- తాను చేసిన పాపాన్ని కప్పెట్టి ధర్నాకు దిగుతున్నాడు
- విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతికి పాల్పడ్డారు
- విచారణ తర్వాత మొత్తం బండారం బయటపడుతుంది
- విచ్చలవిడిగా ప్రజలపై భారం మోపి విషం చిమ్ముతున్నారు
- విద్యుత్ భారాలపై దమ్ముంటే జగన్‌రెడ్డి చర్చకు రావాలి
- టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య సవాల్
మంగళగిరి(చైతన్యరథం): విద్యుత్ భారాలపై వైసీపీ నేతలకు దమ్ముంటే చర్చకు రావాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య సవాల్ విసిరారు. గురు వారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలన అంతా అవినీతిమయం, ఆయన మాట్లాడే ప్రతి మాట అబద్ధా ల మూటేనని మండిపడ్డారు. జగన్ అవినీతి వల్ల ప్రజలపై పడిన విద్యుత్ భారం రూ.1.29 లక్షల కోట్లు. విద్యుత్ చార్జీల పెంపు పాపం జగన్‌రెడ్డిదే.. దీనిపై చర్చకు వచ్చే ధైర్యం జగన్‌రెడ్డికి ఉందా? అని సవాల్ విసిరారు. ఆయన ఎవరి మీద ధర్నా చేస్తారు? నాడు తాను చేసిన అవినీతి పరిపాలన మీద ధర్నా చేస్తాడా? తన చేతగాని పాలన వల్ల వినియోగదారులపై పడిన విద్యుత్ చార్జీల భారం రూ.32,166 కోట్లు, విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు రూ.49,596 కోట్లు, వీటీపీఎస్, కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ల ఏర్పాటులో జాప్యంతో ప్రజలపై పడిన భారం రూ.12,818 కోట్లు, పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మాణం జాప్యంతో ప్రజలపై పడిన భారం రూ.4,737 కోట్లు, స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో కలిగిన నష్టం రూ.2,691 కోట్లు, ఏడాదికి 7000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోళ్లతో (సెకి) వచ్చే నష్టం రూ.3,850 కోట్లు, దీనిలో రూ.1700 కోట్లు జగన్‌రెడ్డి కొట్టేశారని అమెరికా కోర్టులో కేసు ఉంది.
విద్యుత్ రంగంలో చేసిన అప్పులపై పడిన వడ్డీ భారం రూ.10,892 కోట్లు..ఈ భారాలన్నీ మీ నిర్వాకం వల్ల కాదా జగన్‌రెడ్డి? మీ అసమర్థ పాలనలో ఏపీ డీస్కంలు, ఏపీఎస్‌పీడీసీఎల్ నిర్వహణ వైఫల్యాలతో వచ్చిన నష్టం రూ.9,618 కోట్లు. మీ అవినీతి కోసం ఇక్కడ జెన్‌కో ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి తగ్గించడం వాస్తవం కాదా? దానివల్ల కలిగిన నష్టం రూ.3,135 కోట్లు. విజయసాయిరెడ్డికి చెందిన నాసిరకం బొగ్గు కొనుగోళ్ల వల్లే జెన్‌కో ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి తగ్గిందనేది నిజం కాదా? అని ప్రశ్నించారు. మొత్తంగా మీ అవినీతి నిర్వాకంతో కలిగిన రూ.1,29, 503 కోట్ల నష్టంతోనే నేడు ప్రజలపై ఆ విద్యుత్ భారాలు పడ్డాయి. చేయాల్సిందం తా చేసి నేడు అమాయకపు సుద్దపూసలా ధర్నా అంటే జనాలు ఛీకొట్టక తప్పదు. విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతోంది..మీ బండారం త్వరలోనే బయటపడుతుందని స్పష్టం చేశారు.
ఒక్క విద్యుత్ ప్లాంట్ అయినా ప్రారంభించారా?
జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో ఏదైనా ఒక్క కొత్త విద్యుత్ ప్లాంట్ అయినా ప్రారంభిం చారా? విద్యుత్ వెలుగులకు ఆధ్యుడు చంద్రబాబు. 1995`2024 చంద్రబాబు పాలనలో 5 మెగావాట్ల విద్యుత్ ఉత్తత్పిని చంద్రబాబు పెంచారు. 2014 -2019 రాష్ట్ర విభజన తరువాత పెంచిన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 9,463 మెగావాట్లు. రాష్ట్రంలో మొత్తం 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిలో చంద్రబాబు తెచ్చిన విద్యుత్ ఉత్పత్తే 15 వేల మెగావాట్లు. రాష్ట వ్యాప్తంగా 21 లక్షల వీధి దీపాలను ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుది. జగన్ ఐదేళ్ల పాలనలో ఒక్క వీధి దీపమైన పెట్టారా? దీనిపై బహిరంగ చర్చకు వస్తారా? 1998లో ఏపీలో విద్యుత్ సంస్కరణల చట్టం తీసుకు వచ్చిందే చంద్రబాబు. 2019లో కూడా మేము అధికారంలో ఉండి ఉంటే నేడు ఈ విద్యుత్ చార్జీల బాధుడు ఉండేది కాదు. మీ పాపాన్ని నాడు ఆ ఏసు ప్రభువు శిలువ మోసినట్లు నేడు చంద్రబాబు మోస్తున్నాడు. ఐదేళ్లలో మీరు తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలను దోచుకున్నారు.
నాడు మీరు మార్కెట్‌లో విచ్చలవి డిగా విద్యుత్ కొనుగోళ్లు చేయడంతో 2022-23లో రూ.6,072 కోట్లు, 2023-24 లో రూ.9,412 కోట్లు ప్రజలపై భారం మోపారు. ఇప్పుడు ఈ భారం మీ పాపం కాదని చెప్పే ధైర్యం మీకు ఉందా? మాజీ మంత్రి రోజా జగన్‌రెడ్డిని బిజినెస్ మ్యాన్, ఫ్యామిలీ మ్యాన్‌గా సక్సెస్ అయ్యారు అంటున్నారు.. అవును మంచి బిజినెస్ చేసి రూ. 43 వేల కోట్ల ప్రజాధనం కొట్టేశారని సీబీఐ కూడా చెప్పింది. తల్లి, చెల్లి, బాబాయి కూతురు, బాబాయి, బామ్మర్థులను కాదన్న ఈయన ఏ విధంగా ఫ్యామిలీ మెన్? ఫ్యామిలీ అంటే జగన్‌రెడ్డి, ఆయన భార్య భారతీరెడ్డిగారేనా? అని ప్రశ్నించారు. ఫ్యామిలీ అంటే చంద్రబాబు ఫ్యామిలా ఉండాలి. వైసీపీ నేతలు అబద్ధాలతో ప్రజలను ఏమార్చాలనుకుంటే చివరకు గెలిచేది నిజమే అని తెలుసుకోవాలని హితవుపలికారు.