పామర్రు (చైతన్యరథం): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తూ రెండవ సంతకం పెట్టిన సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ… కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో శుక్రవారం ఉదయం రాష్ట్ర టీడీపీ నేత, సాగునీటీ వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు, రైతులు గ్రామంలో గత ప్రభుత్వంలో వేసిన జగనన్న భూహక్కు సర్వే రాళ్లను పెకలించివేసి, నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పామ్ ఆయిల్ గింజలతో అభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం జగనన్న భూ హక్కు చట్టం కింద ఇచ్చిన పాసు పుస్తకాల ప్రతులను దహ నం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కసుకుర్తి రంగమణి అధ్యక్షతన జరిగిన రైతుల సమావేశంలో ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ…
గత ప్రభుత్వ హయాములో జగన్మోహన్‌రెడ్డి పిచ్చిచేష్టలకు పరాకాష్టగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను తీసుకొచ్చారని, కేంద్ర ప్రభుత్వం సూచించిన 17 మార్గదర్శక సూత్రాలలో ఒకటి కూడా అమలు చేయ కుండా… రైతులను భాగస్వామ్యం చేయకుండా మోసం చేయాలని చూశా రని అన్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాలలో 90 లక్షల మంది పట్టాదారులు 22.06 కోట్ల వ్యవసాయ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఎత్తివేసి,ఈ పథకంలో టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్( టి.ఆర్.ఓ) వ్యవస్థను తీసుకుని వచ్చి వైసీపీ అనుకూల అధికారులకు అప్రమిత అధికారాలను ఇచ్చి రైతుల భూములను తాకట్టు పెట్టి, రిజిస్ట్రేషన్ సమయంలో ఒరిజినల్ డాక్యుమెంట్లను ప్రభుత్వం వద్దనే ఉంచి, వాటి నకలను రైతులకు ఇచ్చి రైతుల భూములను తాకట్టు పెట్టి కాజేయడానికి ప్రయత్నం చేశారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో రైతులందరూ సమైక్యం గా ఉండి జగన్మోహన్ రెడ్డి విధ్వంసక పాలనకు తెరదించి, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకుని వచ్చారని, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంలో గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్‌రెడ్డి బొమ్మతో ఇచ్చిన పాసు పుస్తకాలు అన్ని రద్దుచేసి, సమగ్ర రీ సర్వే చేసి 2014-19 మధ్యలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో అమలు చేసిన ఫెయిర్ అడంగల్ 1బి ని పునరుద్ధరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగోతో మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి విజ్ఞప్తి చేశారు.