- రాష్ట్రంలో టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేస్తాం
- మంగళగిరి తరహాలో వీవర్‌శాలలకు చర్యలు
- చీరాలలో టెక్స్‌టైల్స్ పార్కుతో పాటు హ్యాండ్లూమ్ పార్క్
- నేత కార్మికులకు 90 శాతం సబ్సిడీతో పనిముట్లు
- చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకువస్తాం
- అసెంబ్లీలో బీసీ సంక్షేమ, చేనేత, జౌళి మంత్రి సవిత
అమరావతి(చైతన్యరథం): త్వరలోనే నూతన టెక్స్‌టైల్ పాలసీ తీసుకురానున్నట్లు బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. గురువారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మిగనూరులో టెక్స్‌టైల్ పార్కుపై టీడీపీ ఎమ్మెల్యే బి.జయనాగేశ్వరరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. 2015 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చేనేతలకు ఆసరాగా ఉండేలా ఎమ్మిగనూరులో టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుకు అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు..ఇందుకు 90 ఎకరాలను కేటా యిస్తూ ఉత్తర్వులు జారీచేశారు..తరువాత జగన్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల మాదిరిగా చేనేత రంగం కూడా పూర్తిగా నిర్వీర్యమైందన్నారు. పేదల ఇళ్ల పేరుతో ఎమ్మి గనూరు టెక్స్‌టైల్ పార్కులో 14 ఎకరాలను వైసీపీ ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఈ నిర్ణయంపై తాము కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చి టెక్స్‌టైల్ పార్కు భూములను కాపాడా మన్నారు. 2014-19లో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఎమ్మిగనూరులో కచ్చితంగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేయబోతున్నామని, ఈ పార్కు ద్వారా 5 వేల మందికి ఉపాధి కల్పించబోతున్నామని మంత్రి స్పష్టం చేశారు.
చీరాలలో హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్ పార్కులు
ఎమ్మిగనూరుతో పాటు రాయదుర్గం, మైలవరం, పామిడిలోనూ టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. చీరాలలో హ్యాండ్లూమ్ పార్క్‌తో పాటు టెక్స్‌టైల్ పార్కు కూడా నిర్మించనున్నట్లు తెలిపారు. త్వరలోనే టెక్స్‌టైల్ పాలసీ తీసుకురాబోతు న్నట్లు చెప్పారు. చేనేతలను అన్ని విధాలుగా ఆదుకోవాలన్న లక్ష్యంతో దూరదృష్టితో 2014-19లో రాష్ట్ర వ్యాప్తంగా టెక్స్‌టైల్స్ పార్కులు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబా బు నిర్ణయించారన్నారు. తరవాత వచ్చిన జగన్ వాటిని అభివృద్ధి చేయకపోగా వ్యవస్థల ను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ భూములు కబ్జా చేయడం, దోచుకోవ డం, దాచుకోవడం తప్ప ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు.
90 శాతం సబ్సిడీతో నేతన్నలకు పనిముట్లు
మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ వీవర్‌శాల ఏర్పాటు చేసి చేనేతలకు అండగా నిలిచారని తెలిపారు. అదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా వీవర్ శాలలు ఏర్పాటు చేసే ఆలో చన తమ ప్రభుత్వానికి ఉందన్నారు. ఇప్పటికే కొందరు ఎంపీలు తమ ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి వీవర్ శాలల ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినట్లు వివరించారు. ఆదిత్య బిర్లా గ్రూప్ వంటి సంస్థల సాయంతో రాష్ట్రంలో పలుచోట్ల వీవర్ శాలలు, క్లస్టర్లు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నేతన్నల సంక్షేమానికి కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకురాబోతున్నామని తెలిపారు. చేనేత కార్మికులకు 90 శాతం సబ్సిడీతో పనిముట్లు అందజేయనున్నట్లు వివరించారు. ధర్మవరంలో మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు రూ.30 కోట్ల నిధులను కేంద్రం నుంచి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంజూరుకు కృషి చేశారన్నారు. చేనేత రంగానికి, నేతన్నకు కూటమి ప్రభుత్వం పూర్వవైభవం తీసుకురానుందని వెల్లడిరచారు.