చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఆలయాలకు మహర్దశ!

సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు

by చైతన్యరధం
Aug 28, 2024 at 6:35am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఆలయాలకు మహర్దశ!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • దేవాలయాల్లో ఆధ్యాత్మిక వెల్లివిరవాలి
  • అపచారాలకు చోటుండకూడదు
  • బలవంతపు మత మార్పిడులు ఆగాలి
  • దేవాలయాల్లో అన్యమతస్థులు ఉండకూడదు
  • భక్తుల మనోభావాలకు, ఆగమశాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యం
  • అర్చకుల వేతనం రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంపు
  • ధూపదీప నైవేద్యాలకు రూ.10 వేలు
  • వేద విద్యార్థులకు రూ.3 వేల భృతి
  • నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం రూ.25 వేలు
  • పాలక మండళ్లలో మరో ఇద్దరికి అవకాశం
  • దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు కమిటీ
  • ఆలయాల్లో పరిశుభ్రత, ప్రసాదంలో నాణ్యత, ప్రశాంత వాతావరణం ఉండాలి

అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో దేవాలయాలకు మళ్లీ పునర్వైభవం రానుంది. గత ఐదేళ్లుగా నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురైన ఆలయాలు ఇప్పుడు మళ్లీ ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనున్నాయి. సీఎం చంద్రబాబు పాలనలో ఆలయాలకు మహర్దశ పట్టనుంది. దేవాదాయ శాఖపై మంగళవారం నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో ఆధ్యాత్మిక వెల్లివిరవాలని, అపచారాలకు చోటు ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. భక్తులు ప్రశాంతత కోసం, తమ బాధలు దేవుడితో చెప్పుకోవడం కోసం గుళ్లకు వస్తారని…అలాంటి వారికి మంచి దర్శనం, చక్కటి వాతారణం కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. దేవాలయాల్లో పరిశుభ్రత, ప్రసాదంలో నాణ్యత, ప్రశాంత వాతావరణం కనిపించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏ కుటుంబమైనా పుణ్యక్షేత్రానికి వస్తే ఒకటి రెండు రోజులు అక్కడ ఉండే వాతావరణం కల్పించాలని అన్నారు.

భక్తుల మనోభావాలు ముఖ్యం
ఇకపై ఎక్కడా బలవంతపు మత మార్పిడులు ఉండకూడదని….ఆ దిశగా దేవాదాయ శాఖ కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. పటిష్టమైన చర్యల ద్వారా బలవంతపు మత మార్పిడులను అడ్డుకోవచ్చని అన్నారు. అదే విధంగా దేవాలయాల్లో అన్యమతస్థులు ఉండకూడదని చెప్పారు. ఏ మతంలో అయినా భక్తుల మనోభావాల ముఖ్యమని సీఎం అన్నారు. భక్తుల మనోభావాలకు, ఆగమశాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేలా దేవాదాయ శాఖ అధికారులు పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. సులభతర దర్శనం, దేవాలయాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలు, బస చేయడానికి అనువైన కాటేజ్‌లు, గదులు ఉండాలని అన్నారు. భక్తుల జేబులు ఖాళీ చేసే విధంగా కాకుండా, భక్తులు ఇష్టంగా అక్కడ గడిపే పరిస్థితి కల్పించాలని అన్నారు. ఆధ్యాత్మిక పర్యాటకానికి మన దగ్గర అనేక అవకాశాలు ఉన్నాయని…వాటిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలతో రావాలని సీఎం ఆదేశించారు. ఇందు కోసం దేవాదాయ శాఖ, అటవీ శాఖ, పర్యాటక శాఖల మంత్రులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-05-2026

చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026

నడకలేదు, పరుగులే!

ట్రస్ట్‌బోర్డుల్లో మరో ఇద్దరు
దేవాలయాల ట్రస్ట్‌ బోర్డుల్లో అదనంగా మరో ఇద్దరికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. రూ. 20 కోట్లు కంటే ఎక్కువ ఆదాయం ఉంటే 15 మంది బోర్డు సభ్యులుగా ఉంటారు. దీన్ని 17కు పెంచనున్నారు. ఇలా అన్ని ట్రస్ట్‌ బోర్డులలో ఇద్దరు చొప్పున అదనంగా సభ్యులను సంఖ్యను పెంచనున్నారు. ట్రస్ట్‌ బోర్డులో ఒక బ్రాహ్మణుడు, ఒక నాయీ బ్రాహ్మణుడు తప్పకుండా ఉండేలా చూస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ మేరకు సభ్యుల సంఖ్యను పెంచి వారికి అవకాశం కల్పించనున్నారు.

అర్చకుల వేతనాలు పెంపు
అదేవిధంగా రూ. 10 వేలు వేతనం పొందే అర్చకులకు ఇకపై రూ. 15 వేలు ఇవ్వనున్నారు. ఈ నిర్ణయం ద్వారా 1683 మంది లబ్ధి పొందనున్నారు. దీని వల్ల ప్రభుత్వం పై ఏటా రూ. 10 కోట్ల భారం పడుతుంది. అదేవిధంగా ధూప, దీప నైవేద్యాలకు దేవాలయాలకు ఇచ్చే మొత్తం రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఏడాదికి రూ. 32 కోట్ల అదనపు భారం పడుతుంది. వేద విద్య చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న వారికి నెలకు రూ. 3 వేలు భృతి ఇవ్వాలని సీఎం సూచించారు. నాయీ బ్రాహ్మణులకు కనీసం వేతనం రూ. 25 వేలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ చేసుకున్న రోజును దేవాదాయ శాఖపరంగా గుర్తించి నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆర్యవైశ్య సంఘాల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పరంగా అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

మొదలుకాని పనులు నిలిపివేత
సిజిఎఫ్‌ కింద, శ్రీవాణి ట్రస్ట్‌ నిధుల ద్వారా గత ప్రభుత్వం కొన్ని పనులు ప్రతిపాదించింది అయితే అందులో కొన్ని పట్టాలెక్కగా…కొన్ని పనులు ప్రారంభం కాలేదు. ఇప్పటికే మొదలైన పనులను పూర్తి చెయ్యాలని సీఎం సూచించారు. ఇదే సందర్భంలో ప్రారంభం కాని పనులను నిలిపివేసి మరోసారి వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. సిజిఎఫ్‌ కింద 243 పనులు ప్రారంభం కాలేదు. అలాగే టిటిడి శ్రీవాణి ట్రస్ట్‌ కింద వివిధ ప్రాంతాల్లో తలపెట్టిన 1797 దేవాలయాల పనులు ప్రారంభం కాలేదు. వీటిని నిలిపివేయాలని సిఎం ఆదేశించారు. శ్రీవాణి ట్రస్ట్‌ కింద చేపట్టే దేవాలయాలు, ఇతర నిర్మాణాలపై చర్చించి…అవసరం అయితే వాటికి కేటాయించే నిధులు పెంచి పనులు ప్రారంభిద్దాం అని ముఖ్యమంత్రి సూచించారు. గతంలో పల్లెల్లో, వాడల్లో శ్రీవాణి ట్రస్ట్‌ ద్వారా ఆలయ నిర్మాణానికి రూ. 10 లక్షలు ఇచ్చేవారు. వీటితో ఆలయాల నిర్మాణాలు సాధ్యం కావడం లేదని అధికారులు వివరించారు. దీంతో ఈ మొత్తాన్ని పెంచడానికి, రెట్టింపు చేసి ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సిఎం సూచించారు. ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో దేవాలయం ఉండేలా చూడాలన్నారు. అదే సమయంలో శ్రీవారి నిధులు ఖర్చుకు జవాబుదారీగా కూడా ఉండాలని సిఎం అన్నారు.

Previous Post

వైసీపీ ఎమ్మెల్సీ సోదరుడు, అనుచరుల నిర్వాకం

Next Post

ఉత్తమ ఇంధన సామర్థ్య రాష్ట్రంగా ఏపీ

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-05-2026

కార్యకర్త
@ May 2, 2026
చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026

కార్యకర్త
@ May 1, 2026
నడకలేదు, పరుగులే!
ఆంధ్రప్రదేశ్

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ
ఆంధ్రప్రదేశ్

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం
ఆంధ్రప్రదేశ్

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు
ఆంధ్రప్రదేశ్

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ దుష్టప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టండి

చైతన్యరధం
@ May 1, 2026
ఢిల్లీలో కొత్త ఏపీ భవన్
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో కొత్త ఏపీ భవన్

చైతన్యరధం
@ May 1, 2026
Load More

ముఖ్య వార్తలు

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నడకలేదు, పరుగులే!

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist