- వైసీపీకి మంత్రి లోకేష్ హెచ్చరిక
- టీడీపీ నేత శ్రీనివాసులు హత్యకు ఖండన
అమరావతి(చైతన్యరథం): టీడీపీ శ్రేణుల సహనాన్ని చేతకాని తనంగా భావించవద్దని వైసీపీ మూకలను రాష్ట్ర విద్య,ఐటీ,ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ నేత వాకిటి శ్రీనివాసులును వైసీపీ మూకలు దారుణంగా హత్య చేయడాన్ని మంత్రి లోకేష్ తీవ్రంగా ఖండిరచారు. ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్ళల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారన్నారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంథా మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారని లోకేష్ మండిపడ్డారు. తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావిస్తూ, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రజా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. వైసీపీ మూకల చేతిలో బలైన శ్రీనివాసులు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని లోకేష్ భరోసా ఇచ్చారు.