- ఫేక్ రాజకీయం పండటం లేదని ఫ్రస్టేషన్‌లో ఉన్నారా?
- ఇంకా సీఎంననే భ్రమలో ఉంటే ఎలా ఎమ్మెల్యే గారూ?
- ప్రజా ప్రభుత్వం అరాచకపు లెక్కలన్నీ సరిచేస్తుంది
- వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి(చైతన్యరథం): ప్రతిపక్ష హోదా కూడా రాని స్థాయి ఓటమిని ప్రజలు కట్టబెట్టినా జగన్మోహన్‌రెడ్డికి సిగ్గు రావడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. నైతిక విలువలు, విశ్వసనీయత అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు..ఇంకా మీరే ముఖ్యమంత్రిననే భ్రమల్లో ఉంటే ఎలా పులివెందుల ఎమ్మెల్యే గారూ? భ్రమలు వీడి వాస్తవంలోకి రండి.. ప్రజా ప్రభుత్వ పాలన ఎలా ఉందో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని పోటీ పెట్టకూడదనడానికి మీరెవరు? మీకు ఆ అధికారం ఎవరిచ్చారు? గతంలో రాజభవన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినప్పుడు, 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు..నేను తలుచుకుంటే టీడీపీ ప్రభుత్వం కూలిపోతుందని ప్రకటనలు చేసినప్పుడు విలువలు గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. విలువల గురించి మాట్లాడే ముందు గడిచిన ఐదేళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేసిన విధానం, అక్రమాస్తుల కేసులో సీబీఐ వేసిన 11 చార్జ్‌షీట్ల గురించి ప్రజలకు చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు. మీ శవ రాజకీయాలకు, వికృత రాజకీయ క్రీడలకు, విష సంస్కృతికి కాలం చెల్లింది.. మేం తలుచు కుంటే వైసీపీ ఖాళీ అయిపోతుందని వ్యాఖ్యానించారు.