- మూడు జీవోలు తెచ్చి ఆ రంగాన్ని సర్వనాశనం చేశారు
- వారి ఘనకార్యాలతోనే డిస్కంలపై రూ.1990 కోట్ల భారం
- ఆక్వా, నాన్ ఆక్వా జోన్‌లంటూ రైతులను మోసగించారు
- కూటమి ప్రభుత్వంలో ఆక్వారంగానికి పూర్వవైభవం
- సీఎం చంద్రబాబు రాయితీలు ప్రకటించి ఆదుకున్నారు
- ఆక్వా రైతులకు యూనిట్‌కు రూ.1.50 రాయితీ పొడిగింపు
- ఇకనుంచి వారికి ఎటువంటి మార్కెట్ సెస్ ఉండబోదు
- ట్రాన్స్‌ఫార్మర్ల ధరలపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం
- అసెంబ్లీలో విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి(చైతన్యరథం): గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో తీసుకొ చ్చిన జీవోలతో ఆక్వా రంగం సర్వనాశనం అయిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపా టి రవికుమార్ తెలిపారు. ఆక్వా రంగానికి సంబంధించి అసెంబ్లీలో మంగళవారం సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. అధికారాన్ని అడ్డుపె ట్టుకుని ఆక్వా రంగాన్ని, రైతులను ఏ విధంగా గత వైసీపీ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టివేసిందనే విషయాలను వివరించారు. 2019 వరకు లాభాల బాటలో ఉన్న ఆక్వా రంగం గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సంక్షోభంలోకి వెళ్లిందని తెలిపారు. ఆక్వా పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని వెల్లడిరచారు. ఆక్వా జోన్‌లలో ఉన్న 10 ఎకరాల ఆక్వా రైతులకు యూనిట్‌కు రూ.1.50 రాయితీని పొడిగిస్తున్నట్లు వివరించారు. అదే విధంగా ఆక్వా రైతులకు ఎటువంటి మార్కెట్ సెస్ లేదని స్పష్టం చేశారు.
ట్రాన్స్‌ఫార్మర్ల రేట్లపై పరిశీలన
ట్రాన్స్‌ఫార్మర్ల రేట్లు గణనీయంగా పెరిగాయని సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ రైతులకు ఏ విధంగా లాభసాటిగా అందించాలో…విద్యుత్ శాఖ పరంగా ఆక్వా రైతులకు ఎలా మేలు చేయాలనే దానిపైనే దృష్టి కేంద్రీకరించినట్లు వివరించారు. అదేవిధంగా 25 కేవీ, 65 కేవీ, 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ల రేట్లు పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నాయో కూడా పరిశీలన చేస్తున్నట్లు చెప్పారు. ఆక్వా రంగా న్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు.
మూడు జీవోలతో 70 శాతం ఆక్వా రైతులకు మొండిచేయి
రైతులను తికమక పెట్టే మూడు జీవోలను వైసీపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఆక్వా రైతులకు పూర్తిస్థాయిలో సబ్సిడీలను అందించడం లోనూ వైసీపీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పు డు ఎలాంటి నిబంధనలు లేకుండా ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ అందించామని తెలిపారు. అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిబంధనల పేరుతో 70 శాతం మంది రైతులకు సబ్సిడీలు తొలగించారని విమర్శించారు. ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అనే పేరుతో 10 ఎకరాలు, 5 ఎకరాలు అంటూ సాధ్యమైనంత వరకు ఆక్వా రైతులకు సబ్సిడీలు ఎగ్గొట్టే ప్రయత్నం చేశారని సభలో వివరించారు. ఈ కారణంగా రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని స్పష్టం చేశారు. ఐదేళ్లలో రూ.1.12 లక్షల కోట్ల అప్పులతో విద్యుత్ రంగ సంక్షోభం దిశగా వెళ్లి.. డిస్కంలు దివాళా తీసే స్థితికి వచ్చాయని తెలిపారు. ఆక్వా రంగానికి పూర్వవైభవం తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని వివ రించారు.
హేచరీస్ సమస్యలనూ పరిష్కరిస్తాం
శీతాకాలానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హేచరీలలో వచ్చే ఇబ్బందులను ఏ విధంగా అధిగమించాలో కార్యాచరణ రూపొందిస్తున్నటు తెలిపారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హేచరీస్ యజమానులతో విద్యుత్ శాఖ పరంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఆక్వారంగ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తుచేశారు. గడిచిన ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో, మూడు అసంబద్ధ జీవోలతో ఆక్వా రంగం సంక్షోభంలోకి పడిరదన్నారు. అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వం సబ్సిడీ పేరుతో రూ.1990 కోట్లు బాకీలతో డిస్క్‌ంలపై భారం వేసిందని తెలిపారు.