- నూతన టెక్స్టైల్ పాలసీ ముసాయిదాపై సీఎం సమీక్ష
- మహిళలకు పెద్దఎత్తున ఉపాధి కల్పనకు అవకాశం
- డ్రాఫ్ట్‌ను కేబినెట్ ముందుకు తెచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో సమృద్ధిగా పెట్టుబడుల సాధించడం ద్వారా పారిశ్రామికాభివృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలసీలు ప్రకటిస్తోంది. ఇప్పటికే 10కిపైగా పాలసీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో కొత్తగా టెక్స్ టైల్ పాలసీని తీసుకొచ్చేందుకు నిర్ణయించింది. దీనిలో భాగంగా నూతన టెక్స్టైల్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా నూతన టెక్స్టైల్ పాలసీ రూపకల్పన చేశారు. దీని ద్వారా 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. కొత్త పాలసీలో ప్రోత్సాహకాలిచ్చి వీవింగ్, ప్రాసెసింగ్, గార్మెంట్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ యూనిట్స్‌కు ప్రోత్సాహమివ్వాలని నిర్ణయించారు. కొత్త పాలసీలో భాగంగా కేపిటల్ సబ్సిడీ పెంచనున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు మహిళలకు అదనంగా ప్రోత్సాహకాలిచ్చే అంశంపై ప్రతిపాదించారు. 2018-23 పాలసీకంటే మరింత మెరుగ్గా ఈ పాలసీ ఉండాలని సీపం అధికారులకు సూచించారు. ఈ రంగంలో వచ్చే పెట్టుబడుల ద్వారా గ్రామస్థాయిలో పెద్దఎత్తున మహిళలకు ఉపాధి కల్పించవచ్చని సీఎం అన్నారు. కొత్త పాలసీ ద్వారా వస్త్ర తయారీలో పెట్టుబడులకు రాష్ట్రం ఉత్తమమైన వేదిక అవుతుందని సీపం అన్నారు. పాలసీ డ్రాఫ్ట్‌పై సంతృప్తి వ్యక్తం చేసిన సీపం, ఆమోదం తెలిపారు. రానున్న రోజుల్లో దీన్ని క్యాబినెట్ ముందుకు తీసుకురానున్నారు. టెక్స్టైల్ పాలసీతోపాటు లెదర్ పాలసీపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. మరింత కసరత్తు తరువాత లెదర్ పాలసీపై ముందుకెళ్లాలని సీఎం సూచించారు.