- చర్యలు తీసుకోవాలని గన్నవరం వాసుల వినతి
- ఉద్యోగాల పేరుతో రూ1.30 కోట్లకు టోకరా
- టీడీపీ అనుకూలురమని భూ కబ్జాకు వైసీపీ యత్నం
- ఇంటిని కూల్చేస్తామని వైసీపీ నేతల బెదిరింపులు
- ప్రజావినతుల కార్యక్రమంలో బాధితుల గోడు
మంగళగిరి(చైతన్యరథం): గత ప్రభుత్వంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బినామీలుగా ఉండి ఆయన అరాచకాలకు తొత్తులుగా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ బ్రాహ్మణి, తోడెటి బెంజిమెన్, తోడెటి విజయ్‌కుమార్, చిలువూరి జయరాజు, చిలువూరి జాన్, దొండపాటి ప్రభాకర్, గొడ్డళ్ల రామారావు, పిండ్రాల పుల్లయ్యలపై చర్యలు తీసు కోవాలని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ప్రజావినతుల కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గానికి చెందిన బొడ్డు విజయ్‌కుమార్, హరీష్ తదితరులు ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడితో పాటు రౌడీయిజం, సెటిల్‌మెంట్లు, భూ కబ్జాలు, సంతకాల ఫోర్జరీలు, అక్రమ రిజిస్ట్రేషన్లతో బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టి వారు అనేక మోసాలకు పాల్పడ్డారని వివరించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్, హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్యబాబు అర్జీలు స్వీకరించారు.
` తాము టీడీపీ సానుభూతిపరులమన్న కక్షతో తమ పొలాన్ని కబ్జా చేసేందుకు కుట్ర చేసి తమపై అక్రమ కేసులు పెట్టి మాజీ ఎమ్మెల్యే సాయిప్రతాప్‌రెడ్డి, బాలనాగిరెడ్డి అనుచరులు నాగరాజు, ఉరుకుందప్పలు తమను వేధిస్తున్నారని కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామానికి చెందిన మహదేవప్ప ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
` తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన లీలావతి, పలువురు బాధితులు సమస్యను వివరిస్తూ టీటీడీ, రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసి తమ వద్ద రూ.1.30 కోట్లు కృష్ణమూర్తి, అతని భార్య తీసుకున్నారు.. వారిపై చర్యలు తీసుకుని తమకు డబ్బు లు ఇప్పించాలని మొరపెట్టుకున్నారు.
` తాను పదేళ్లుగా ఉంటూ ఇంటి పన్ను, కరెంట్ బిల్లు కట్టుకుంటున్న ఇంటిని వైసీపీ నేతలు కూల్చేస్తామని బెదిరిస్తున్నారని తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ తారకానగర్‌కు చెందిన కె.సంపూర్ణమ్మ ఫిర్యాదు చేసింది. తన ఇంటికి పట్టా మంజూరు చేసి తనను బెదిరిస్తున్న వైసీపీ నేతలను శిక్షించాలని విజ్ఞప్తి చేసింది
` తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని పోలీసులను అభ్యర్థిస్తే తన దగ్గర డబ్బు లు తీసుకున్న వ్యక్తి వెనుక వైసీపీ నేతలు ఉన్నారని వారితో వెళ్లి మాట్లాడుకోవాలని చెబుతున్నారని కడప జిల్లా పులివెందులకు చెందిన ఫకృద్దీన్ ఫిర్యాదు చేశారు. చంద్రగిరి గ్రామానికి చెందిన కుమార్ బాబు నుంచి తనకు రావాల్సిన డబ్బులు రూ.2 లక్షలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
` విభిన్న ప్రతిభావంతులమైన తమకు 2017లో చిట్వేలి మండలం గట్టుమీదపల్లి వద్ద ప్రభు త్వం ఇచ్చిన ఇంటి స్థలాలను ఇప్పటికీ చూపించలేదు.. తమకు కేటాయించిన ఇంటి స్థలాలను తమకు అప్పగించాలని అన్నమయ్య జిల్లా చిట్వేలి మండం తిమ్మాయ పాలెంకు చెందిన పలువురు విభిన్న ప్రతిభావంతులు విజ్ఞప్తి చేశారు.
` వర్షం నీరు బయటకు వెళ్లకుండా నల్లూరి నాగేశ్వరరావు, సింగయ్యలు మట్టి కట్టలు అడ్డం వేయడంతో తమ పొలాలు మునిగి ఇబ్బంది పడుతున్నామని వారిపై చర్యలు తీసుకుని వర్షపు నీటితో పంట పొలాలు మునగకుండా చూడాలని గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామానికి చెందిన పలువురు రైతులు విజ్ఞప్తి చేశారు.
` గత వైసీపీ ప్రభుత్వంలో జీఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్ట్ కింద తమ పొలం నుంచి తాగునీటి పైపులైన్ వెళ్లింది..తమకు రావాల్సిన పరిహారాన్ని వైసీపీ నేతలు రాకుండా అడ్డుకున్నారు..తమకు రావాల్సిన పరిహారం ఇప్పించాలని కడప జిల్లా వెంపల్లె మండలా నికి చెందిన సింగిరెడ్డి రామమునిరెడ్డి వినతిపత్రం అందజేశారు.