జగన్‌రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన ఈ పదిహేను సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా తిరుమల సందర్శనలో ‘‘నాకు తిరుమల వెంకటేశ్వరుడి మీద పూర్తి నమ్మకం ఉంది’’ అని తిరుమల ఆలయ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఫారంలో సంతకం చేసింది. ఏపీ దేవాదాయ శాఖ జీవో 311, నిబంధన 16 ప్రకారం తిరుమల గుడిలో హిందువులు కాని అన్య మతస్తులు స్వామి దర్శనం చేసుకోవాలంటే ‘‘వెంకటేశ్వర స్వామిపై నాకు పూర్తి నమ్మకం ఉంది.. అందుకని స్వామి వారి దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాను’’ అని దేవస్థానం వద్ద ఉన్న రిజిస్టర్‌లో రాసి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎన్నడూ జగన్, ఆయన తండ్రి వైఎస్సార్ తిరుమలకు వచ్చినప్పుడు రిజిస్టర్‌లో సంతకాలు చేయలేదు. వైఎస్సార్ అయితే రిజిస్టర్ అయన ముందు పెడితే చేతితో పక్కకు నెట్టేసిపోయిన ఘటన కూడా ఉంది. వైఎస్సార్, ఆయన కుటుంబానికి హిందువుల ఓట్లు కావాలి. కానీ హిందూ ఆలయాల నిబంధనలు మాత్రం పాటించరు.
ఇప్పుడు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని దేశవ్యాప్తంగా వచ్చిన చెడ్డ పేరుని తొలగిం చుకోవటానికి జగన్‌రెడ్డి కొత్తగా తిరుమలకు కాలినడకన ప్రయాణం అని కొత్త నాటకం మొదలుపెట్టాడు. తిరుమల గుడి సందర్శనను ఒక సాకుగా పెట్టుకుని ఆ నెయ్యి కల్తీ పాపాలను కడిగేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పాపం జరిగింది జగన్ ప్రభుత్వ హయాంలో అయితే.. చంద్రబాబు పాపం ప్రక్షాళన కోసం పూజలు అని పిలుపునివ్వడం ఆయన సైకో చేష్టలకు నిదర్శనం. గత ఐదేళ్ల వైకాపా పాలనలో 300కు పైగా దేవాల యాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలు జరిగాయి. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు కూడా ఘటనా స్థలాలను పరిశీలించలేదు సరికదా కనీసం జరిగిన అపచారా లను ఖండిరచింది లేదు. తన పదవీ కాలంలో హిందూమత ఆచారాలు, తిరుమల తిరుపతి దేవస్థానం సాంప్రదాయాలపై ఏ మాత్రం విశ్వాసం చూపని ఆయన తగుదునమ్మా అంటూ హిందూమతాన్ని గౌరవిస్తాను అంటూ తిరుమల సందర్శనకు బయలుదేరడం సిగ్గుచేటు. కల్తీ నెయ్యి విషయంలో సీబీఐ దర్యాప్తు అని కలవరిస్తున్న జగన్‌రెడ్డి దేవాలయాలపై వైకాపా హయాంలో జరిగిన దాడులపైనా న్యాయ విచారణ కూడా అడగాలి. దేవాలయాలపై చేసిన దాడులకు క్షమాపణ చెప్పి స్వామివారి మెట్లు తాకాలి. ఇది రాష్ట్రంలోని ప్రతిఒక్కరూ కోరు కొనేది.
కుటుంబం మొత్తం క్రైస్తవాన్ని ఆచరించే జగన్‌రెడ్డి తిరుమల గుడిని నమ్మకం ఉంటేనే సందర్శించవచ్చు. కానీ వేంకటేశ్వరుడి మీద నాకు నమ్మకం ఉంది అని రిజిస్టర్‌లో సంతకం చేసే డిక్లరేషన్ ఇచ్చే లోపలికి వెళ్లాలి. అలా సంతకం చేయకుండా జగన్ తిరుమల గుడి లోకి వెళ్లే ప్రయత్నం చేస్తే హిందువులని అవమానించినట్టే. తిరుమల ఆలయ మర్యాదలు, సాంప్రదాయాలను పాటించనట్టే. ఇందిరాగాంధీ, అబ్దుల్ కలాం అంతటి వారే రిజిస్టర్‌లో సంతకం చేసి దేవుడి దర్శనం చేసుకున్నప్పుడు…జగన్‌రెడ్డి ఆ సాంప్రదాయాలను పాటించక పోవడం దేవుడితో రాజకీయాలు చేయడమే అవుతుంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా గూ తిరుమలలో కనీస నియమాలు కూడా పాటించలేదు. ఇకనైనా దేవుడిని రాజకీయాలకు వాడుకునే దుష్ట సంప్రదాయానికి తెరదించి ఇప్పుడైనా నియమ నిబంధనల ప్రకారం స్వామి వారిని సందర్శించి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.
` నీలాయపాలెం విజయకుమార్,
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి