అమరావతి(చైతన్యరథం): తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు రావాలంటే జీవో 29 కింద ఇవే మార్గదర్శకాలని పేర్కొంటూ కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో వస్తు న్న తప్పుడు కథనాలు, ప్రచారాన్ని నమ్మవద్దని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఒక ప్రకటన లో తెలిపారు. మార్గదర్శకాలను ఇంకా ఖరారు చేయలేదని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వా లు వివిధ పథకాలకు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఆధార్‌ను వినియో గించదలిస్తే యూఐడీఏఐ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధార్ నిబంధనలకు అనుగుణంగానే లబ్ధిదారులను గుర్తించేందుకు ఆధార్ వినియోగానికి విద్యాశాఖ జీవో 29 విడుదల చేసినట్లు చెప్పారు. అయితే ఈ జీవో తల్లికి వందనం పథకం మార్గదర్శకాలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని..అవాస్తవాలను నమ్మవద్దని సూచించా రు. పథకం మార్గదర్శకాలు విధివిధానాలు రూపొందించిన తర్వాత విడుదల చేస్తామని వివరణ ఇచ్చారు.














