- అధికారం కోసం సంతకాల సేకరణ చేసిన దుర్మార్గుడు జగన్‌రెడ్డి
- రాష్ట్రంలో ఎక్కడ శవం కనిపించినా గద్దల్లా వాలి శవరాజకీయాలు
- ఆనాడు ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఎందుకు నోరు మెదపలేదు?
- పాయకరావుపేట ఘటనపై సీఎం రంగంలోకి దిగితే విమర్శలా?
- ఇప్పుడు కొత్త అవతారంతో రాబందుల పార్టీగా మారింది
- టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ధ్వజం
విజయవాడ(చైతన్యరథం): రాష్ట్రంలో ఎక్కడ శవం కనిపించినా సరే అక్కడ గద్దల్లా వాలిపోయి శవ రాజకీయాలకు తెరతీస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. వైఎస్సార్ శవం సాక్షిగా పుట్టిన పార్టీ వైసీపీ అని, అధికారం కోసం తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాల సేకరణ చేసిన దుర్మార్గుడు జగన్‌రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు శవ రాజకీయం చేసిన పార్టీ కొత్త అవతారం ఎత్తి రాబందుల పార్టీగా మారిందన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఛీకొట్టినా సిగ్గు లేకుండా టీడీపీ, చంద్రబాబు మీద బురద జల్లుతున్నారని మండిపడ్డారు. పాయకరావుపేటలో ఫుడ్ పాయిజన్‌తో విద్యా ర్థులు చనిపోతే దానిపై కూడా జగన్‌రెడ్డి అండ్ కో శవ రాజకీయాలకు తెరతీశారన్నారు.
అనాధ శరణాలయంలో జరిగిన ఘటన ప్రభుత్వం దృష్టికి రాగానే ముఖ్యమంత్రి వెంటనే స్పందించి విచారణకు ఆదేశించి బాధితులకు ఎక్స్‌గ్రేషియా కింద రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందించారని తెలిపారు. అంతేగాకుండా రాష్ట్రవ్యాప్తంగా అనాధ శరణాలయాల్లో కూడా తనిఖీలు చేపట్టి అవసరమైతే ప్రభుత్వ పరిధిలోకి తీసుకునేలా ప్రణాళికలు చేపడు తున్నారని చెప్పారు. బాధితుల కోసం స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే రంగంలోకి దిగితే దీనిపై కూడా వైసీపీ శవ రాజకీయాలు చేయడం ప్రారంభించిందని ధ్వజమెత్తారు.
ఆనాడు ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఎందుకు నోరు మెదపలేదు?
జగన్‌రెడ్డి ప్రభుత్వం హయాంలో ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల చక్రాయపేట ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులు వాంతులు, కడుపునొప్పితో బాధపడు తుంటే తమాషా చూసిన జగన్‌రెడ్డికి కనీసం మాట్లాడే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి హయాంలో పశ్చిమగోదావరి జిల్లాలో పాల కోడేరులో 21 మంది ఫుడ్ పాయి జన్‌కు గురైతే ఒక్కరిని కూడా పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. 160 మంది విద్యార్థులకు సరైన చికిత్స లేక కలుషిత ఆహారంతో విలవిలలాడిపోయారన్నారు. పార్వతీపు రం మన్యం జిల్లాలో 35 మంది జగనన్న గోరు ముద్ద తిని అస్వస్థతకు గురైతే కనీసం దానిని పట్టించు కోలేదని, కనీసం విచారణకు ఆదేశించింది కూడా లేదని తెలిపారు.
పోలవరంలో కలుషిత ఆహారం తిని 36 మంది మంచం పడితే విచారణకు దిక్కు లేదని, ఒక్క అధికారిని సస్పెండ్ చేసింది లేదని, ఇలాంటివి జగన్ రెడ్డి హయాంలోనే ఎన్నో జరి గాయన్నారు. పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు సరైన చికిత్స అందక విలవిలలాడిపోతే అవేమీ ఆనాడు జగన్‌రెడ్డికి కనిపించలేదా? అని ప్రశ్నించారు. ప్రభు త్వానికి సంబంధం లేదని వాటిని కూడా ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారని, రాయలసీమ బిడ్డ ను అని చెప్పుకుంటూ రాయలసీమలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో పుడ్ పాయిజన్ ఘట నలు జరిగితే ఎందుకు నోరు మెదపలేదు? అని ప్రశ్నించారు. ఇన్ని జరిగినా జగన్‌రెడ్డి నోరు మెదపలేదు కాబట్టే ప్రజలు ఆయనను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారని వ్యాఖ్యా నించారు.