మంగళగిరి (చైతన్యరథం): మంగళగిరి నియోజకవర్గ ప్రజల ఆరోగ్యాలకు కూటమి ప్రభుత్వం చేయూతనందిస్తుందని టీటీడీ పాలక మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో టీడీపీ నాయకులు బుధవారం లబ్ధిదారులకు అందజేశారు. మంగళగిరి పట్టణంలోని 25వ వార్డు హుస్సేన్ కట్టకు చెందిన కందుల వీర రాఘవులకు రూ 30,786, 2వ వార్డుకు చెందిన కడియం హనుమంతురావు కుమారుడు సుజయివాన్‌కు రూ 45,084 విలువైన చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. 26వ వార్డుకు చెందిన షేక్ మీరాబీ గుంటూరు నగరంలోని విజయ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ముందస్తు చికిత్స చేయించుకోవడానికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ 60,000 వేల ఎల్వోసీ చెక్కును టీడీపీ నాయకులు ఆమె ఇంటికి వెళ్లి అందజేశారు.
ఈ సందర్భంగా తమ్మిశెట్టి జానకీదేవి మాట్లాడుతూ వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తుందన్నారు. కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరూ కూడా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, పట్టణ మహిళా అధ్యక్షురాలు ఊట్ల కనకదుర్గ మల్లేశ్వరి, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సుభాని, 2వ వార్డు అధ్యక్షులు సుఖమంచి గిరిబాబు, 26వ వార్డు అధ్యక్షులు ఉద్దంటి గాంధీ, పట్టణ కమిటీ సభ్యులు కారంపూడి చిరంజీవి, తాడిగిరి సుధీర్, రంగిశెట్టి బాబీ, ఊట్ల కనకమల్లికార్జున్ రావు, షేక్ సలీమ్ భాష, షేక్ హజరత్ అలీ, కాటు రవికుమార్, పాగోలు శంకర్, వాకా సంధ్య, బిట్రా కోటేశ్వరావు, షేక్ చిన్నతంగేళ్ల, గంజి లక్ష్మయ్య, పటాన్ నాగుల్ ఖాన్, బిట్రా సూర్యచంద్రరావు, కాటా బత్తుల అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.