- ఉచిత సిలిండర్లతో పేదలకు ఆర్థిక వెసులుబాటు
- ఇప్పటివరకు బుక్ చేసుకుంది 42.43 లక్షల మంది
- వారికి ప్రభుత్వం విడుదల చేసిన నగదు రూ.229 కోట్లు
- నవంబరు 18 నాటికి 33.44 లక్షల సిలిండర్ల డెలివరీ
- మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.182 కోట్ల సబ్సిడీ జమ
- పథకంపై మహిళల్లో రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ
- వంట గ్యాస్ భారాన్ని తగ్గించిన చంద్రన్నపై ప్రశంసలు
- సూపర్‌సిక్స్ హామీ అమలుచేసి మాటనిలుపుకున్న ప్రభుత్వం
అమరావతి(చైతన్యరథం): సూపర్ సిక్స్ హామీల్లో మొదటిదైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట నిలుపుకున్నారు. ఈ నెల 1న శ్రీకాకుళం జిల్లాలో దీపం 2 పథకాన్ని ప్రారంభించి నిధులు కేటా యించారు. ఈ పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళలకు వంట గ్యాస్ భారాన్ని తొలగించి వెలుగులు నింపారు. ఈ పథకంపై మహిళల్లో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోం దనే దానికి అత్యధిక సంఖ్యలో జరుగుతున్న బుకింగ్స్ నిదర్శనం.
నవంబరు 18 నాటికి 33.44 లక్షల సిలిండర్ల డెలివరీ
దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లకు నవంబర్ 18 నాటికి 42,43,234 మంది బుక్ చేసుకోగా 33,44,320 మందికి గ్యాస్ డెలివరీ అయింది. 28,86,123 మంది లబ్ధిదారులకు సబ్సిడీ రూ.229.61 కోట్లు విడుదల చేసింది. 22,98,465 మంది ఖాతాల్లో రూ.182.59 కోట్లు జమ అయింది. ఇది ప్రభుత్వం విడుదల చేసిన మొత్తంలో 79.52 శాతంగా ఉంది. సాంకేతిక కారణాలతో 2,758 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.21.78 లక్షలు మాత్రమే జమకాలేదు. దీపం -2 పథకంపై మహిళల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతుందనేందుకు ఈ లెక్కలే నిదర్శనం.
పేదలకు తొలగనున్న వంట గ్యాస్ భారం
వంట గ్యాస్ భారంతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి వినియో గదారులకు దీపం 2 పథకం ద్వారా వెసులుబాటు కలగనుంది. ఈ పథకం కింద ఏడాదికి మూడు విడతల్లో మూడు సిలిండర్లను ఉచితంగా అందజేయనుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఓ సిలిండర్‌ను అందజే యనుంది. పథకానికి బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించారు. బుక్ చేసుకుని సిలిం డర్ డెలివరీ అయిన 48 గంటల్లోగా అర్హులైన వారి ఖాతాల్లో డబ్బు జమ అవు తుంది. పథకానికి రేషన్‌కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతిఒక్కరూ అర్హు లుగా ప్రకటించింది.
ఏడాదికి ప్రభుత్వంపై రూ.2,694 కోట్ల భారం
పథకం కింద మూడు ఉచిత సిలిండర్లకు ఏడాదికి రూ.2,694 కోట్లు, ఐదేళ్లకు రూ.13,423 కోట్లు ప్రభుత్వంపై భారం పడనుంది. ఆర్థిక కష్టాలున్నా ఇచ్చిన హామీని అమలుచేస్తూ చంద్రబాబు మాట నిలబెట్టుకుని పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. ఏడాదికి మూడు విడతల్లో మూడు సిలిండర్లను అర్హులైన వినియోగదారుల కు అందించనుంది. మొదటి విడతకు సంబంధించి రూ.894 కోట్ల చెక్కును ఇప్పటికే పెట్రోలియం సంస్థలకు అందజేశారు.