- కార్యాలయ భవన నిర్మాణానికి రైల్వేశాఖ టెండర్లు
- డిసెంబర్ 27 గడువు, రెండేళ్లలో నిర్మాణం పూర్తిచేయాలి
విశాఖపట్నం (చైతన్యరథం): విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో కీలక ముందడుగు పడిరది. విశాఖపట్నంలో జోనల్ కార్యాలయ నిర్మాణానికి రైల్వేశాఖ టెండర్లు పిలిచింది. 9 అంతస్తులు, రెండు సెల్లార్ పార్కింగ్ ఫ్లోర్లతో కలిపి మొత్తం 11 అంతస్తుల్లో భవన నిర్మాణం చేపట్టనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 53 ఎకరాల భూమిని రైల్వేశాఖకు అప్పగించింది. దీంతో జోన్ కార్యాలయ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. రూ.149.16 కోట్ల అంచనా వ్యయంతో భవనం నిర్మించనున్నారు. డిసెంబర్ 27లోపు టెండర్లు దాఖలు చేయాలని రైల్వేశాఖ పేర్కొంది. టెండర్లు దక్కించుకున్న వారు రెండేళ్లలో పూర్తిచేయాలని నిర్దేశించింది.