అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఈ నెల 3న నిర్వహించనున్నారు. తొలుత ఈ నెల 4న క్యాబినెట్ సమావేశం ఉంటుందని ప్రకటించారు. అయితే క్యాబినెట్ భేటీని ఒకరోజు ముందుకు జరిపారు. ఈ మేరకు క్యాబినెట్ భేటీకి ప్రతిపాదనలు పంపాలని శాఖాధిపతులకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.