- ఇప్పటికే ప్రాథమిక విచారణలో అక్రమాల నిర్ధారణ
- 45 రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి క్రమశిక్షణా చర్యలు
- శాసనమండలిలో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్
అమరావతి(చైతన్యరథం): కడప విద్యాశాఖ మాజీ ఆర్జేడీ రాఘవరెడ్డి దురాగతాల పై 45 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి తగిన చర్యలు తీసుకుంటామని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడిరచారు. రాఘవరెడ్డిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మండలి సభ్యులు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, దువ్యారపు రామారావు, బి.తిరుమల నాయుడు అడిగిన ప్రశ్నలకు శాసనమండలిలో మంత్రి సమాధానం ఇచ్చారు. కడప విద్యాశాఖ మాజీ ఆర్జేడీ రాఘవరెడ్డి అక్రమాలపై ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందాయి..ఇప్పటికే ప్రాథమిక విచారణలో పలు అక్రమాలు నిర్ధారణ అయ్యాయి.. 45 రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి తప్పనిసరిగా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని వివరించారు. అంతకుముందు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ కడప ప్రాంతీయ విద్యాశాఖ డైరెక్టర్‌గా అనేక సంవత్సరాలు రాఘవరెడ్డి పనిచేశారు. విద్యాశాఖలో పనిచేసే వారు సమాజానికి మంచి విద్యాబుద్ధులు, సంస్కారం నేర్పించా ల్సిందిపోయి ఆయన సంస్కార హీనంగా వ్యవహరించారన్నారు.
ఉపాధ్యాయులను ఇష్టానుసారంగా దూషించేవారని, విద్యార్థుల ముందే టీచర్లను అవమానకరంగా మాట్లాడేవారన్నారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ అనుమతులు లేకుండానే పనులు చేయడం, ఇష్టానుసారంగా ఉపాధ్యాయుల అక్రమ బదిలీలకు పాల్పడ్డారు.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణాధికారిగా ప్రసన్నకుమార్‌ను నియమించగా రాఘవరెడ్డి చేసిన నేరాలు-ఘోరాలపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారిపై గూండాల తో దాడి చేయించారు. కడప చిన్న చౌక్ పోలీసుస్టేషన్‌లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది..ఇలాంటి అధికారులు విద్యావ్యవస్థలో కొనసాగేందుకు అనర్హుల న్నారు. విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.