- వైసీపీ సానుకూల ఉద్యోగుల దందా
- భూమిని ఆక్రమించుకున్నాడని ఏసీబీ డీఎస్పీపై బాధితుడు ఫిర్యాదు
- అనంతపురం జిల్లాలో 10 ఎకరాలు పైన ఉన్న రైతులకు కూడా ప్రభుత్వ పథకాలు అందించాలని జిల్లా వాసులు విజ్ఞప్తి
అమరావతి (చైతన్యరథం): ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌లో గతంలో వైసీపీ నేతల అండదండలతో చేరిన ఉద్యోగులు వివిధ హోదాల్లో ఉండి ఇతర ఉద్యోగులను అవమానిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. వారు సిండికేట్ గా ఏర్పడి ఆసుపత్రులతో లాబీయింగ్ చేస్తున్నారని.. పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలు ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ డవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద్ సత్యనారాయణ, లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు లకు కట్టెపోగు వెంకయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వం వారిపై విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు వాస్తవాలను విచారించి చర్యలు తీసుకునేలా చూస్తామని నేతలు అర్జీదారునికి హామీ ఇచ్చారు.
ఏసీబీ డీఎస్పీ ఆక్రమణల దందా
తమ భూమిని ఏసీబీ డీఎస్పీ మహబూబ్ బాషా ఆక్రమించుకున్నాడని.. అతనిపై మండల రెవెన్యూ అధికారులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని, విచారణ చేపట్టి తమ భూమిని తమకు ఇప్పించాలని కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వ గ్రామానికి చెందిన కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వ గ్రామానికి చెందిన కె. శ్రీనివాసులు వాపోయాడు. కరోనా సమయంలో భీమవరంలోని క్వారంటైన్ సెంటర్లో పేషెంట్లకు అవసరమైన వస్తువులను సరఫరా చేసి 4 సంవత్సరాలు దాటిందని, ఇప్పటికీ ఆ బిల్లులు రాలేదని, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఆచంట భగవన్నారాయణ ఫిర్యాదు చేశాడు. వడ్డీలకు తెచ్చి కరోనా బాధితులకు అవసరమైన సామాగ్రిని అందిస్తే బిల్లులు ఇవ్వకుండా ఆఫీసుల చుట్టూ అధికారులు తిప్పుతున్నారని తమకు రావాల్సిన బిల్లులు వెంటనే వచ్చేలా చేసి ఆదుకోవాలని వేడుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఆనంతపురం జిల్లాలో పది ఎకరాల భూమి ఉన్న రైతులకు ప్రభుత్వ పథకాలను అమలు పరిచారని, ప్రస్తుతం అవి ఆగిపోయాయని, అనంతపురం కరువు రైతుల దీన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రైతులకు డ్రిప్, స్ప్రింకర్లు అందించడంతో పాటు పింఛన్, రేషన్ కార్డులు మాంజూరు చేయాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన ఆర్ జి. శివశంకర్ కోరాడు. గ్రామంలో అధికంగా పాడి రైతులు, గొర్ల పెంపకం దారులు ఉన్నారని, పశువులకు గొర్లకు రోగాలు వస్తే.. పక్క ఊర్లకు వెళ్లి వైద్యం చేయించాల్సి వస్తోందని.. కావున చిన్నగుడిపాడులో పశు వైద్య శాలను ఏర్పాటు చేయాలని ప్రకాశంజిల్లా పెద్ద దోర్నాల మండలం చిన్నగుడిపాడు గ్రామానికి చెందిన జమ్మిగుంపుల రమణబాబు విజ్ఞప్తి చేశాడు.