- ఇప్పటివరకు 6.39 లక్షల మంది రిజిస్ట్రేషన్
- 77.09 వేల దరఖాస్తులు..6.5 వేల ఇన్‌స్టాలేషన్లు
- మొత్తం రూ.25.27 కోట్ల సబ్సిడీ విడుదల
- బయోగ్యాస్ ప్లాంట్లకు భూములు కేటాయించాలి
- ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్
అమరావతి(చైతన్యరథం): పీఎం సూర్యఘర్ యోజన కింద నేషనల్ పోర్టల్ ద్వారా ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ కింద 6.39 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రెండోరోజు గురువారం సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యఘర్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి లో 77.09 వేల మంది దరఖాస్తు చేసుకోగా వీటిలో 6.5 వేల ఇన్‌స్టాలేషన్లు మొత్తం లోడ్ 24,339 కిలోవాట్స్ పూర్తయినట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా కేంద్రం ఒక్కో కిలోవాట్‌కు రూ.30 వేలు, రెండు కిలోవాట్లకు రూ.60 వేలు, 3 కిలోవాట్లకు రూ.78 వేలు రాయితీ ఇస్తుందని వివరించారు. జిల్లా కలెక్టర్లు ఈ పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించి రిజిస్ట్రేషన్లు, ఇన్‌స్టాలేషన్లు పెరిగేలా చూడాలని సూచించారు. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఏపీఈపీడీసీఎల్ కింద రూ.10.88 కోట్లు, ఏపీసీపీడీసీఎల్ కింద రూ.7.74 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్ కింద రూ.6.64 కోట్లు కలిపి మొత్తంగా రూ.25.27 కోట్లను సబ్సిడీగా విడుదల చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వినియోగదా రుల కోసం గృహోపకరణాల కింద ఉచితంగా ఇన్‌స్టాలేషన్‌లను చేపట్టాలని యోచిస్తోం దని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఈపీడీసీఎల్ కింద 6,77,146 మంది, ఏపీసీపీ డీసీఎల్ కింద 5,90,587 మంది, ఏపీఎస్పీడీసీఎల్ కింద 7,42,947 మంది మొత్తంగా 20,17,947 మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు ఉన్నారు. వీరితో రిజిస్ట్రేషన్ చేస్తే ఒక గేమ్ ఛేంజర్ అవుతుంది. ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల రూఫ్ టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని సూచించారు.
పీఎం కుసుమ్ కింద ప్లాంట్లు
ఇందులో మూడు స్కీమ్స్ ఉన్నాయి. మనం కాంపోనెంట్-సీ కింద మొత్తం 3,725 మెగావాట్ల సామర్థ్యంతో వ్యవసాయ ఫీడర్లను సోలారైజ్ చేయడానికి ప్రతిపాదించడం జరిగింది. 0.5 నుంచి 5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల స్థాపన కోసం ఒక మెగావాట్ కు సంబంధించి ప్రభుత్వానికి చెందిన 5 ఎకరాలను గుర్తించాల్సి ఉంటుందని తెలిపారు.
డిస్ట్రిక్ట్ ఎలక్ట్రిసిటీ కమిటీలు`ఆర్డీఎస్‌ఎస్
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జిల్లా విద్యుత్ కమిటీలను నోటిఫై చేసింది. జిల్లాల్లో విద్యుత్ సరఫరా, మౌలిక సదుపాయాల సమగ్ర అభివృద్ధిని సమీక్షించడానికి, సమన్వ యం చేయడానికి కమిటీలు కనీసం మూడునెలలకు ఒకసారి జిల్లా కేంద్ర కార్యాల యంలో కాలానుగుణంగా సమావేశమవ్వాలి. జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించి సకాలంలో మినిట్స్ జారీ చేయాలి.
బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్స్- ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024
ఈ పాలసీ కింద రిలయన్స్ సంస్థ పెట్టుబడులకు ముందుకు వచ్చింది. మూలధ న సబ్సిడీ.. సీబీజీ ప్లాంట్ ఫిక్స్‌డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ (ఎఫ్‌సీఐ)పై 20 శాతం క్యాపిటల్ సబ్సిడీ గరిష్ఠానికి లోబడి ఉంటుంది. సీఓడీ నుంచి ఐదేళ్ల కాలానికి సీబీజీ ఉత్పత్తి కోసం వినియోగించే విద్యుత్‌కు 100 శాతం విద్యుత్ డ్యూటీ రీయింబర్స్ మెంట్ ఉంటుంది. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ప్రకారం సీబీజీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు లీజు చొప్పున వ్యర్థ భూములను కేటాయించాలి. కలెక్టర్లు మా దగ్గర ఈ భూములున్నాయని ముందుకు వస్తే చాలా సంతోషం.
ఐదు సోలార్ పార్కులు
5,853 ఎకరాల్లో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో అనంతపురం అల్ట్రా మెగా సోలార్ పార్క్, 2,801 ఎకరాల్లో 500 మెగావాట్ల సామర్థ్యంతో గాలివీడు సోలార్ పార్క్, 5,570 ఎకరాల్లో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో కర్నూలు అల్ట్రా మెగా సోలార్ పార్క్, 2,873 ఎకరాల్లో 500 మెగావాట్ల సామర్థ్యంతో అనంతపురం-2 అల్ట్రా మెగా సోలార్ పార్క్ (తలారిచెరువు), 5,944 ఎకరాల్లో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో కడప అల్ట్రా మెగా సోలార్ పార్క్స్ ఏర్పాటు చేయనున్నాం.
న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు
1000 మెగావాట్ల సామర్థ్యంతో ప్రకాశం జిల్లా దొనకొండ, 1,000 మెగావాట్ల సామర్థ్యంతో ప్రకాశం జిల్లా సీఎస్‌పురం, 500 మెగావాట్ల సామర్థ్యంతో శ్రీ సత్యసా యి జిల్లా ఎన్.పి.కుంట, 1,000 మెగావాట్ల సామర్థ్యంతో శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో సోలార్ పార్కులు ఏర్పాటు చేయనున్నాం. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ప్రకారం ఇప్పటికే ఉన్న హైవే కనెక్టివిటీతో పాటు రామాయపట్నం పోర్ట్‌కు సులభంగా యాక్సెస్ జరిగేలా తగిన భూమిని గుర్తించాలి.