ముత్తుకూరు (అమరావతి): మాజీ మంత్రి, వైకాపా నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు నెల్లూరు జిల్లా ముత్తుకూరు పీఎస్‌లో చారించారు. సామాజిక మాధ్యమాల్లో తెదేపా నేత సోమిరెడ్డిపై ఆరోపణలు, కార్టూన్ల ప్రచురణపై తెదేపా నేతల ఫిర్యాదుతో ముత్తుకూరు పీఎస్‌లో కాకాణిపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి కృష్ణపట్నం సీఐ రవినాయక్ సమక్షంలో రెండున్నర గంటలపాటు విచారించారు. విచారణలో భాగంగా కాకాణిని పోలీసులు 54 ప్రశ్నలు అడిగారు. పోలీసులు అడిగిన ప్రశ్నల్లో చాలా వాటికి ఆయన సమాధానం ఇవ్వలేదు. అంతకుముందు ఈ కేసు విచారణకు మందీ మార్బలంతో ర్యాలీగా వచ్చిన కాకాణిని పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు అడ్డుపెట్టి ర్యాలీని అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాకాణి ఒక్కరినే స్టేషన్ వద్దకు అనుమతించారు.