- జనమే అంతం చేశాక.. ఇంకెవరేం చేస్తారు?
- జగన్ సెక్యూరిటీ అంశంపై నూకసాని సెటైర్
- శవరాజకీయాల పేటెంట్ అతనిదేనంటూ ఎద్దేవా
- జగన్ నాటకాలకు జనం నవ్వుతున్నారని వ్యాఖ్య
- వైసీపీ ఫేక్ ప్రచారాలు ఆపాలంటూ హితవు
అమరావతి (చైతన్య రథం): జగన్‌రెడ్డిని జనమే అంతం చేశారు. మళ్లీ జగన్‌రెడ్డిని ఇంకొకరు అంతం చేయాల్సిన అవసరమేముంది? అని టీడీపీ ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్షులు నూకసాని బాలాజీ ఎద్దేవా చేశారు. కావాలని తప్పుడు ప్రచారాలతో జనాలను మభ్యపెట్టి ప్రభుత్వంపై బురద చల్లడానికి జగన్‌రెడ్డి యత్నిస్తున్నాడని నూకసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశలో నూకసాని బాలాజీ మాట్లాడుతూ.. అబద్దపు ఆలోచనలతో రాష్ట్ర ప్రజలను మోసం చేయాలనుకుంటే ఇప్పుడొచ్చిన 11 సీట్లు కూడా ప్రజలే తీసేసి.. తరమికొడతారన్నారు. కూటమి ప్రభుత్వంపై జగన్‌రెడ్డి ఆరోపణలు చేయడం ఆకాశంపై ఉమ్మివేయడమేనన్నారు.
ఆయన మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘జగన్ అసత్యాలను నమ్ముకోవడంతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా జనం తరిమికొట్టారు. వైనాట్ 175 అన్న జగన్‌రెడ్డి ఆశలు అడియాశలయ్యాయి. భద్రతపై పిచ్చిపిచ్చిగా మాట్లాడటానికి కారణమదే. మాజీ ముఖ్యమంత్రికి ఎంతమంది భద్రత ఇస్తారో ప్రభుత్వం అంత భద్రత కల్పిస్తోంది. నాడు ఉత్తర కొరియా అధ్యక్షుడిలా 986మంది సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుని అది మళ్లీ ఇప్పుడు కోరుకోవడం జగన్ మూర్ఖత్వానికి పరాకాష్ట’ అన్ని దుమ్మెత్తిపోశారు. రాష్ట్రంలో హత్యలు చేసింది వైసీపీ నేతలే. హత్యా రాజకీయాలను రాష్ట్రంలోకి తీసుకొచ్చిందే జగన్‌రెడ్డి, ఆయన తండ్రే. టీడీపీకి ఆ సంస్కృతిలేదు. టీడీపీ నేత చంద్రబాబుకు అభివృద్ధి ప్రజా సంక్షేమమే ముఖ్యం. వైసీపీ పాలనలో 2000 మంది టీడీపీ కార్యకర్తలను పొట్టన పెట్టున్నారు.
చివరకు వైసీపీ ఎంపీని కూడా కొట్టించారని నూకసాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐదేళ్లలో ధ్వంసమైన పాలనను రెండు నెలల్లో గాడిన పెట్టి ప్రజాపాలన సాగిస్తుంటే.. జగన్ జీర్ణించుకోలేకపోతున్నాడని బాలాజీ వ్యాఖ్యానించారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా బుద్ధిరాని జగన్ `కూటమిపై ఏదోకరకంగా బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నాడన్నారు. సునీత, షర్మిలలే వైసీపీ పాలనలో రక్షణలేదని వాపోయారని, వివేకా హత్యకేసులో గొడ్డలివేటుపై జగన్ డ్రామాలు ప్రజలకు తెలీంది కాదని, తాను ఏంచెప్పినా జనం వింటారని జగన్‌రెడ్డి భ్రమించడం మూర్ఖత్వమేనని అన్నారు.
గంజాయికి హబ్‌గా మార్చిన రాష్ట్రాన్ని ఎలా బాగుచేయాలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఐదేళ్ల వైసీసీ నేతలు చేసిన అరాచకాలను జనం తరమి కొట్టినా బుద్ధి రాకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. దేశంలోనే వినూత్నమైన ఆలోచనతో రూపాయి ఖర్చు లేకుండా అద్భుతమైన రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుడితే.. దాన్ని నాశనం చేసిన దుర్మార్గుడు జగన్‌రెడ్డి అన్నారు. ప్రజా వేదికను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే కూల్చి అభివృద్ధిపట్ల తన దృక్పథాన్ని వ్యక్తం చేసిన జగన్‌ను.. రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ క్షమించరన్నారు.
చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడానికి నేడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఐదేళ్లలో ఒక్కరోజు కూడా జగన్‌రెడ్డి ప్రెస్ మీట్ పెట్టలేదు.
బయటికొస్తే చెట్లు నరికించడం, పరదాలు కట్టుకోవడం తప్ప ఏముందని నిలదీశారు. నేడు ప్రజలకోసం చంద్రబాబు, కూటమి నేతలు పనిచేస్తున్నారు. నేడు 24 మంత్రుల్లో 8 సీట్లు బీసీలకు కేటాయించిన గొప్ప నాయకుడు చంద్రబాబు. కూటమి ప్రభుత్వంపై జగన్‌రెడ్డి ఆరోపణలు చేయడం ఆకాశంపై ఉమ్మివేయడమే. ఐదేళ్ల అరాచక పాలన చూడలేక వైసీపీకి ప్రజలే బుద్ధి చెప్పారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా వందల మందిని సెక్యూటీ అడగటం సిగ్గుచేటు. ప్రధాన మంత్రికి కూడా లేని సెక్యూరిటీని పెట్టుకుని 986మంది భద్రతతో… రూ.296 కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశాడన్నారు.
డాక్టర్ సుధాకర్ తో పాటు… అనేకమంది దళితులను, బీసీలను వైసీపీ మూకలు చంపాయన్నారు. హత్యా రాజకీయాలు వైసీపీ వెన్నతోపెట్టిన విద్యగా అభివర్ణించారు. వ్యక్తిగత హత్యలు, ఘర్షణలకు టీడీపీకాని, నేతలుగాని సిద్ధంగా లేరు. వైసీపీ నేతలు కావాలనే ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయడానికి కుట్ర చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రకటనలతో రాష్ట్రాన్ని భష్టు పట్టించాలని చూస్తున్నారు. నేడు ఉచిత ఇసుకతోపాటు ప్రజలకు జరుగుతున్న మేలును చూసి ఓర్వలేక వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. హత్యారాజకీయాలకు పేటెంట్ జగన్‌రెడ్డిదే. అబద్దపు ఆలోచనలతో రాష్ట్ర ప్రజలను మోసం చేయాలనుకుంటే ఈసారి వచ్చిన 11 సీట్లు కూడా లేకుండా ప్రజలు తరమికొడతారు. కూటమి ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలితే వైసీపీపైనే ప్రజలు ఉమ్మేస్తారు.