- కేరళలో ప్రమాదానికి గురైన భక్తుల వాహనం
- తిండీ,తిప్పలు లేకుండా పోలీస్‌స్టేషన్‌లో పడిగాపులు
- కేరళ పోలీస్ అధికారులతో మాట్లాడిన మంత్రి నారా లోకేష్ బృందం
- భక్తులకు భోజనాలు పెట్టి మరీ విడిచిపెట్టిన పోలీసులు
- మంత్రి లోకేష్, ఏపీ ప్రభుత్వం, మీడియా ప్రతినిధులకు అయ్యప్ప భక్తుల కృతజ్ఞతలు
అమరావతి (చైతన్యరథం): మన రాష్ట్రం కాదు.. అక్కడి భాష తెలీదు.. వారికి ఉన్నదల్లా అయ్యప్ప స్వామి పట్ల భక్తి. అయ్యప్ప సన్నిధికి వెళ్తున్న వారి వాహనం ప్రమాదానికి గురైంది. దర్శనం మాట దేవుడెరుగు.. మొత్తం అయ్యప్ప భక్తులంతా కేరళ రాష్ట్రంలోని ఓ పోలీస్ స్టేషన్లో తిండి తిప్పలు లేకుండా పడిగాపులు కాశారు. ఈ సమాచారం ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యంగా మంత్రి నారా లోకేష్‌కి చేరితే చాలు.. తమకు సహాయం అందుతుందని వారంతా భావించారు. వారి కోరిక ఫలించి వారి ప్రాంతానికి చెందిన మీడియా ప్రతినిధుల ద్వారా మంత్రి లోకేష్‌కి సమాచారం చేరింది. మంత్రి వెంటనే తన బృందంతో కేరళ అధికారులతో మాట్లాడిరచారు. దీంతో పోలీస్ స్టేషన్ నుంచి ఎటువంటి కేసు లేకుండా అయ్యప్ప భక్తులను విడిచిపెట్టడంతోపాటు, అప్పటివరకు ఆకలితో ఉన్న అందరికీ పోలీసులు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు.
తమను ఆపదలో ఆదుకున్న ఆపద్బాంధవుడు నారా లోకేష్ అని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం గొడుగుచింత గ్రామవాసులు ముకుళిత హస్తాలతో ధన్యవాదాలు తెలిపారు. ఇబ్బందుల్లో ఉన్న తమకు సహాయం అందించిన ఏపీ ప్రభుత్వం, మంత్రి నారా లోకేష్, గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే థామస్, తిరుపతి పార్లమెంటు టీడీపీ సమన్వయకర్త భీమినేని చిట్టిబాబు నాయుడు, మీడియా ప్రతినిధులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.