- అర్జీలు స్వీకరించిన కార్పొరేషన్ల చైర్మన్లు రాజన్, వీరంకి
- పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు
మంగళగిరి(చైతన్యరథం): ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా శనివా రం టీడీపీ కేంద్ర కార్యలయంలో వన్నియకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సీఆర్ రాజన్, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి అర్జీలు స్వీకరించారు. ఎక్కువగా గత ప్రభుత్వంలో భూ కబ్జాలపైనే ఫిర్యాదులు రాగా ఆయా శాఖల అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.
` తమకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూమికి దొంగ పట్టాలు సృష్టించి కబ్జాదారు లు భూమిని కొట్టేయాలని చూస్తే కోర్టుకు వెళ్లగా తమకే అనుకూలంగా తీర్చు ఇచ్చిందని బాపట్ల జిల్లా చుండూరు మండల కేంద్రానికి చెందిన గంగవరపు వెంకటేశ్వరరావు తెలిపారు. అయినా కబ్జాదారులు వైసీపీ నేతలను అడ్డు పెట్టుకుని స్థలాన్ని ఖాళీ చేయడం లేదని వాపోయాడు.
` తమకు ప్రభుత్వం నల్లమడ మండలం వెళమమద్ది గ్రామంలో 1986లో 7.96 ఎకరాలకు డీ పట్టా ఇవ్వగా సాగు చేసుకుంటున్నామని.. అనారోగ్య కారణంగా సొంత ఊరికి వెళితే తమ భూమిని అదే ఊరికి చెందిన వారు కబ్జా చేశారని అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం చుక్కవారిపల్లె గ్రామానికి చెందిన సీఎన్ హరినాథ్‌రెడ్డి, పి.ఓబిరెడ్డి ఫిర్యాదు చేశారు. తమకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.
` ఒంటరి మహిళనైన తన ఇంటి ముందు స్థలాన్ని ఓ ఏఈ కబ్జా చేసి తాను తోలించుకున్న మట్టిని ట్రాక్టర్లు పెట్టి తీసుకెళ్లాడని అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండల కేంద్రంలోని నల్లగట్టు వీధిలో నివాసం ఉంటున్న షేక్ వహీద్ ఫిర్యాదు చేశారు. తన ఇంటికి దారి లేకుండా అడ్డంగా గోడ కడుతున్నాడని.. అతనిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది.
` సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన కాపు అప్పిరెడ్డి సమస్యను వివరిస్తూ తనకు నడిరపల్లి గ్రామంలో 30 సంవత్సరాల పైగా హక్కుగా ఉన్న భూమిని నరసింహులు అనే వ్యక్తి కబ్జా చేశారని ఫిర్యాదు చేశాడు. దీనిపై పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని న్యాయం చేయాలని విన్నవిం చుకున్నాడు.
` బాపట్ల జిల్లా కొల్లూరు మండలం మొసలిపాడు గ్రామానికి చెందిన పలువురు రైతులు సమస్యను వివరిస్తూ తమ గ్రామంలోని నేలకుంట చెరువులో అధికారుల అను మతి లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు సాగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దాదాపు 42 అడుగులు లోతు పెట్టి మట్టిని తవ్వి అమ్ముకున్న సర్పంచ్‌పై తగిన చర్యలు తీసుకో వాలని కోరారు.
` తాను కిడ్నీల సమస్యతో బాధపడుతూ ఎటువంటి పని చేసుకోలేకపోతున్నానని.. తనకు ప్రభుత్వం నుంచి సాయం అందించాలని ప్రకాశం జిల్లా దర్శి మండలం అబ్బా యిపాలెం గ్రామానికి చెందిన గొల్ల యోగిరాజు విజ్ఞప్తి చేశాడు.