చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అల్యూమిని సహకారంతో..ఏయుకి అంతర్జాతీయ ఖ్యాతి!

ఏయు అల్యుమిని సమావేశంలో మంత్రి లోకేష్‌ పిలుపు

by చైతన్యరధం
Dec 8, 2024 at 6:25am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
అల్యూమిని సహకారంతో..ఏయుకి అంతర్జాతీయ ఖ్యాతి!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మాతృ సంస్థ రుణం తీర్చుకునేందుకు కదలిరండి
  • అకడమిక్‌ ` పరిశ్రమ అవసరాల అంతరాన్ని తొలగించాలి
  • స్కిల్‌ సెన్సస్‌తో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలకు కృషి
  • ఏఐ అవకాశాలను అందిపుచ్చుకునేలా పాఠ్యాంశాల రూపకల్పన
  • ఆంధ్రా యూనివర్సిటీ పూర్వవైభవానికి సహకరించండి
  • ఏయు అల్యుమిని సమావేశంలో మంత్రి లోకేష్‌ పిలుపు

విశాఖపట్నం (చైతన్యరథం): రాబోయే రోజుల్లో ఆంధ్రా యూనివర్శిటీ గత వైభవాన్ని పునరుద్ధరించి, భారతదేశంలో టాప్‌ ` 3, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌ 100లో ఒకటిగా నిలిపేందుకు తాము కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ ఉద్ఘాటించారు. ఆంధ్రా యూనివర్సిటీ యాన్యువల్‌ అల్యూమిని (పూర్వ విద్యార్థులు) సమావేశాన్ని శనివారం ఏయు కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి లోకేష్‌ గౌరవ అతిధిగా హాజరుకాగా, ఎల్‌ అండ్‌ టి చైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌, జిఎంఆర్‌ గ్రూప్‌ సంస్థల అధినేత గ్రంధి మల్లిఖార్జునరావు, ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యుడు పద్మశ్రీ డాక్టర్‌ ఎస్‌వి ఆదినారాయణరావు తరఫున ఆయన సతీమణి శశిప్రభ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ… ఆంధ్ర యూనివర్శిటీని అంతర్జాతీయ స్థాయిలో మేటిగా నిలపాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ అంతర్జాతీయస్థాయి విద్యా సంస్థగా ఆవిర్భవించాలని తానేమీ ఆషామాషీగా అనటం లేదని, ప్రభుత్వం, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యావేత్తలు, ప్రత్యేకించి పూర్వ విద్యార్థులు, పారిశ్రామికవేత్తల సమష్టి కృషితో భవిష్యత్తులో ఏయు ప్రపంచస్థాయి విద్యాసంస్థగా ఆవిర్భవించడం సాధ్యమేనన్నారు. నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విభిన్న రంగాల్లో ఏయు పూర్వ విద్యార్థులు సాధించిన విజయాలు ఆంధ్ర విశ్వవిద్యాలయం వేసిన బలమైన పునాదికి నిదర్శనమన్నారు. ఇప్పుడు మీరంతా మాతృ సంస్థ రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి లోకేష్‌ పిలుపు ఇచ్చారు.
ఏయు నుంచి ఎందరో ప్రముఖులు
ప్రస్తుత విద్యార్థుల ఉన్నతికి పూర్వ విద్యార్థుల మార్గదర్శకత్వం ఎంతో ఉపయోగపడుతుంది. ప్రముఖ గణిత శాస్త్రవేత్త సీిఆర్‌ రావు, యుజిసి మాజీ వైస్‌ చైర్మన్‌ బీఆర్‌ రావు, భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, జిఎంఆర్‌ గ్రూపు సంస్థల అధినేత గ్రంథి మల్లిఖార్జునరావు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు నీలి బెండపూడి, బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి, రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వైస్‌ చైర్మన్‌ పూర్ణ సగ్గుర్తి వంటి ప్రముఖులు సాధించిన విజయాలు ఆంధ్ర విశ్వవిద్యాలయ వారసత్వానికి నిదర్శనం. ఖండాంతర ఖ్యాతి సాధించిన ఏయు ఆల్యూమిని ప్రముఖులను నేను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. దాదాపు ఒక శతాబ్ద కాలంగా విజ్ఞాన దీవిగా, అధునాతన ఆవిష్కరణల నిలయంగా, అసంఖ్యాకమైన మేధావుల కలల వారధిగా ఏయు కొలువై ఉంది. 1926లో 434 ఎకరాల సువిశాలమైన క్యాంపస్‌లో స్థాపించాక నైపుణ్యతతో కూడిన విద్యాలయంగా వెలుగు వెలిగింది. ఇప్పటివరకు దాదాపు 3 లక్షల మందికి అత్యుత్తమ ధోవంతమైన సమాజాన్ని తయారుచేయడంలో కీలకపాత్ర వహిస్తూ సరస్వతీ నిలయంగా వెలుగొందుతోందని మంత్రి లోకేష్‌ అన్నారు.
మెరుగైన ఎకో సిస్టమ్‌ కోసం ప్రత్యేక వేదిక
అల్యూమిని ప్రముఖుల వృత్తిపరమైన, వ్యక్తిగత అనుభవాలు, మార్గదర్శకత్వం, ప్రగతిశీల ఆలోచనలు ప్రస్తుత విద్యార్థులు, యువత కెరీర్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఉపయోగపడతాయి. మీరంతా సలహాదారులుగా మారి ప్రస్తుత విద్యార్థుల కలల సాకారానికి ఆలంబనగా నిలవాలి. ఉన్నతవిద్యలో మెరుగైన ఎకో సిస్టమ్‌ నిర్మించడానికి పూర్వవిద్యార్థుల భాగస్వామ్యంతో ప్రత్యేక వేదిక ఏర్పాటుచేస్తాం. నేడు అంతర్జాతీయంగా ట్రెండిరగ్‌లో ఉన్న కృత్రిమ మేధ (ఎఐ)ని అందిపుచ్చుకోవడంలో ఇండస్ట్రీ కనెక్ట్‌ కీలక పాత్ర వహిస్తుంది. వివిధ కీలక స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు అకడమిక్‌, పరిశ్రమ అవసరాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు కృషిచేయాలి. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, లైవ్‌ ప్రాజెక్ట్‌లు, వాస్తవ ప్రపంచ అవసరాలను గుర్తించడానికి మీ నెట్‌వర్క్‌ మార్గం సుగమం చేస్తుంది. దీనిద్వారా ఇక్కడ విద్యనభ్యసించిన గ్రాడ్యుయేట్ల ఉపాధిని పెంపొందించడమే కాకుండా యూనివర్సిటీ ప్రమాణాలు కూడా మెరుగవుతాయని మంత్రి లోకేష్‌ వివరించారు.
అల్యూమిని ప్రముఖులు ముందుకురావాలి
ఒకప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా ప్రపంచానికి ఎనలేని సేవలను అందించినప్పటికీ, వివిధ కారణాల వల్ల ఇటీవల సంవత్సరాల్లో ప్రమాణాలు దెబ్బతిన్నాయన్నది కాదనలేని సత్యం. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ యూనివర్శిటీ ర్యాంకింగ్స్‌ 2019లో 16వ స్థానంలో ఉండగా, 2024లో 25కి క్షీణించింది. అదేవిధంగా, ఓవరాల్‌ కేటగిరీలో 29వ స్థానం నుండి 41వ స్థానానికి పడిపోయింది. ఈ చేదు నిజాన్ని అందరూ గమనించాల్సి ఉంది. యూనివర్సిటీకి గత వైభవాన్ని పునరుద్ధరించటానికి ఈ సమావేశం కీలకమైన అడుగుగా నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. ఇందుకోసం అల్యూమిని ప్రముఖులంతా దృఢమైన సంకల్పంతో ముందుకు రావాలని కోరుతున్నాను. అధునాతన ఆవిష్కరణలు, పరిశోధనల కేంద్రంగా ఆంధ్రా యూనివర్సిటీని ముందువరుసలో నిలిపేందుకు మీ వంతు సహాయ, సహకారాలు అందించాలని మంత్రి లోకేష్‌ కోరారు.
ఏయు పూర్వవైభవానికి కట్టుబడి ఉన్నాం
ఆంధ్ర విశ్వవిద్యాలయానికి గత వైభవాన్ని చేకూర్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. విద్యాప్రమాణాల మెరుగుదల లక్ష్యంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, పాఠ్యాంశాలను ఆధునీకరించడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నాం. అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించడానికి ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లు జరుగుతున్నాయి. దీనిద్వారా ఇక్కడి విద్యార్థులు అగ్రశ్రేణి అధ్యాపకులచే మార్గదర్శకత్వం పొందుతారు. విద్యాశాఖ మంత్రిగా కేజీ నుండి పీజీ వరకు సమూల ప్రక్షాళనకు నేను కట్టుబడి ఉన్నాను. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను ఆధునీకరించడంతోపాటు ఉపాధ్యాయులు పూర్తిగా విద్యాబోధనపైనే దృష్టి సారించడానికి వీలుగా బోధనేతర పనులకు అధ్యాపకులను దూరంగా ఉంచుతున్నాం. యూనివర్శిటీల్లో దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నాం. ఉన్నత విద్యా సంస్థల అభివృద్ధికి అందుబాటులో ఉన్న నిధులను వినియోగిస్తున్నాం. ప్రపంచ స్థాయి ఫ్యాకల్టీతో ఏయుని గ్లోబల్‌ ఇంక్యుబేషన్‌ హబ్‌గా మార్చడానికి ఇక్కడ ఏఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మంత్రి లోకేష్‌ వెల్లడిరచారు.
నైపుణ్యాల మెరుగుదలకు స్కిల్‌ సెన్సస్‌
ఇప్పటివరకు ఉన్నత విద్యా వ్యవస్థలో లోపాల కారణంగా గ్రాడ్యుయేషన్‌ కోర్సులు చదివిన విద్యార్థులను ఉద్యోగానికి సిద్ధం చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిన మాట వాస్తవం. అమీర్‌పేట్‌, ఇతర చోట్ల శిక్షణా కేంద్రాల్లో కోచింగ్‌ తీసుకున్న విద్యార్థులు 3-4 నెలల్లో ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు. నాలుగేళ్లు ఉన్నత విద్య అభ్యసించిన వారు ఎందుకు ఆ విధంగా తయారుకాలేక పోతున్నారు. యుద్ధ ప్రాతిపదికన ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్కిల్‌ సెన్సస్‌ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఇందులో పౌరులందరి నైపుణ్యాలతో కూడిన ప్రొఫైల్స్‌ను క్రోడికరించి, నైపుణ్య అంతరాలను గుర్తిస్తారు. ఆయా ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యం, రీస్కిల్లింగ్‌ కోసం నైపుణ్య శిక్షణ ఇవ్వబోతున్నాం. అదేవిధంగా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులందరి ప్రొఫైల్‌లు వారి అభిరుచి, ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందిస్తాం. వారికి అవసరమైన శిక్షణ కోసం మెంటార్‌ పరిశ్రమకు కనెక్ట్‌ చేసి ఉద్యోగానికి సిద్ధం చేస్తామని మంత్రి లోకేష్‌ తెలిపారు.
ఏపీ మోడల్‌ ఎడ్యుకేషన్‌కు కృషి
ఏఐ రంగంలో అంతర్జాతీయంగా వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకునేలా పాఠ్యప్రణాళికలను రూపొందించి, మెరుగైన సామర్థ్యాలతో గ్రాడ్యుయేట్లను తయారుచేయడమే మా లక్ష్యం. ఇందుకోసం కేజీ నుండి పీజీ వరకు పాఠ్యాంశాలను ప్రక్షాళన చేసి ఆంధ్రా మోడల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ తెచ్చే దిశగా ప్రణాళికాబద్ధమైన కృషిచేస్తున్నాం. ఇదే సమయంలో మానవత్వం, నైతికత, మహిళలపై గౌరవం వంటి అంశాలను కూడా జోడిరచి సరికొత్త విద్యాబోధనకు శ్రీకారం చుట్టబోతున్నాం. భవిష్యత్‌ పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, కళాకారులు, సామాజిక శాస్త్రవేత్తలు, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేటర్లు, ఉత్తమ రాజకీయవేత్తలను తయారుచేసే కర్మాగారంగా ఆంధ్రా యూనివర్సిటీని తీర్చిదిద్దాలన్న మా సంకల్పానికి మీ వంతు సహకారం అందించండి. అందరం కలసి ఆంధ్రా యూనివర్సిటీని ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుదాం. ఈ మహోన్నత లక్ష్యసాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం వహించాల్సిందిగా కోరుతున్నాను. ఆంధ్రా వర్సిటీ కీర్తిప్రతిష్టలను పునరుద్ధరించే యజ్ఞంలో మేము సైతం అంటూ ముందుకు రావాలని ్‌ అల్యూమిని ప్రముఖులకు మంత్రి లోకేష్‌ పిలుపునిచ్చారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 26-05-2026

చైతన్యరధం ఈ పేపర్ 25-05-2026

శ్రమకు గుర్తింపు… శ్రామికులకు గౌరవం

Previous Post

కాకినాడ సెజ్‌ బాధితులకు న్యాయం చేయండి

Next Post

విద్యుత్‌ ఉత్పత్తే కాదు..ఆదా చేయడమూ ముఖ్యమే

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 26-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-05-2026

కార్యకర్త
@ May 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 25-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-05-2026

కార్యకర్త
@ May 25, 2026
శ్రమకు గుర్తింపు… శ్రామికులకు గౌరవం
ఆంధ్రప్రదేశ్

శ్రమకు గుర్తింపు… శ్రామికులకు గౌరవం

చైతన్యరధం
@ May 25, 2026
జగన్ రెడ్డి అండ్ కో వక్రబుద్ధి
ఆంధ్రప్రదేశ్

జగన్ రెడ్డి అండ్ కో వక్రబుద్ధి

చైతన్యరధం
@ May 25, 2026
తెలుగు సినిమాను బతికించుకోవాలి
ఆంధ్రప్రదేశ్

తెలుగు సినిమాను బతికించుకోవాలి

చైతన్యరధం
@ May 25, 2026
నేడు ఎంఎస్ఎంఈ – గ్రోత్ సమ్మిట్
ఆంధ్రప్రదేశ్

నేడు ఎంఎస్ఎంఈ – గ్రోత్ సమ్మిట్

చైతన్యరధం
@ May 25, 2026
ఉత్తరాంధ్రకు మహర్దశ..
ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్రకు మహర్దశ..

చైతన్యరధం
@ May 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 24-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-05-2026

కార్యకర్త
@ May 24, 2026
Load More

ముఖ్య వార్తలు

శ్రమకు గుర్తింపు… శ్రామికులకు గౌరవం

శ్రమకు గుర్తింపు… శ్రామికులకు గౌరవం

చైతన్యరధం
@ May 25, 2026
నేడు ఎంఎస్ఎంఈ – గ్రోత్ సమ్మిట్

నేడు ఎంఎస్ఎంఈ – గ్రోత్ సమ్మిట్

చైతన్యరధం
@ May 25, 2026
పండుగ వాతావరణంలో మహానాడు

పండుగ వాతావరణంలో మహానాడు

చైతన్యరధం
@ May 24, 2026
గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ తోక జాడిస్తే కట్ చేస్తాం

గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ తోక జాడిస్తే కట్ చేస్తాం

చైతన్యరధం
@ May 24, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

శ్రమకు గుర్తింపు… శ్రామికులకు గౌరవం

శ్రమకు గుర్తింపు… శ్రామికులకు గౌరవం

చైతన్యరధం
@ May 25, 2026
జగన్ రెడ్డి అండ్ కో వక్రబుద్ధి

జగన్ రెడ్డి అండ్ కో వక్రబుద్ధి

చైతన్యరధం
@ May 25, 2026
తెలుగు సినిమాను బతికించుకోవాలి

తెలుగు సినిమాను బతికించుకోవాలి

చైతన్యరధం
@ May 25, 2026
నేడు ఎంఎస్ఎంఈ – గ్రోత్ సమ్మిట్

నేడు ఎంఎస్ఎంఈ – గ్రోత్ సమ్మిట్

చైతన్యరధం
@ May 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist