అమరావతి (చైతన్యరథం): మానసిక వైకల్యాన్ని జయించి విశేష ప్రతిభా పాటవాలు కనబరుస్తున్న కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కామిశెట్టి వెంకట్ కుటుంబం ఉండవల్లి నివాసంలో సోమవారం మంత్రి నారా లోకేష్‌ను కలిసింది. వెంకట్‌కు ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అందించాలని తల్లిదండ్రులు కోరారు. వెంకట్ ప్రస్థానాన్ని ఈ సందర్భంగా మంత్రి మెచ్చుకున్నారు. తగిన విధంగా ప్రోత్సహిస్తామని తెలిపారు.