- వరి కోత మిషన్ తగలబెట్టేస్తానని బెదిరింపులు
- ప్రజావినతుల కార్యక్రమంలో బాధితుడి గోడు
- అర్జీలు స్వీకరించిన గండి బాబ్జి, బుచ్చి రాంప్రసాద్
మంగళగిరి(చైతన్యరథం): గత 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ పొలాన్ని వైసీపీ నేత ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలానికి చెందిన శీలం సునీల్‌కుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. టీడీపీ కేంద్ర కార్యాల యంలో శనివారం ప్రజా వినతుల కార్యక్రమంలో నాయకుల ఎదుట గోడు వెళ్ల బోసుకున్నాడు. ప్రస్తుతం సాగుచేసుకున్న వరి పంట కోతకు వచ్చింది..వరికోత మిషన్‌లను పిలిచి పొలంలోకి దిగితే మిషన్‌లను తగలబెడతామని వైసీపీ నేత సురేం ద్రనాథ్‌రెడ్డి బెదిరిస్తున్నాడు..ఆయనకు భయపడి వరికోత మిషన్ వారు రాకపోవడం తో పండిన పంట నేలపాలు అవుతోంది.. దయచేసి వెంటనే వరి కోతను అడ్డుకుంటున్న వైసీపీ నేతపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని నేతలను విజ్ఞప్తి చేశాడు. అర్జీదారుల నుంచి ఏపీసీవోజీఎఫ్‌ఎల్ చైర్మన్ గండి బాబ్జి, బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్‌లు విన్నపాలు స్వీకరించారు. సంబం ధిత అధికారులకు ఫోన్లు చేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
` తాము యానాదులం..నివాసం ఉంటున్న స్థలాన్ని గతంలో ప్రభుత్వం మరొకరికి కేటాయించారు.. తాము పోరాటం చేయడంతో మరోచోట భూమి ఇస్తామ ని చెప్పారు.. తమకు ఇస్తామన్న 50 సెంట్లు ఇప్పించాలని బాపట్ల జిల్లా అద్దంకికి చెందిన బూదూరి ముత్యాలమ్మ, బూదూరి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.
` తనకు నలుగురు కుమార్తెలు.. భర్త మరణాంతరం వచ్చిన ఆస్తి మొత్తాన్ని పెద్ద కుమార్తె పోకా రత్తమ్మ తనకు తెలియకుండా ఆమె పేరున ఎక్కించుకుంది.. వృద్ధాప్యంలో తనను పట్టించుకోవడం లేదు..న్యాయం చేయాలని బాధితురాలు ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలం ఒబ్బిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన రావిళ్ల తిరుపతమ్మ ఫిర్యాదు చేసింది.
` కడప జిల్లా మైదుకూరుకు చెందిన మాలేపాటి లక్ష్మీదేవి సమస్యను వివరిస్తూ సర్వే నెంబర్ 189లో తన అనుభవంలో ఉన్న స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించి తనను హతమారుస్తానని తన భర్త మొదటి భార్య మూడో కుమారుడు మాలేపాటి రాధారామ్ బెదిరిస్తున్నాడు..అతనిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.
` తమ గ్రామంలో నెట్‌వర్క్ అందక ఫోన్లు సక్రమంగా పనిచేయడం లేదు.. బీఎస్‌ఎన్‌ఎల్ లేదా ఇతర ప్రైవేట్ నెట్‌వర్క్ టవర్‌ను ఏర్పాటు చేయాలని ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం మురికిమళ్లపెంట గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు నాయక్, గిరిజనులు విజ్ఞప్తి చేశారు.
` తన మేనమామ, పిన్ని కూతురు తన పొలానికి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అక్రమంగా ఆన్‌లైన్ చేసుకున్నారు.. దాన్ని రద్దు చేసి తన పేరుపై పట్టా పాస్ పుస్తకా లు ఇచ్చి ఆన్‌లైన్ చేయాలని విజయవాడకు చెందిన బాల చెన్నకేశవరావు వినతిపత్రం ఇచ్చారు.
` వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించకుండా గత ప్రభుత్వం తమకు అన్యాయం చేసింది.. గత ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా వేతనం పెంచలేదు..గతంలో చంద్ర బాబు రూ.6,500 నుంచి రూ.10500లకు తమ వేతనం పెంచారు.. తమకు పే స్కేల్ అమలు చేసి నామినీలుగా పనిచేస్తున్న వారిని వీఆర్‌ఏలుగా నియమించాలి.. అర్హలకు ప్రమోషన్ ఇవ్వాలని పలువురు వీఆర్‌ఏలు వేడుకున్నారు.