- నువ్వు గుంటూరుకు మేయర్ కావడం నగర ప్రజల దౌర్భాగ్యం
- టీడీఆర్ బాండ్లలో రూ.500 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు
- హైకోర్టు కూడా నగర ప్రథమపౌరుడి తీరుపై మందలించింది
- ఎక్కడికి వెళ్లినా వదిలేది లేదు..జైలు ఊచలు లెక్కించక తప్పదు
- కొడాలి నాని ఎక్కడున్నావ్…చంద్రబాబు బూట్ పాలిష్ చేయలేదేం
- టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ధ్వజం
మంగళగిరి(చైతన్యరథం): గుంటూరు మేయర్ మనోహర్‌నాయుడుకు నైతిక విలువ లుంటే వెంటనే రాజీనామా చేయాలని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాస రావు కోరారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో గురువారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంతో రాజకీయ చరిత్ర కలిగిన గుంటూరు నగరా నికి వైసీపీకి చెందిన ఆయన మేయర్ కావడం గుంటూరు నగర ప్రజల దౌర్భాగ్యమని మండిపడ్డారు. రాజకీయ చైతన్యం కలిగిన గుంటూరు పట్టణానికి గతంలో నడిరపల్లి నరసింహారావు, కొల్లి శారద, చుక్కా ఏసురత్నం లాంటి నిజాయితీపరులు గుంటూరు నగర మేయర్లుగా, చైర్మన్లుగా పనిచేసి పదవికి వన్నెతెచ్చారని గుర్తుచేశారు. నేడు మనో హర్‌నాయుడు పూర్తిగా అవినీతి కూపంలో కూరుకుపోయాడు..
నగర ప్రథమ పౌరుడై ఉండి ఇలా వ్యవహరించవచ్చా? అని హైకోర్టు సైతం ఆయనను తీవ్రంగా మందలిం చింది. ఆయనకు ఏ మాత్రం నైతిక విలువలు లేవు..ఒకవేళ ఉంటే ప్రాయశ్చిత్తంగా వెంటనే పదవికి రాజీనామా చేయాలన్నారు. ఆయన హయాంలో గుంటూరు నగరం అభివృద్ధి చెందకపోగా కుంటుపడిరది..కోట్లాది రూపాయల కుంభకోణం చోటు చేసు కుంది..టీడీఆర్ బాండ్ల విషయంలో రూ.500 కోట్ల కుంభకోణం జరిగింది. దాని నుంచి తప్పించుకోవడానికి ట్రాన్స్‌ఫర్ల పేరుతో దూరప్రాంతాలకు వెళ్లిపోయారు. దీనిపై ప్రభు త్వం విచారణ చేపట్టడానికి సిద్ధంగా ఉందని వెల్లడిరచారు. ఎటు వెళ్లినా మేము మాత్రం వారిని వదిలేదిలేదు..పట్టుకుని శిక్షిస్తామని స్పష్టం చేశారు.
ముడుపులు ఇస్తే ఏమైనా చేస్తారు…
ఎక్కడ కొత్తగా కట్టడాలు కడుతున్నా వారి వద్ద నుంచి ముడుపులు తీసుకుంటు న్నారు..అన్‌ఆథరైజ్డ్ వాటికి కూడా అనుమతులు ఇస్తున్నారు..అవినీతి సొమ్మును కూడబె ట్టుకుంటున్నారు.. ముడుపులు ఇస్తామంటే ఎక్కడైనా సరే సంతకం పెట్టే పరిస్థితి నెలకొం ది. గుంటూరు నగర ప్రజలు కొళాయి కనెక్షన్లు కావాలన్నా..తాగునీటి కొళాయిలు మరమ్మతులు చేయాలన్నా డబ్బులు తీసుకునే పరిస్థితి ఉంది. అపార్టుమెంట్ కట్టుకునే వారి పనులను ఆపి వారి వద్ద కొత్త పైపులు వేసి నీచ స్థితికి దిగజారారని ధ్వజమెత్తారు. ఇకనైనా ఆయన కుంభకోణాలు, అవినీతి, అరాచకాలకు చరమగీతం పాడాలి..కళ్లు తెరచి త్వరగా రాజీనామా చేస్తే అంత మంచిదని హితవుపలికారు. గుంటూరు నగర ప్రజలు మేల్కొవాలి..వైసీపీకి చెందిన 15 మంది కార్పొరేటర్లే ఆయన అవినీతిని సహిం చలేక పార్టీ మారారు.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఓడిపోయిన విడదల రజ ని, అంబటి రాంబాబులు పట్టాభిపురం పోలీసుస్టేషన్‌లో నారా లోకేష్‌పై ఫిర్యాదు చేశా రు..వారికి నీతి నిజాయితీలు లేవు, వ్యక్తిగత విలువులు లేవు..ఇద్దరూ మంత్రులుగా ఏం వెలగ బెట్టారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వం కావటి మనోహర్ నాయుడుపై విచారణ జరపబోతోంది..జైలు ఊచలు లెక్కించక తప్పదని స్పష్టం చేశారు.
ఆ నలుగురు జిల్లాను, రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు
గ్లోబల్ సంఘానికి అధ్యక్షుడు జగన్, అంబటి రాంబాబు, విడదల రజనిల అవినీతి సామ్రాజ్యం బట్టబయలు కానుంది. జగన్ రెండుసార్లు మాత్రమే నోరు తెరుస్తాడు..ఒకటి అన్నం తినడానికి, రెండోది అబద్ధాలు చెప్పడానికి..జగన్, అంబటి రాంబాబు, విడదల రజని, కావటి మనోహర్‌లు జిల్లాను, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. భార తిని ఏదో అన్నారని లోకేష్‌పై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారు.. నీకు దమ్ము, ధైర్మం ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. జగన్ తల్లి, చెల్లిపై భారతిరెడ్డి సహాయకుడు వర్రా రవీంద్రరెడ్డి పెట్టిన కామెంట్లు చదివి సభ్య సమాజం సిగ్గుతో తల దించుకుంటోందన్నారు. వైసీపీ అదొక పార్టీ, ఆయనొక అధినేతా? అని ప్రజలు చర్చిం చుకుంటున్నారు. మనోహర్‌నాయుడు అవినీతి కూపంలో నుంచి బయటకు రావాలని హితవుపలికారు. జగన్ క్యాబినెట్ అంతా జైలుకు వెళ్లక తప్పదని స్పష్టం చేశారు. గతం లో పిచ్చి ప్రేలాపనలతో చెలరేగిపోయే కొడాలి నాని ఇప్పుడు ఎక్కడున్నాడు? చంద్రబాబు ఎన్నికల్లో గెలిస్తే ఆయనకు బూట్ పాలిష్ చేస్తానని కొడాలి గతంలో చెప్పాడు..చం ద్రబాబు గెలిచి ప్రమాణం చేసి 5 నెలలైనా బూట్ పాలిష్ చేయడానికి రాలేదే? బూట్ పాలిష్ చేసి చాలెంజ్‌ను నెరవేర్చుకోవాలని హితవుపలికారు.