలు జరిగాయని భీమిలికి చెందిన మాదవ రవికుమార్ అనే వ్యక్తి సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. దీని వెనుక విజయసాయిరెడ్డి, ఆయన అనుచరుల హస్తం ఉందని తెలిపాడు. మాస్టర్ ప్లాన్ అమలుపై విచారణ చేపడితే జరిగిన అక్రమాలు బయటపడతాయని, ఇష్టానుసారంగా మాస్టర్ ప్లాన్‌ను మార్చుకుని వైసీపీ నేతలు దోచుకున్నారని వివరించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్, ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ గౌడ్ ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.
` తమకు అనంతపురంలో ఉన్న ఇంటిని డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఎస్.ఫక్రూద్దీన్ అనే వ్యక్తి ఇబ్బంది పెడుతున్నాడని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండ లం రుట్టక్రిందపల్లి గ్రామానికి చెందిన ఎం.గంగాధర్ ఫిర్యాదు చేశాడు. ప్రస్తుత వైసీపీ నాయకుడు గోరంట్ల మాధవ్ సీఐగా ఉన్నప్పుడు కబ్జాదారులకు అండగా ఉండి తమను ఇబ్బంది పెట్టాడని వివరించారు. దీనిపై కోర్టుకు వెళ్లగా తమకు కోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చిందని, అయినా అధికారులు మాత్రం తమకు సహకరించడం లేదని తెలి పారు.
` తమ పక్కా ఆధారాలు ఉన్నా అధికారులు తమ పొలాన్ని నిషేధిత జాబితాలో చేర్చి తొలగించమంటే పట్టించుకోవడం లేదని కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఎ.మల్లవరం గ్రామానికి చెందిన యోన్ముల చిట్టమ్మ ఫిర్యాదు చేసింది. తమ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించి న్యాయం చేయాలని కోరింది.
` సెర్ఫ్ సంస్థలో పనిచేస్తూ పదవీ విరమణ చేసిన సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన విధంగా విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పొడిగించాలని పలువురు సెర్ప్ రిటైర్డ్ ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు.
` చదుల్ల గ్రామంలో తమ భూమిని దాయాదులు ఆక్రమించుకున్నారని అనంతపు రం నగరానికి చెందిన గోనుగుంట్ల లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశాడు. తమ భూమిని కబ్జా నుంచి విడిపించి న్యాయం చేయాలని వేడుకున్నాడు.
` గత ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే కారణంగా తన భూమి మరొకరి పేరుపైకి మారిందని తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం ఎమ్‌ఆర్‌పాలెంకు చెందిన ఉం డమట్ల శ్రీనివాస్ తెలిపారు. దానిని సరిచేసి తమ పేరుపైకి మార్చాలని కోరారు.
` తన తండ్రి నుంచి తనకు రావాల్సిన భూమిని వైసీపీ నేతలు ఆన్‌లైన్‌లో పేర్లు మార్చి కబ్జా చేశారని విజయనగరానికి చెందిన బంధపు దేముడు ఫిర్యాదు చేశాడు. తనకు వారసత్వంగా రావాల్సిన భూమిని కబ్జా నుంచి విడిపించాలని వేడుకున్నాడు.