- వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం
- ఏపీ సీడ్స్, మార్కెఫెడ్ అధికారులతో సమీక్ష
మంగళగిరి(చైతన్యరథం): రాష్ట్రవ్యాప్తంగా విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రతిఏటా జిల్లాస్థాయిలో కలెక్టర్, అధికారులు, జిల్లా మం త్రులు, ఎమ్మెల్యేలు ఆయా జిల్లాల్లో పండే పంటలకు అనుగుణంగా అవసరమైన విత్తనా లు, ఎరువులకు నివేదిక అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. సచివాలయంలో సోమవారం ఉదయం ఏపీ సీడ్స్, మార్క్ఫెడ్, ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నా యుడు సమీక్షించారు. ఏపి సీడ్స్ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు రాయితీపై అం దించే అవకాశాలు మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో మెగా సీడ్ పార్క్ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా 16 ప్రదేశాల్లో 750 ఎకరాల్లో అందుబాటులో ఉన్న విత్తన ఉత్పత్తి క్షేత్రాలను నూరు శాతం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిరుధాన్యాలు, తృణధాన్యాలు సాగు, వినియోగం పెంచే విధంగా విత్తన దశ నుంచే రాయితీ అందించేందుకు, సాగు ప్రోత్స హించేందుకు కృషి చేయాలని సూచనలు చేశారు. రైతులకు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు 35 శాతం రాయితీపై గోదాములు అద్దెకు ఇచ్చి గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత విక్రయించే వెసులుబాటు కల్పించాలని ఆదేశించారు. వేర్ హౌసింగ్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న గోదాములు నూరు శాతం ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గోదాముల మరమ్మతులు, అవసరమైన సిబ్బంది నియామకానికి తక్షణ చర్యలు చేపట్టి కార్పొరేషన్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాయితీపై రైతులకు పచ్చి రొట్ట ఎరువుల విత్తనాలు అందించి భూసారం పెంపు, నాణ్యమైన దిగుబడి వృద్ధికి కృషి చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పొలం పిలు స్తోంది కార్యక్రమాల్లో రైతులకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను అవగాహన కల్పించి నూరు శాతం సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామస్థాయి లో స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎరువులు అవసరం మేరకు సరఫరా చేసి రైతులకు ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని మార్క్ఫెడ్ అధికారులను ఆదేశించారు. ఎరువులు నల్లబజారులో అధిక ధరలకు విక్రయించే పరిస్థితి ఉండకూడదని, సహకార సంఘాల్లో ఎరువులు అవసరం మేరకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, వ్యవసాయ శాఖ కమిషనర్ ఢల్లీిరా వు, మార్క్ఫెడ్ ఎండీ మంజీర్ జిలానీ సమాన్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ సురేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.