అమరావతి: ఇమామ్‌లు, మౌజమ్‌లకు గౌరవ వేతనాలను కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో సోమవారం పలువురు ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఇమామ్, మౌజమ్‌లకు గౌరవ వేతనాలను గతంలో టీడీపీ ప్రభుత్వమే ప్రారంభించిదని గుర్తుచేశారు. ముస్లింలు హజ్ యాత్రకు వెళ్తే ఇచ్చే ఆర్థిక సాయాన్ని కొనసాగిస్తామన్నారు. గతంలో యాత్రకు వెళ్లి వచ్చినవారికి ఇవ్వాల్సిన పెండిరగ్ నిధులను కూడా మంజూరు చేస్తామని చెప్పారు. విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారికి మాత్రమే రూ. లక్ష అందజేస్తామని ఫరూక్ తెలిపారు.