- కెపాసిటీ బిల్డింగ్ కమిషన్‌తో సీఎం భేటీ
- ‘ఎక్స్’ పోస్టులో వెల్లడిరచిన చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): అమరావతిలో గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ ఏర్పాటుకు సహకరించాలని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. మంగళవారం సచివాలంలో కమిషన్ ఛైర్మన్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి.. ప్రభుత్వ విధానాలు, గుడ్ గవర్నెన్స్ దిశగా అనుసరిస్తున్న అంశాలను వివరించారు. సమావేశ సారాంశాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. ‘జ్ఞానంతో నడిచే ఆర్థిక వ్యవస్థలో తాజా నైపుణ్యాలతో ఎప్పటికప్పుడు సర్వసన్నద్ధం కావడం చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్‌లో పాలనా సామర్థ్యాన్ని పెంపొందించే మా ప్రయత్నాలలో భాగంగా సామర్థ్య నిర్మాణ కమిషన్ నుంచి శిక్షణా విధాన సిఫార్సులను ఆమోదించినందుకు సంతోషిస్తున్నాను. పరివర్తనాత్మక సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను నడపడానికి అమరావతిలో ‘గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్’ని స్థాపించడానికి ఈ సిఫార్సులు పునాదిగా ఉపయోగపడతాయి.
మిషన్ కర్మయోగి వంటి కీలక కార్యక్రమాలు, సమగ్ర నైపుణ్య జనాభా గణన ద్వారా మార్గనిర్దేశం చేయబడిన లక్ష్య నైపుణ్య అభివృద్ధికి ఏఐవంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, వ్యవసాయం, విద్య మరియు ఆరోగ్యంవంటి కీలక విభాగాలకు ఉపకరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్పాదకత మరియు సామర్థ్యాన్ని పెంపొందించడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాలు సహా వినూత్న వర్క్ స్పేస్ సొల్యూషన్లను అన్వేషిస్తోంది. అందులో భాగంగా మంగళవారం అమరావతిలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ (సీబీసీ) ఛైర్మన్ ఆదిల్ జైనుల్‌భాయ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమయ్యాను. అమరావతిలో గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ ఏర్పాటుకు సహకరించాలని కోరాను’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తన ‘ఎక్స్’ వేదికపై పోస్టు పెట్టారు.