- రవాణా, యువజన, క్రీడల మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
- చిత్తూరు డిపోలో 17 నూతన ఆర్టీసీ బస్సుల ప్రారంభం
చిత్తూరు(చైతన్యరథం): త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై శుభవార్త చెబుతామని రవాణా, యువజన, క్రీడల మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. చిత్తూరు ఆర్టీసీ డిపోలో శనివారం 17 నూతన బస్సులను జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్, చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్‌మోహన్, కె.మురళీమోహన్, నగర మేయర్ అముదతో కలిసి మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. జేసీ పి.శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ రాజేష్‌కుమార్‌రెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎం జితేంద్రనాథ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఐదేళ్లలో ఆర్టీసీ నిర్వీర్యమైందని, చంద్రబాబు సీఎం అయ్యాక సుమారు 1400 బస్సులు ఆర్టీసీ పరిధిలోకి వచ్చాయని, సుమారు 400 బస్సులు రోడ్ల మీదకు వచ్చాయన్నారు.
ఐదేళ్లలో నిర్వీర్యమైన సంస్థను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చర్యలు చేపడుతున్నారన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణంపై అతి త్వరలోనే ఒక శుభవార్త చెబుతామని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో ఎక్కువగా విద్యుత్‌తో నడిచే బస్సులను తీసుకురావడం జరుగుతుందని చెప్పా రు. సీఎంగా చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో పండుగ వాతావర ణం నెలకొందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మేయర్ దొరబాబు, సి.కె.బాబు, కఠారి హేమలత, ఆర్టీసీ డీఎం రూపశ్రీ, నాయకులు చల్లా బాబు, సి.ఆర్.రాజన్, వసంత్‌కుమార్, కాజూరు రవి, హేమాద్రినాయుడు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.