తెలుగుదేశం హామీల అమలులో విఫలమైందని జగన్‌రెడ్డి అబద్ధాలు ఆడుతున్నా డు. వైసీపీపై నిందలు వేస్తున్నారని పదే పదే మాట్లాడడం శుద్ధ అబద్ధం. ప్రతిపక్ష నేతగా జగన్ ఫెయిల్ అయ్యాడు గానీ టీడీపీ ప్రభుత్వం ఫెయిల్ కాలేదు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడే నాటికి రూ.10 లక్షల కోట్ల అప్పు ఉంది. తక్షణం చెల్లించాల్సిన బకాయిలు లక్ష కోట్లు ఉంది. జగన్ ఖజానాను దివాలా తీయించాడు. అయినా 6 నెలల్లోనే చంద్రబాబు 400 మంచి పనులతో రాష్ట్రాన్ని గాడిలో పెట్టాడు. ఏ రాష్ట్రంలో కూడా మొదటి ఆరు నెలల్లోనే ఇన్ని పనులు చేసిన ప్రభుత్వం లేదు. చంద్రబాబు అనుభవం వల్లనే ఇది సాధ్యమైంది. ప్రతిపక్ష నేతగా వైఫల్యం చెందింది జగన్‌రెడ్డే. మళ్లీ హామీలు అమలు చేయలేదని తమపై బురద జల్లడం విడ్డూరంగా ఉంది. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మొదటి ఆరు నెలల్లో ఆయన కేవలం మూడు పనులు మాత్రమే చేశాడు. జగన్‌రెడ్డి పింఛన్ రూ.3 వేలు చేస్తానంటూ తొలి ఏడాది రూ.250 మాత్రమే పెంచి వృద్ధులను మోసం చేశాడు. ఆటో డ్రైవర్లకు రూ.10 వేలు ఇచ్చి మరో వైపు మద్యం రేట్లు పెంచి నాన్న బుడ్డీ పేరుతో లక్షలు కొట్టేశాడు. అర్హులైన లబ్ధిదారుల్లో కోత పెట్టి రైతు భరోసా ఇవ్వడం తప్ప మిగిలిన నవరత్న పథకాల హామీలు ఏవీ అమలు చేయలేదు. జగన్ అధికారం చేపట్టే నాటికి వడ్డించిన విస్తరిలా చంద్రబాబు అన్ని ఏర్పాట్లు చేశారు.
అయినా ఆరు నెలల్లో నవరత్నాల హామీలను జగన్ అమలు చేయలేకపోయాడు. దీనిపై దమ్ముంటే చర్చకు నీ తొత్తు సజ్జల రామకృ ష్ణారెడ్డిని పంపిస్తారా? లేక జగనే వస్తాడా? చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. నీ మేనిఫెస్టోలోని 90 శాతం అమలు పర్చలేదు. ఇప్పడు ఏ ముఖం పెట్టుకుని మాట్లా డుతావు? మీరు చేసిన కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ ఆరోప ణలు చేస్తున్నారు. జగన్‌రెడ్డి నోరు తెరిస్తే మాట్లాడేవన్నీ అబద్ధాలే అని ప్రజలు అర్థం చేసుకోవాలి. కుల, మత, ప్రాంతీయ చిచ్చు పెట్టి ఈరోజు తన దోపిడీ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇటువంటి దుర్మార్గాలకు తెర లేపుతున్నారు. ప్రజలు అప్రమ త్తంగా ఉండాలి. గతంలో రత్నాంచల్ ఎక్స్‌ప్రెస్‌ను దహనం చేయించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమకు చేసిందేమీ లేదు. ఐదేళ్లలో నీటి ప్రాజెక్టు లకు ఇచ్చింది రూ.3 వేల కోట్లే. చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టిం ది రూ.12 వేల కోట్లు. అన్ని ప్రాంతాలను సమ దృష్టితో అభివృద్ధి చేయడమే చంద్ర బాబు లక్ష్యం అయితే జగన్ అన్ని ప్రాంతాలను ముంచి అఘాతంలోకి నెట్టాడని ధ్వజమెత్తారు.