అన్నపూర్ణగా పేరుగాంచిన రాష్ట్రంలో అన్నదాత కంట కన్నీరు పెట్టించి వారి జీవితాలు తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయేలా చేసిన ‘రైతు ద్రోహి‘ జగన్‌రెడ్డి. రైతాంగ సమస్యలపై అవగాహన లేని ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండగా ఏ రోజూ రైతాంగ సమస్యలు, సంక్షేమాన్ని పట్టించుకోలేదు. రాష్ట్ర చరిత్రలో వ్యవసాయాన్ని, రైతాంగాన్ని ఇంతగా విస్మరించిన ఏకైక ప్రభుత్వం జగన్‌రెడ్డి ప్రభుత్వమే. రైతులకు పథకాలు, సబ్సిడీలు అందకుండా చేసి..కనీస గిట్టుబాటు ధర లేకుండా చేసి..ఆత్మహత్యలకు పురిగొల్పి..రైతాంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన ఏకైక పాలకుడు జగన్‌రెడ్డి అనటం లో సందేహం లేదు.
జగన్ పాలన కౌలు రైతులపాలిట కష్టాలు
రాష్ట్రంలో 70% భూమి సాగు చేస్తున్న కౌలు రైతుల్లో బడుగు బలహీనవర్గాలే వారే ఎక్కువ. కౌలు రైతులను ఆదుకుంటామని, ప్రభుత్వ పథకాలు అందిస్తామని ఎన్నికల ముందు అనేక హామీలిచ్చినా జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కౌలు రైతులను పట్టించుకోలేదు. ప్రతి రైతు కుటుంబానికి రూ.13,500 చొప్పున ఏడాదికి రూ.2073 కోట్లు.. ఐదేళ్లకు రూ.10,365 కోట్లు ఇవ్వాలి. కానీ రాష్ట్రంలో మొత్తం 24 లక్షల మంది కౌలు రైతులు ఉంటే ఏడాదికి సరాసరిన 1,07,627 మందికి చొప్పున ఐదేళ్లలో రూ.726 కోట్లు మాత్రమే ఇచ్చారు. రైతుబిడ్డనని చెప్పే జగన్ కౌలు రైతులకు రూ.9,639 కోట్లు ఎగ్గొట్టారు. పైగా తాను ఇచ్చిన ఇంత భారీ మొత్తాన్ని ఒకే విడతలో రైతుల చేతికి అందించడం దేశ చరిత్రలో ఎక్కడా లేదంటూ బీరాలు పలికాడు. రైతు భరోసా కేంద్రానికి వెళితే అక్కడ సీసీఆర్‌సీ కార్డు అందుబాటులో ఉంటుందన్న జగన్ హామీ నీటి మీద రాతే అయింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కౌలు రైతులకు మాత్రమే అరకొరగా రైతు భరోసా వర్తింపజేశారు. వారిలోనూ అందరికీ సాయం చేయలేదు.
భరోసానివ్వని రైతు భరోసా
ఎన్నికలకు ముందు ఊరూరా తిరిగిన జగన్‌రెడ్డి రూ.12 వేలు రైతు భరోసాగా ఇస్తానని ప్రగల్భాలు పలికి గెలిచాక మాట మార్చి రాష్ట్ర వాటా..కేంద్ర వాటా అంటూ కోతలు పెట్టాడు. రైతు భరోసా పేరుతో ఒక్కో రైతుకు రూ.7500 చేతిలో పెట్టి….కేంద్రం ఇస్తున్న రూ.6000 కూడా తన గొప్పగా చెప్పుకున్న నీచుడు..అంతేకాక మూడు విడతల్లో ఇచ్చి ప్రజలను మభ్య పెట్టాడు. తానేదో రైతులకు మేలు చేస్తున్నట్లు డాంబికాలు పలకడమే గాని రైతులకు చేసింది ఏమీలేదు..ఆగ్రవర్ణాల కౌలు రైతులకు కులం పేరుతో విడదీసి వారికి కౌలు రైతుకు అందాల్సిన డబ్బును కూడా నిలిపేసిన ఘనుడు జగన్‌రెడ్డి. దేశంలో ఎక్కడా ఇలా కులం ఆధారంగా రైతుకు అందే సాయం నిలపలేదు. 15.36 లక్షల మంది ఉన్న కౌలు రైతులను 1,58,123 మందికి తగ్గించారు. (ఆర్టీఐ ఆధారం). ఇది నమ్మకద్రోహం కాదా?
జగన్‌రెడ్డి పాలనలో రైతు ఆత్మహత్యల్లో టాప్‌లో ఏపీ
జగన్‌రెడ్డి పాలనలో రైతు వ్యతిరేక విధానాలతో రైతు ఆత్మహత్యల రాష్ట్రంగా మారిపోయిందనేది ముమ్మాటికీ నిజం. ఎందుకంటే కౌలు రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే 2వ స్థానం, రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానంలోకి చేరిందంటే జగన్ రెడ్డి చలవేకదా.. రాష్ట్రంలో వైసీపీ హయాంలో 3 వేల పైచిలుకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారనేది సత్యం. కనీసం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం రూ.5లక్షల నుంచి 7 లక్షలకు పెంచుతామని గొప్పగా చెప్పారు. 5 ఏళ్లలో 672 కుటుంబాలకు కేవలం రూ.47 కోట్లు మాత్రమే ఇచ్చారు. కనీసం పరిహారం కూడా సరైన సమయంలో అందించకుండా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను రోడ్డున పడేశాడు..గత ఐదేళ్లలో ఏ ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు కూడా లేవు. ఒక దొంగలా పరదాల చాటున దాక్కున్న జగన్‌రెడ్డికి రైతుల కష్టాలు ఎందుకు అర్థం అవుతాయి.
ధాన్యం సేకరణలో రైతుకు తీవ్ర అన్యాయం
జగన్ పాలనలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కుంభకోణాల మయంగా మారింది. ధాన్యం కోనుగోలు చేయాలంటే 75 కిలోల ధాన్యం బస్తాకు రూ.100 నుంచి రూ.200 వరకు అదనంగా వసూలు చేశారు. రవాణా, హమాలీ ఖర్చులన్నీ పెట్టుకుని వాహనంలోకి బస్తాలెక్కించి మిల్లులకు పంపిస్తే ఎదురు సొమ్ము చెల్లించాలని మిల్లర్లు డిమాండ్ చేసిన వైనం వైసీపీ హయాంలో జరిగింది. ఎకరం వరి సాగుకు రూ.60 వేల దాకా ఖర్చవుతుంటే వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.6 వేలు మాత్రమే. అంటే 10 శాతం అన్నమాట. అంతేకాక వైసీపీ నేతలు, దళారులు, మిల్లర్లు కలిసి రైతులను దోచు కున్నారు. క్వింటాకు 20 కిలోల ధాన్యాన్ని అదనంగా గుంజుకున్నారు.
నాడు ఫేక్ అకౌంట్లతో రూ.150 కోట్ల అవినీతి
2800 ఫేక్ ఖాతాలు సృష్టించి దాదాపు రూ.150 కోట్ల అవినీతి జరిగిందని సాక్షాత్తూ సివిల్ కార్పొరేషన్ ఎండీ వీరపాండ్యన్ ధృవీకరించారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ సమయానికి 8 లక్షల టన్నుల ధాన్యం సేకరణ చేస్తే కూటమి ప్రభుత్వంలో ఈ సమయానికి 25 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. ఈ విషయంతో రైతులను ఏ విధంగా దగా చేశారో అర్థమవుతుంది. ధాన్యం సొమ్ము చెల్లింపులో మూడు నెలలు జాప్యం చేశాడు జగన్‌రెడ్డి. కూటమి ప్రభుత్వంలో ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే రైతు ఖాతాల్లో జమ చేసింది. ఇదిరా మంచి ప్రభుత్వం అంటే అనేలా కూటమి ప్రభుత్వం రైతుల మెప్పుపొందింది.
జగన్‌రెడ్డి రైతన్నకు చేసిన నష్టం వివరాలు (కోట్లలో)
43 లక్షల టన్నుల ధాన్యంపై రూ.2,580 కోట్లు
తేమ పేరుతో రూ.1000 కోట్లు
బియ్యం కుంభకోణం రూ.7000 కోట్లు
మొత్తం నష్టం రూ.51,080 కోట్లు
ఇన్‌పుట్ సబ్సిడీ
2016-17లో ఒక్క ఏడాదే చంద్రన్న రూ.1,820 కోట్లు ఇచ్చారు. ఐదేళ్లలో రూ.3,759 కోట్లు ఇచ్చారు. 40 లక్షల మందికి లబ్ధి జరిగింది. వైసీపీ పాలనలో రూ.15 వేల పంట ఉత్పత్తులను రైతులు కోల్పోతే జగన్‌రెడ్డి 29-12-20న రూ.646 కోట్లు చెల్లించి చేతులు దులుపుకున్నారు.
డెయిరీ రైతుల సమస్యలు
అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాదిలో సహకార రంగాన్ని పునరుద్ధరిస్తామని చెప్పి..రెండో ఏడాది నుంచి సహకార డెయిరీలకు పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటరుకు రూ.4 చొప్పున రాయితీ ఇస్తామని హామీ ఇచ్చి మడమ తిప్పారు. చిత్తూరు డెయిరీని ఏకంగా 99 ఏళ్ల పాటు లీజుకిచ్చారు. ఎన్నికలకు ముందు లీటర్ పాలకు రూ.4 బోనస్ ఇస్తామనే హామీపై మాటతప్పి మడమతిప్పి పాడి రైతులకు ద్రోహం చేస్తున్నారు. రూ.4 బోనస్ కింద రైతులకు రూ.1,108 కోట్లు జగన్‌రెడ్డి చెల్లించనే లేదు. పైగా జగన్ పరాయి రాష్ట్ర అమూల్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు.
అన్నదాతలను ఆదుకున్న చంద్రన్న (2014-19)
1 రైతు రుణమాఫీ రూ.15,279 కోట్లు
2 పంట బీమా రూ.4,007 కోట్లు
3 ఇన్ పుట్ సబ్సీడీ రూ.3,759 కోట్లు
4 ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులు రూ.6,278 కోట్లు
5 మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ రూ.3,556 కోట్లు
6 వడ్డీ లేని రుణాలు రూ.1700 కోట్లు (డి)
7 యాంత్ర పరికరాలు, రైతు రథం రూ.1,277 కోట్లు
8 మైక్రో ఇరిగేషన్ రూ.1250 కోట్లు
9 మెగాసీడ్ పార్క్ రూ.670 కోట్లు
10 పెరటి జంతువుల అభివృద్ధి కోసం
(కోళ్లు, మేకలు, గొర్రెలు)రూ.575 కోట్లు
11 కోళ్ల పరిశ్రమకు చేయూత రూ.573 కోట్లు
12 ఉద్యానరంగం అభివృద్ధికి చేయూత రూ.424 కోట్లు
13 నాణ్యమైన ఫీడ్ కోసం ఫాడర్ సెక్యూరిటీ
పాలసీరూ.250 కోట్లు
14 సూక్ష్మపోషకాలు రూ.247 కోట్లు
15 మార్కెట్ యార్డుల అభివృద్ధికి రూ.242 కోట్లు
16 యంత్ర పరికరాల సబ్సిడీ రూ.202 కోట్లు
17 రైతుబంధు పథకం రూ.186 కోట్లు
18 మౌలిక వసతులకు మార్కెటింగ్ శాఖ
ఖర్చు పెట్టిన నిధులురూ.109 కోట్లు
19 కోల్డ్ స్టోరేజీల అభివృద్ధికి రూ.65 కోట్లు
20 సెరీ కల్చర్ అభివృద్ధికి సాయం రూ.63.61 కోట్లు
21 పశువుల బీమా రూ.50 కోట్లు
22 64 రైతుబజార్ల అభివృద్ధికి రూ.10 కోట్లు
మొత్తంరూ.40,772 కోట్లు
ఐదేళ్ల జగన్‌రెడ్డి పాలనలో దగా పడ్డ రైతు
1 రైతు భరోసా రూ.14,000 కోట్లు
2 పంటల బీమా రూ.6,684 కోట్లు
3 ఇన్ పుట్ సబ్సీడీ రూ.1,834.78 కోట్లు
4 సున్నా వడ్డీ పంట రుణాలు రూ.1834.55 కోట్లు
5 వైఎస్‌ఆర్ యంత్రసేవా పథకం రూ.690 కోట్లు
6 శనగ రైతులకు బోనస్ రూ.300 కోట్లు
7 ఆయిల్ పామ్ రైతులకు సబ్సీడీ రూ.85 కోట్లు
మొత్తంరూ.25,428 కోట్లు
రైతులకు కూటమి ప్రభుత్వం భరోసా
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు మేలు చేసే దిశగా కృషి చేస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ధాన్యం బకాయిలను రూ.1,674 కోట్లు కూటమి ప్రభుత్వం విడుదల చేసి రైతును ఆదుకుంది. అంతేకాకుండా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు సాగుదారుల హక్కు చట్టం -2024 తీసుకువచ్చి రైతుకు దన్నుగా నిలబడిరది. ఈ-పంట ద్వారా 21 జిల్లాల్లో పంట నష్టపోయిన 1.90 లక్షల మంది రైతులకు రూ.284.56 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకానికి రూ.4,500 కోట్లు, బుడమేరు బాధిత రైతులకు 20 రోజుల్లోనే రూ.320 కోట్లు, జూలైలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు రూ.36 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేసి రాష్ట్రవ్యాప్తంగా 1.44 లక్షల మంది రైతులు పంట నష్టపోగా పరిహారంగా రూ.159.2 కోట్లను మంజూరు చేసి ఇది కదా మంచి ప్రభుత్వం అనేలా కూటమి ప్రభుత్వం దూసుకుపోతోంది.
` తోట నిర్మలా జ్యోతి
అనలిస్టు