అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ జగన్ ముఠానే. చిన్నాన్న హంతకుల్ని కాపాడుతున్నారు. తల్లి, చెల్లిపై వికృత పోస్టులు పెట్టించారు. సెక్యూరిటీ తగ్గించి పరిటాల రవిని పిరికి పద్ధతుల్లో చంపించారు. ఇలా ఎన్నో.. ఎన్నెనో అరాచకాలు చేశారు. ఐదేళ్లపాటు టెర్రరిస్టు పరిపాలన సాగించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు. ప్రజల ధన, మాన ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేకుండా చేశారు. అరాచకాల్ని, అడ్డమైన దోపిడీని కోర్టు బోనులో నిలబెట్టి కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది. ప్రజాస్వామ్య పరిరక్షణకు మాఫియాలకు, పొలిటికల్ టెర్రరిస్టులకు చుక్కలు చూపుతుంది. గుడ్డి బెదిరింపులకు గట్టిగా సమాధానం చెబుతుంది. ఆధారాలు లేకుండా చంద్రబాబుపై అక్రమకేసులు పెట్టి కోర్టుల్లో మొట్టికాయలు వేయించుకొన్నది జగనే కానీ, చంద్రబాబు కాదు. చంద్రబాబు దైర్యంగా కోర్టుకు హాజరయ్యారు. తనవాదన చెప్పారు. జగన్ వందలాది కోర్టు వాయిదాలకు ఎందుకు హాజరుకాలేదు? ఇది పులి చేసే పనేనా? ‘‘మేము ఏదైనా చేయాలనుకొన్నా… తెరచాటు చేయం- మీకంటే బలంగా కొట్టగలిగే శక్తి వైసీపీకి వుంది. మేం కొట్టాలనుకుంటే పులి పంజా అంత గట్టిగా కొట్టగలం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి ఫ్యాక్షనిస్టు భాష మాట్లాడుతున్నాడు. బల్లాల దేవుడు బలంగా కొట్టి కొట్టి చివరకు బహుబలి ప్రజాబాహుళ్యం పదఘట్టనలలో ఏమయ్యాడు? 2024 ఎన్నికలో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కొట్టిన దెబ్బకు 11 సీట్లకే పరిమితమైనా వైసీపీల బుద్ధి మారలేదు. ఆత్మ విమర్శలేదు. చేసిన తప్పులు చేస్తూ తమను నమ్ముకొన్న కార్యకర్తలకు, నాయకులకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. మీరు చేసేవన్నీ తెరచాటు పనులే. కోడికత్తి, గులకరాయి, రత్నాచల్ ఎక్సప్రెస్ తగలబెట్టడంలాంటి తెరచాటు పనులెన్నో! పులులు, ప్రజాస్వామ్యవాదులైతే వివేకానందరెడ్డిని తెరచాటున క్రూరంగా హత్య చేయించి, గొడ్డలివేటును గుండెపోటుగా! సాక్షిలో స్క్రోలింగ్స్ ఎందుకు ఇచ్చారు? ప్రతిపక్షనేతగా, సీఎంగా, కుటంబపెద్దగా అన్ని విధాలా వైఫల్యం చెందింది జగనేగానీ కూటమి ప్రభుత్వం కాదు. జగన్ ప్రభుత్వం ఖజానాను దివాళా తీయించినా చంద్రబాబు తన అనుభవం, కఠోర కష్టంతో కూటమిపక్షాల తోడ్పాటుతో ఆరు నెలల్లోనే నాలుగు వందలకు పైగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందించి ప్రజల అభిమానం చూరగొన్నది. బైటపడుతున్న కుంభకోణాల నుంచి డైవర్షన్ రాజకీయాలు చేయాల్సిన అవసరం జగన్‌దేగానీ చంద్రబాబుకు అవసరం లేదు. తమ అవలక్షణాల్ని ఎదుటివారికి అంటగట్టి.. చెప్పిన అబద్ధం వందసార్లు చెప్పడం జగన్ ముఠా నైజం. జగన్ ఐదేళ్ళ అరాచక, దోపిడీ పాలనపై ఆత్మవిమర్శ చేసుకొంటే మంచిది. అలాకాకుండా బెదిరింపులు, కుట్రలకు దిగితే వైకాపాగల్లంతే!
`గురజాల మాల్యాద్రి,
ఛైర్మన్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్