ఒక రాజకీయ పార్టీ శాశ్వత సభ్యత్వాలు ఇవ్వడం దేశ రాజకీయాల్లో ఇదే ప్రథమం. ఆ రికార్డు తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024-26’లో భాగంగా నెల రోజుల వ్యవధిలో అంటే నవంబర్ 26 సాయంత్రానికి పార్టీ సభ్యత్వాలు 51లక్షల 50వేల 600 దాటాయి. అందులో 52 శాతం కొత్తగా సభ్యత్వం తీసుకున్నవాళ్లుంటే.. 48 శాతం రెన్యువల్ చేసుకున్న వారి సంఖ్య ఉంది. తెలంగాణలోని హైదరబాద్, ఏపీ కలుపుకుని ఒకే రోజున 179 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు ఆరంభమైతే.. మొదటి నెల రోజుల్లో 93, 299 సభ్యత్వాలు నమోదు చేసి రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం అగ్రస్థానంలో నిలిచింది.
సభ్యత్వ నమోదులో అనూహ్య ఫలితాలకు కారణం.. కార్యక్రమానికి సారధ్యం వహించిన విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ సాంకేతిక వ్యూహమేనన్నది కాదనలేని వాస్తవం. సనాతన సంప్రదాయ ప్రక్రియను పక్కనపెట్టి.. సభ్యత్వ నమోదును అధునాతన సాంకేతిక ప్రక్రియకు అనుసంధానించడంతో.. ‘టీడీపీ సభ్యత్వ నమోదు మేడ్ ఈజీ’ అన్నట్టయ్యింది. వాట్సాప్, టెలిగ్రాం యాప్‌లతోనూ సభ్యత్వాలను నమోదు చేసుకునే సాంకేతిక వెసులుబాటు కల్పించడంతో.. ఆండ్రాయిడ్ మొబైల్ చేతిలోవుంటే చాలు.. గ్రామాల్లోని మారుమూల ప్రాంతాల నుంచీ ‘సెల్ప్ సర్వీస్’గా సభ్యత్వ నమోదు సాగిపోతోంది. మరోపక్క పార్టీ ప్రధాన కార్యదర్శిగా కార్యకర్తల సంక్షేమానికి లోకేష్ తీసుకున్న సాహసోపేత, సంక్షేమ భద్రతా నిర్ణయాలు సైతం అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నట్టే కనిపిస్తోంది. లోకేష్ సారథ్యంలో గత ఐదేళ్లలో కార్యకర్తల సంక్షేమానికి పార్టీనుంచి రూ.135 కోట్లు వెచ్చించారు.
- పార్టీ శ్రేణల్లో పెల్లుబుకుతున్న ఉత్సాహం
- ఫలించిన ఐటీ మంత్రి సాంకేతిక వ్యూహం
- కార్యకర్తల సంక్షేమంతోనూ ఆకట్టుకున్న లోకేష్
- టెక్నాలజీతో ‘సభ్యత్వం మేడ్ ఈజీ’ అంటున్న శ్రేణులు
- రికార్డుల కోసం పోటీలు పడుతున్న నేతలు
- ప్రయోగాత్మక ఫలితాలిస్తున్న శాశ్వత సభ్యత్వాలు
- సభ్యత్వ నమోదులో అగ్రపథాన రాజంపేట
- తరువాతి స్థానాల్లో కుప్పం, కళ్యాణదుర్గం
- నాలుగైదు స్థానాల్లో పాలకొల్లు, ఆత్మకూరు
- తెలంగాణలోనూ తెలుగుదేశం దూకుడు
- క్షేత్రస్థాయి క్యాడర్‌కు అధిష్ఠానం ఫోన్ ప్రశంసలు
అమరావతి (చైతన్య రథం): అధికార తెలుగుదేశం పార్టీ సభ్యత్వ సూచి సునామీని తలపిస్తోంది. సరిగ్గా 30 రోజుల్లో 51 లక్షలుదాటి సభ్యత్వాలు నమోదు కావడంతో.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబుకుతోంది. సార్వత్రిక ఎన్నికలలో కూటమి సాధించిన అప్రతిహత విజయాన్ని మించి.. పార్టీ సభ్యత్వ నమోదు పరుగులు తీయడాన్ని గమనిస్తే `తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకోవాలన్న రాష్ట్ర ప్రజల కాంక్ష కనిపించకపోదు. భాగస్వామ్యపక్షాలతో కలిపి తెలుగుదేశం పార్టీ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత `అక్టోబర్ 26న మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రణాళికా సారధ్యంలో సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టారు. తన సభ్యత్వాన్ని పునరుద్ధరించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌నుంచి గుర్తింపు కార్డు అందుకోవడంతో సభ్యత్వ నమోదు లాంఛనంగా ఆరంభమైంది. ప్రయోగాత్మకంగా పార్టీ ప్రవేశపెట్టిన శాశ్వత సభ్యత్వ తొలి కార్డును ముఖ్యమంత్రి చేతుల మీదుగా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అందుకున్నారు.
ఒక రాజకీయ పార్టీ శాశ్వత సభ్యత్వాలు ఇవ్వడం దేశ రాజకీయాల్లో ఇదే ప్రథమం. ఆ రికార్డు తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024-26’లో భాగంగా నెల రోజుల వ్యవధిలో అంటే నవంబర్ 26 సాయంత్రానికి పార్టీ సభ్యత్వాలు 51లక్షల 51వేల 515 దాటాయి. అందులో 52 శాతం కొత్తగా సభ్యత్వం తీసుకున్నవాళ్లుంటే.. 48 శాతం రెన్యువల్ చేసుకున్న వారి సంఖ్య ఉంది. తెలంగాణలోని హైదరాబాద్, ఏపీ కలుపుకుని ఒకే రోజున 179 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు ఆరంభమైతే.. మొదటి నెలరోజుల్లో 93,697 సభ్యత్వాలు నమోదు చేసి రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం అగ్రస్థానంలో నిలిచింది. తరువాతి నాలుగు స్థానాల్లో 82,492 సభ్యత్వాలతో కుప్పం సెగ్మెంట్, 77,764 సభ్యత్వాలతో కళ్యాణదుర్గం, 72,726 సభ్యత్వాలతో పాలకొల్లు, 66,339 సభ్యత్వాలతో ఆత్మకూరు సెగ్మెంట్లు నిలిచాయి. తెలంగాణలోనూ సభ్యత్వ నమోదు కార్యక్రమం అంచనాలకు మించి సాగుతుండటంతో.. పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు పెల్లుబుకుతున్నాయి.
ఈ ప్రక్రియలో క్రియాశీలకంగా పనిచేస్తోన్న నాయకులు, శ్రేణులు, కిందిస్థాయి కార్యకర్తలకు పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వయంగా ఫోన్లు చేసి అభినందిస్తుంటే.. క్యాడర్ మరింత ఉత్సాహం చూపిస్తున్నారు. పార్టీ చరిత్రలో ఎన్నడూలేని విధంగా తక్కువ సమయంలోనే అత్యధిక సభ్యత్వాలు నమోదవుతుండటంతో అధిష్ఠానం ఆనందం వ్యక్తం చేస్తూనే.. క్యాడర్‌ను మరింత ప్రోత్సహిస్తోంది. సభ్యత్వ నమోదులో అనూహ్య ఫలితాలకు కారణం.. కార్యక్రమానికి సారధ్యం వహించిన విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ సాంకేతిక వ్యూహమేనన్నది కాదనలేని వాస్తవం. సనాతన సంప్రదాయ ప్రక్రియను పక్కనపెట్టి.. సభ్యత్వ నమోదును అధునాతన సాంకేతిక ప్రక్రియకు అనుసంధానించడంతో.. ‘టీడీపీ సభ్యత్వ నమోదు మేడ్ ఈజీ’ అన్నట్టయ్యింది. వాట్సాప్, టెలిగ్రాం యాప్‌లతోనూ సభ్యత్వాలను నమోదు చేసుకునే సాంకేతిక వెసులుబాటు కల్పించడంతో.. ఆండ్రాయిడ్ మొబైల్ చేతిలోవుంటే చాలు.. గ్రామాల్లోని మారుమూల ప్రాంతాల నుంచీ ‘సెల్ప్ సర్వీస్’గా సభ్యత్వ నమోదు సాగిపోతోంది. మరోపక్క పార్టీ ప్రధాన కార్యదర్శిగా కార్యకర్తల సంక్షేమానికి లోకేష్ తీసుకున్న సాహసోపేత, సంక్షేమ భద్రతా నిర్ణయాలు సైతం అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నట్టే కనిపిస్తోంది. లోకేష్ సారథ్యంలో గత ఐదేళ్లలో కార్యకర్తల సంక్షేమానికి పార్టీనుంచి రూ.135 కోట్లు వెచ్చించారు.
గత విధ్వస పాలకుడి హయాంలో తెదేపా కార్యకర్తలపై కక్షగట్టి అక్రమ కేసుల్లో ఇరికించి వేధించినపుడు.. పార్టీ కుటుంబ కార్యకర్తలను రక్షించుకోవడానికి ఇతోధిక సాయం అందించడమే కాదు, న్యాయ విభాగాలను ఏర్పాటుచేసి కార్యకర్తలకు రక్షణ కవచంగా నిలబడటం కూడా పార్టీ శ్రేణుల్లో అమిత విశ్వాసాన్ని పాదుకొల్పాయి. రూ.100 రుసుం చెల్లించి సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు గతంలో రూ.2 లక్షల ప్రమాద బీమా ఉండేది. ప్రధాన కార్యదర్శిగా లోకేష్ నాయకత్వం ఆరంభమైన తరువాత `కార్యకర్తల ప్రమాద బీమాను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. లోకేష్ ఆధ్వర్యంలో కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి కార్యకర్తల బాగోగులు చూసుకోవడం ఒక ఎత్తయితే.. గతంలో ఈ మెంబర్‌షిప్ ద్వారా ప్రమాదం జరిగిన ఎన్నో కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా నిలబడిరది. మెంబర్‌షిప్ ద్వారా కార్యకర్తల కుటుంబాల్లో విద్యార్థుల చదువులకు ఆర్ధిక సహాయం అందించిందీ తెలుగుదేశం పార్టీయే.
మరోపక్క ఏ పరిస్థితిలోనైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్త కన్నుమూస్తే.. కుటుంబ సభ్యుడే దూరమైనంతగా బాధపడే పార్టీ.. అంత్యక్రియలకు రూ.పదివేలు అందిస్తోంది. ఇలా.. కార్యకర్తలకు అన్ని విధాలా పార్టీ బలమవుతుంటే.. అత్యధిక సభ్యత్వాలతో పార్టీని కార్యకర్తలు మరింత బలోపేతం చేస్తున్నారు. భారత రాజకీయ చరిత్రలోనే ఏ పార్టీకి లేనటువంటి కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకోవడం ఒక రికార్డు అయితే.. తన రికార్డును తానే తిరగరాసేందుకు భారీ సభ్యత్వ నమోదుతో తెలుగుదేశం పార్టీ పరుగులు పెట్టడం మరో రికార్డు. నేతలు సైతం పోటాపోటీగా సభ్యత్వ నమోదులో ఉత్సాహం చూపిస్తుంటే.. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు సూచీ.. స్టాక్ మార్కెట్‌లో బుల్ రేస్‌లా పైపైకి దూసుకుపోతోంది.
ప్రతి గ్రామంలోని, ప్రతి బూత్‌లోను పోటీ పడి మరీ సభ్యత్వం తీసుకోవడం తెలుగుదేశం పార్టీపైన ప్రజలు, కార్యకర్తలు, అభిమానుల విశ్వాసం తేటతెల్లం చేస్తోంది. అంచనాలకు మించి సభ్యత్వ నమోదు పరుగులు తీస్తుంటే.. సోషల్ మీడియాతో అధిష్టానం మరింత ఉత్సాహపరుస్తోంది. ‘‘టీడీపీ అభిమానులారా… రండి! ఇదే స్ఫూర్తితో మరిన్ని రికార్డులు సృష్టిద్దాం!! తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి సులభంగా ఆన్‌లైన్లోనే తీసుకోండి. వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా సభ్యత్వాలు నమోదు చేసుకోండి. వికసిత ఆంధ్ర `2047 లక్ష్య సాధనకు కంకణం కట్టుకున్న తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం ద్వారా `అభివృద్ధి విజయలో మీవంతు పాత్ర పోషించండి’ అంటూ ఉత్సాహపర్చడం విశేషం.