- గత ప్రభుత్వంలో వైసీపీ అనేక అక్రమాలకు పాల్పడిరది
- పన్ను కట్టని వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు
- నెలకు రూ.30 నుంచి రూ.10 వేల వరకూ దండుకున్నారు
- చెత్త పన్నుతో ప్రజలపై భారం మోపిన చెత్త వైసీపీ ప్రభుత్వం
- అసెంబ్లీలో పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ
- చెత్త పన్ను రద్దుకు ప్రతిపాదన…బిల్లుకు సభ ఆమోదం
అమరావతి(చైతన్యరథం): గత ప్రభుత్వంలో చెత్త పన్ను వసూలు, కాంట్రాక్టుల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి పొంగూరు నారాయణ వెల్లడిరచారు. 2014`19 టీడీపీ హయాంలో మున్సిపాలి టీల్లో ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ పెంచలేదని తెలిపారు. ప్రజలు వద్దని గొడవ చేసినా బలవంతంగా చెత్త పన్నుతో ప్రజలను నాటి వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని మండిపడ్డారు. చెత్తపై యూజర్ చార్జీలు రద్దు చేస్తూ మున్సిపల్ లాస్ చట్టంలో చేసిన సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది..ఈ బిల్లును ఆమోదించాలని గురువారం అసెంబ్లీలో మంత్రి నారాయణ ప్రతిపాదించారు..బిల్లుపై కాసేపు చర్చ జరిగిన తర్వాత సభ ఆమోదించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 40 మున్సిపాలిటీల్లో సర్వీసు ప్రొవైడర్ల ద్వారా చెత్త సేకరించేందుకు వీలుగా 2020లో మున్సిపల్ లాస్ యాక్ట్‌లో వైసీపీ ప్రభుత్వం సవరణలు చేసిందని తెలిపారు. దీని ప్రకారం గృహాలకు నెలకు రూ.30 నుంచి రూ.120 వరకూ, అలాగే వాణిజ్య సము దాయాలకు నెలకు రూ.100 నుంచి రూ.10,000 వరకూ 2021 నవంబర్ నుంచి ప్రజల నుంచి బలవంతంగా పన్ను వసూలు చేశారని వివరించారు. విశాఖపట్నం ప్రాం తంలో సాయి పావని, రాజమండ్రి ప్రాంతంలో స్వయం భూ, అనంతపురం ప్రాంతంలో రెడ్డి ఎంటర్ప్రైజెస్ ద్వారా చెత్త సేకరణ ప్రారంభించారని గుర్తుచేశారు.
చెత్త సేకరణ కాంట్రాక్టర్ల లబ్ధి కోసం అప్పులు
ఇలా వాహనాల ద్వారా చెత్త సేకరణకు నెలకు ఒక్కో వాహనానికి రూ.51,641 నుంచి రూ.62,964 చెల్లించేవారు..నెలకు రూ.13.9 కోట్లు చెల్లించేవారు.. 2021 నవంబర్ నుంచి 2024 జూలై వరకూ రూ.325 కోట్లు బిల్లు అయితే రూ.249 కోట్లు చెల్లించారు..అయితే ప్రజలు మాత్రం చెత్త పన్ను వద్దని గొడవ చేసినా పట్టించుకోలేదని తెలిపారు. కొన్ని ఇళ్లకు ఆస్తి పన్ను రూ.50 ఉంటే వాటికి రూ.356 చెత్త పన్ను వేశారు ..2014-2019 మధ్య టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో మున్సిపాలిటీల్లో ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ పెంచలేదని మంత్రి నారాయణ సభలో తెలిపారు. చెత్త పన్ను రూ.188 కోట్లు వసూలు చేసినట్లు గత ప్రభుత్వం చూపించింది. మొత్తం రూ.325 కోట్లకు గాను మిగిలిన డబ్బులు చెల్లించేందుకు స్వచ్ఛ భారత్ నుంచి రూ.90.19 కోట్లు, హౌసింగ్ బోర్డు నుంచి రూ.32.55 కోట్లు, డీటీసీపీ నుంచి రూ.9.6 కోట్లు, రాజీవ్ స్వగృహ నుంచి రూ.4.56 కోట్లు అప్పు తీసుకున్నారు..అయితే కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూ ర్చాలనే ఉద్దేశంతోనే ఇతర విభాగాల నుంచి కూడా అప్పులు తీసుకున్నారు..చెత్త పన్ను సేకరణ, అప్పులపై విచారణ చేయిస్తాం..గత ప్రభుత్వంలో 85 లక్షల టన్నుల చెత్త పేరు కుపోయింది…కొన్నిచోట్ల ఓ కాంట్రాక్ట్ సంస్థ చెత్త తీసుకెళ్లి మైనింగ్ చేసిన గోతుల్లో వేసింది..2014-19 మధ్య ఉమ్మడి 10 జిల్లాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పాలని నిర్ణయించాం..విశాఖపట్నం, గుంటూరులో ఈ ప్లాంట్లు చక్కగా నడుస్తున్నాయి..మిగతా 8 ప్లాంట్లు ఏర్పాటు చేయకుండా వాటిని రద్దు చేశారు..ప్లాంట్లు గనుక ఏర్పాటు చేసిన ట్లయితే ఇంత భారీస్థాయిలో చెత్త పేరుకుపోయేది కాదని తెలిపారు.
బలవంతంగా చెత్త పన్ను వసూలు చేశారు
ఒక పక్క ప్రజలు గగ్గోలు పెడుతున్నా వినకుండా బలవంతంగా పన్నులు వసూలు చేశారు..కొన్ని చోట్లయితే ట్రాక్టర్లతో చెత్తను తీసుకొచ్చి షాపుల ముందు అధికారులే వేసిన పరిస్థితి కూడా ఉంది..కొందరు మంత్రులు కూడా చెత్త పన్ను కట్టలేరా అంటూ అంటూ హేళనగా కూడా మాట్లాడారు. కొన్నిచోట్ల అయితే పన్ను కట్టలేదని తాగునీటి సరఫరా కూడా నిలిపివేశారు..ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని మా నాయకుడు హామీ ఇచ్చారు..ఇచ్చిన హామీ నెరవేరుస్తూ చెత్త పన్నును ఇప్పటికే రద్దు చేశాం..అయితే వైసీపీ చెత్త పన్నుపై చట్టంలో చేసిన మార్పులను తొల గించాల్సిన అవసరం ఉన్నందున 1955 మున్సిపల్ కార్పొరేషన్స్ యాక్ట్‌లోని సెక్షన్ 491-ఏ, ఏపీ మున్సిపాలిటీల చట్టం 1965లోని 170-బీలను తొలగిస్తూ సవరణ బిల్లు ను ప్రవేశపెట్టాం..ఈ బిల్లును ఆమోదించాల్సిందిగా కోరుతున్నామని మంత్రి సభలో ప్రతిపాదించగా స్వల్ప చర్చ తర్వాత బిల్లు ఆమోదం పొందింది.