చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ముఖ్య వార్తలు

ఏపీ కొత్త మంత్రులు వివరాలు

చదువులో ఆ మంత్రే టాప్

by చైతన్యరధం
Jun 13, 2024 at 6:58am
in ముఖ్య వార్తలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

గన్నవరం: రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు పవన్‌ కళ్యాణ్‌, లోకేష్‌, అచ్చెన్నాయుడు సహా మరో 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో టీడీపీ నుంచి 20 మంది ఉండగా.. జనసేన నుంచి ముగ్గురు, భాజపా నుంచి ఒకరు చొప్పున ఉన్నారు. సగానికిపైగా కొత్తవారికే అవకాశం దక్కింది. ముగ్గురు మహిళలకు చోటు కల్పించారు. కొత్త మంత్రుల వివరాలివే..

1. కొణిదెల పవన్‌ కల్యాణ్‌ (జనసేన)
నియోజకవర్గం: పిఠాపురం (కాకినాడ జిల్లా)
వయసు: 56 ఏళ్లు
విద్యార్హత: ఇంటర్మీడియట్‌
రాజకీయ అనుభవం: సినీ నటుడిగా 1996లో తెరంగేట్రం చేసిన పవన్‌ కల్యాణ్‌ పవర్‌ స్టార్‌ ఇమేజ్‌తో భారీ సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్నారు. 2008లో రాజకీయాల్లోకి వచ్చారు. సోదరుడు మెగాస్టార్‌ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువ విభాగం అధ్యక్షుడిగా వ్యవహరించారు. కామన్మెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (సీఎంపీఎఫ్‌) ట్రస్ట్‌ ద్వారా సేవలందించారు. కాంగ్రెస్‌ లో ప్రజారాజ్యం పార్టీ విలీనం కావటంతో బయటకు వచ్చి.. 2014లో జనసేన పార్టీని స్థాపించారు. అప్పటి ఎన్నికల్లో పోటికి దూరంగా ఉండి.. భాజపా, తెదేపాకు మద్దతు పలికి కూటమి అధికారంలోకి రావడంలో కీలకంగా వ్యవహరించారు. 2019లో బీఎస్పీ, వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో భీమవరం, గాజువాకలో పోటీ చేసి రెండుచోట్లా ఓటమి పాలైనా వెనకడుగు వేయకుండా ధైర్యంగా నిలబడి పోరాడారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఏకైక అజెండాతో కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో రాజమహేంద్రవరం జైలులో ఆయన్ను కలుసుకొని బయటకు వచ్చిన పవన్‌.. క్లిష్టపరిస్థితుల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. 2024 ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో భాగంగా పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్‌ స్థానాలన్నింటిలోనూ జనసేనకు రికార్డు విజయాన్ని అందించారు.

సంబంధితవార్తలు

No Content Available

2. నారా లోకేష్‌ (తెదేపా)
నియోజకవర్గం: మంగళగిరి (గుంటూరు జిల్లా)
వయసు: 41 ఏళ్లు
విద్యార్హత: స్టాన్ఫోర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ
రాజకీయ అనుభవం: తండ్రి నారా చంద్రబాబు అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన లోకేష్‌ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికై.. చంద్రబాబు మంత్రివర్గంలో ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. ఏపీలో ఐటీ కంపెనీల స్థాపనకు కృషి చేశారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 2023 జనవరిలో యువగళం పాదయాత్ర చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 3వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర నిర్వహించి ప్రజల కష్టాలు విన్నారు. పార్టీ బలోపేతానికి పని చేశారు. తాజా ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి 91వేలకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు.

3. కింజరాపు అచ్చెన్నాయుడు (తెదేపా)
నియోజకవర్గం: టెక్కలి (శ్రీకాకుళం జిల్లా)
వయసు: 54 ఏళ్లు
విద్యార్హత: డిగ్రీ (బీఎస్సీ)
రాజకీయ అనుభవం: 1995లో హరిశ్చంద్రాపురం ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైన అచ్చెన్నాయుడు 1999, 2004 ఎన్నికల్లోనూ గెలుపొందారు. 2009 నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ఏర్పడిన టెక్కలి నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో అదే సీటు నుంచి గెలుపొంది ఐదేళ్లపాటు మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో గెలిచినప్పటికీ పార్టీ అధికారం కోల్పోవడంతో శాసనసభాపక్ష ఉపనేతగా వ్యవహరించారు. 2021లో పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యారు. తాజా ఎన్నికల్లో 34వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు.

4. కొల్లు రవీంద్ర (తెదేపా)
నియోజకవర్గం: మచిలీపట్నం (కృష్ణా జిల్లా)
వయసు: 51 ఏళ్లు
విద్యార్హత: బీఏ, ఎల్‌ఎల్బీ
రాజకీయ అనుభవం: ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన దివంగత నేత ఎన్‌. నరసింహారావు అల్లుడైన రవీంద్ర ఆయన వారసునిగా 2005లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. తెదేపా డివిజన్‌ అధ్యక్షుడిగా, 2007లో తెలుగుయువత జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2015 నుంచి కొల్లు ఫౌండేషన్‌ ద్వారా సేవాకార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, పార్టీ బీసీ సాధికార రాష్ట్ర కన్వీనర్‌గా, బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2014లో చంద్రబాబు హయాంలో ఎక్సైజ్‌, చేనేత, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైనా.. తాజాగా మచిలీపట్నం నుంచి భారీ మెజార్టీతో గెలిచారు.

5. నాదెండ్ల మనోహర్‌ (జనసేన)
నియోజకవర్గం: తెనాలి (గుంటూరు జిల్లా)
వయసు: 60 ఏళ్లు
విద్యార్హత: ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ
రాజకీయ అనుభవం: 2004లో తెనాలి నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున శాసనసభకు ఎన్నికయ్యారు. 2009లో రెండోసారి విజయం సాధించి ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. 2011లో శాసనసభ స్పీకర్‌గా ఎన్నికై 2014 వరకు ఆ పదవిలో కొనసాగారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన మనోహర్‌ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2018లో జనసేనలో చేరారు. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2024లో జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగి 50 వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా మొదటిసారి అవకాశం దక్కించుకున్నారు.

6. డాక్టర్‌ పొంగూరు నారాయణ (తెదేపా)
నియోజకవర్గం: నెల్లూరు నగరం (నెల్లూరు జిల్లా)
వయసు: 68 ఏళ్లు
విద్యార్హత: ఎమ్మెస్సీ, పీహెచీ, 1977లో స్టాటిస్టిక్స్‌లో బంగారు పతకం సాధించారు.
రాజకీయ అనుభవం: ఆసియాలోనే అతి పెద్ద విద్యాసంస్థను ఏర్పాటుచేసిన విద్యావేత్త నారాయణ.. నెల్లూరులోని వీఆర్‌ కాలేజీలో పార్ట్‌ టైం లెక్చరర్‌గా పనిచేశారు. 1979లో ఓ చిన్న అద్దె గదిలో నారాయణ ట్యూషన్‌ సెంటర్‌ను మొదలుపెట్టారు. అదే నేడు నారాయణ విద్యాసంస్థలుగా 14 రాష్ట్రాల్లో 4 లక్షల మందికి పైగా విద్యార్థులకు విద్యను అందిస్తోంది. 1998లో చంద్రబాబుతో పరిచయం డాక్టర్‌ నారాయణను రాజకీయాల వైపు తిప్పింది. తొలుత టీడీపీ సర్వే విభాగానికి పనిచేసి.. క్రమంగా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో చంద్రబాబు హయాంలో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, పట్టణాభివృద్ధి, అర్బన్‌ హౌసింగ్‌ శాఖల మంత్రిగా చేశారు. నెల్లూరు నారాయణ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో రోజుకు దాదాపు 13 వందల మంది నిరుపేద రోగులకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు.

7. అనిత వంగలపూడి (తెదేపా)
నియోజకవర్గం: పాయకరావుపేట (అనకాపల్లి జిల్లా)
వయసు: 45 ఏళ్లు
విద్యార్హత: ఆంధ్రా యూనివర్సిటీ నుంచి మాస్టర్స్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ లిటరేచర్‌, అంబేద్కర్‌ యూనివర్సిటీ నుంచి మాస్టర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌
రాజకీయ అనుభవం: ఉమ్మడి విశాఖ జిల్లా రాజవరంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూనే అనిత రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 2014 ఎన్నికల్లో తొలిసారి పాయకరావుపేట నుంచి పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో కొవ్వూరు నుంచి ఓటమిపాలైన తర్వాత ఏపీ తెదేపా మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేశారు. ప్రస్తుతం తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యురాలిగా ఉన్నారు. తాజా ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి మరోసారి గెలుపొంది.. ఇప్పుడు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.

8. నిమ్మల రామానాయుడు (తెదేపా)
నియోజకవర్గం: పాలకొల్లు (పశ్చిమ గోదావరి జిల్లా)
వయసు: 55 ఏళ్లు
విద్యార్హత: ఎంఏ, ఎంఫిల్‌, పీహెచ్‌ఎ
రాజకీయ అనుభవం: జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న రామానాయుడు.. పాలకొల్లును తెదేపాకు కంచుకోటగా మార్చారు. తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో రాష్ట్రంలో వైకాపాకు అత్యధిక స్థానాలు దక్కినప్పటికీ నిమ్మల 17వేల మెజార్టీతో విజయం సాధించారు. తాజా ఎన్నికల్లోనూ నియోజకవర్గంలో 70 శాతం మంది ఓటింగ్‌ సాధించి.. జిల్లాలోనే అత్యధిక ప్రజాదరణ ఉన్న నేతగా గుర్తింపు పొందారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రామానాయుడు కొంతకాలం నరసాపురం వైఎన్‌ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు.

9. పయ్యావుల కేశవ్‌ (తెదేపా)
నియోజకవర్గం: ఉరవకొండ (అనంతపురం)
వయసు: 59
విద్యార్హత: ఎంబీఏ
రాజకీయ అనుభవం: పయ్యావుల కేశవ్‌ దాదాపు 30 ఏళ్ల కిందట రాజకీయ అరంగేట్రం చేశారు. 1994లో ఎన్టీఆర్‌ పిలుపుతో ఉరవకొండ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి, తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1994, 2004, 2009, 2019లో ఎమ్మెల్యేగా పని చేశారు. 2015 నుంచి 2019 వరకు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా పని చేశారు. ఇప్పుడు ఐదోసారి తెదేపా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఫ్యాన్‌ గాలిని తట్టుకొని ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయనకు తెదేపా అధినేత ప్రజాపద్దుల కమిటీ చైర్మన్‌ గా అవకాశం కల్పించారు. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్నా, ఇప్పటివరకూ మంత్రిగా అవకాశం రాలేదు. ఎట్టకేలకు మొదటిసారిగా మంత్రి బాధ్యతలు చేపట్టబోతున్నారు.

10. గుమ్మిడి సంధ్యారాణి (తెదేపా)
నియోజకవర్గం: సాలూరు (పార్వతీపురం మన్యం జిల్లా)
వయసు: 51
విద్యార్హత: బీఎస్సీ
రాజకీయ అనుభవం: రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన సంధ్యారాణి.. తొలుత ఉపాధ్యాయురాలిగా పని చేశారు. తండ్రి జన్ని ముత్యాలు స్ఫూర్తితో పాతికేళ్లకే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1999లో కాంగ్రెస్‌ తరఫున సాలూరు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల తర్వాత హస్తాన్ని వీడి తెదేపాలో చేరారు. 2009 అసెంబ్లీ, 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓటమి తప్పలేదు. 2015లో తెదేపా నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు. 2020లో తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈసారి సాలూరు నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొరపై భారీ విజయం సాధించారు.

11. అనగాని సత్యప్రసాద్‌ (తెదేపా)
నియోజకవర్గం: రేపల్లె (బాపట్ల జిల్లా)
వయసు: 52
విద్యార్హత: డిగ్రీ
రాజకీయ అనుభవం: 2009లో తెదేపాలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ ఎన్నికల్లో రేపల్లె నుంచి పోటీ చేసి మోపిదేవి వెంకట రమణ చేతిలో ఓడిపోయారు. 2014, 2019లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి మోపిదేవిని ఓడిరచారు. తాజా ఎన్నికల్లో వరుసగా మూడోసారి గెలిచి.. ఇప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం పొందారు.

12. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి (తెదేపా)
నియోజకవర్గం: కొండపి (ప్రకాశం జిల్లా)
వయసు: 54
విద్యార్హత: ఎంబీబీఎస్‌
రాజకీయ అనుభవం: కొండపి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యునిగా పనిచేసిన వీరాంజనేయస్వామి.. దామచర్ల ఆంజనేయులు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో తొలిసారి కొండపి స్థానం నుంచి విజయం సాధించారు. అదే నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు గెలిచారు. 2014-19 మధ్య టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా పనిచేశారు. 2019-24 వరకు తెలుగుదేశం శాసన సభాపక్షానికి విప్‌గా వ్యవహరించారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శిగానూ పనిచేశారు.

13. గొట్టిపాటి రవికుమార్‌ (తెదేపా)
నియోజకవర్గం: అద్దంకి (బాపట్ల జిల్లా)
వయసు: 48
విద్యార్హత: ఇంజినీరింగ్‌
రాజకీయ అనుభవం: గ్రానైట్‌ వ్యాపారి అయిన గొట్టిపాటి 2004లో ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో మార్టూరు రద్దవ్వడంతో అద్దంకికి మారి అక్కడి నుంచి విజయం సాధించారు. 2014లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2016లో తెదేపాలో చేరి 2019, 2024 ఎన్నికల్లో గెలిచారు. వైకాపా హయాంలో తీవ్రంగా ఇబ్బంది పడిన వారిలో గొట్టిపాటి రవి ఒకరు. ఆయన వ్యాపారాల్ని గత ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసింది. ఇప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కడంతో తొలిసారి మంత్రి అవుతున్నారు.

14. పేరు: కందుల దుర్గేష్‌ (జనసేన)
నియోజకవర్గం: నిడదవోలు (తూర్పుగోదావరి జిల్లా)
వయసు: 50
విద్యార్హత: పోస్టుగ్రాడ్యుయేట్‌
రాజకీయ అనుభవం: కాంగ్రెస్‌ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన దుర్గేష్‌.. వివిధ హోదాల్లో పనిచేసి ఎమ్మెల్సీ అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో రాజమహేంద్రవరం లోక్‌సభ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగి ఓటమి పాలయ్యారు. 2018 ఆగస్టు 30న జనసేనలో చేరిన దుర్గేశ్‌.. 2019 శాససనసభ ఎన్నికల్లో రాజమహేంద్రవరం గ్రామీణం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. తాజా ఎన్నికల్లో నిడదవోలు నుంచి నెగ్గి మంత్రి వర్గంలో స్థానం సంపాదించుకున్నారు.

15. పేరు: బీసీ జనార్దనరెడ్డి (తెదేపా)
నియోజకవర్గం: బనగానపల్లి (నంద్యాల జిల్లా)
వయసు: 55
విద్యార్హత: 8వ తరగతి
రాజకీయ అనుభవం: 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో ఓటమిపాలైన ఆయన.. తాజా ఎన్నికల్లో బనగానపల్లి నుంచి 25వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

16. టీజీ భరత్‌ (తెదేపా)
నియోజకవర్గం: కర్నూలు (కర్నూలు జిల్లా)
వయసు: 48
విద్యార్హత: యూకేలో ఎంబీఏ
రాజకీయ అనుభవం: తండ్రి టీజీ వెంకటేశ్‌ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన భరత్‌ 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అయినా నిరాశ చెందక పట్టుదలతో నిరంతరం జనంలో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని ముందుకు సాగారు. తాజా ఎన్నికల్లో గెలిచి తొలిసారి శాసనసభలో అడుగు పెడుతున్నారు.

17. ఎస్‌. సవిత (తెదేపా)
నియోజకవర్గం: పెనుకొండ (శ్రీసత్యసాయి జిల్లా)
వయసు: 47
విద్యార్హత: బీఏ
రాజకీయ అనుభవం: సవిత తండ్రి ఎస్‌ రామచంద్రారెడ్డి అప్పట్లో ఎంపీగా, మంత్రిగా పనిచేశారు. ఆయన వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సవిత తాజా ఎన్నికల్లో తొలిసారి పోటీ చేశారు. వైకాపా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఉషశ్రీచరణ్‌పై 33 వేల మెజార్టీతో విజయం సాధించారు. తండ్రి పేరుతో ఎస్‌ఆర్‌ఆర్‌ ఛారిటబుల్‌ ట్రస్టు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2017-19 వరకు రాష్ట్ర కురుబ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. పెనుకొండ పట్టణంలో కొన్నేళ్లుగా అన్న క్యాంటీన్‌ నిర్వహిస్తూ రూ.5 భోజనం అందిస్తున్నారు. నాలుగేళ్ల నుంచి మైనార్టీలకు రంజాన్‌ తోఫా పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలో కురుబ సామాజికవర్గం నుంచి సవిత ఒక్కరే ఎమ్మెల్యేగా గెలుపొందారు.

18. వాసంశెట్టి సుభాష్‌ (తెదేపా)
నియోజకవర్గం: రామచంద్రపురం (బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా)
వయసు: 42
విద్యార్హత: బీఎస్సీ, ఎల్‌ఎల్బీ
రాజకీయ అనుభవం: శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన సుభాష్‌ తాత సత్తిరాజు.. తండ్రి సత్యం చెరు రెండుదఫాలు చొప్పున అమలాపురం మున్సిపల్‌ కౌన్సిలర్లుగా పనిచేశారు. తల్లి కృష్ణకుమారి ప్రస్తుతం కౌన్సిలర్‌. ఎస్‌ఏఎఫ్‌ స్వచ్చంద సంస్థ సేవా కార్యక్రమాల ద్వారా శెట్టిబలిజ సామాజికవర్గంలో సుభాష్‌ పట్టు సాధించారు. వైకాపా రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. అమలాపురం అల్లర్ల ఘటన తర్వాత వైకాపా నాయకులతో విభేదాలు రావడంతో తెదేపాలో చేరారు. తాజా ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా రామచంద్రపురం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు.

19. కొండపల్లి శ్రీనివాస్‌ (తెదేపా)
నియోజకవర్గం: గజపతినగరం (విజయనగరం జిల్లా)
వయసు: 42
విద్యార్హత: కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ
రాజకీయ అనుభవం: కొండపల్లి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. తాత పైడితల్లినాయుడు మూడుసార్లు బొబ్బిలి పార్లమెంట్‌ సభ్యుడిగా గెలిచారు. తండ్రి కొండలరావు మండల పరిషత్‌ అధ్యక్షుడిగా వ్యవహరించారు. సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌ గా పనిచేసిన శ్రీనివాస్‌ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఆయన తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి.. మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స అప్పల నర్సయ్యపై 24,302 ఓట్ల మెజార్టీతో విజయదుందుభి మోగించారు.

20. ఎన్‌ఎండీ ఫరూక్‌ (తెదేపా)
నియోజకవర్గం: నంద్యాల (నంద్యాల జిల్లా )
వయసు: 74
విద్యార్హత: పీయూసీ
రాజకీయ అనుభవం: 1981లో నంద్యాల మున్సిపల్‌ కౌన్సిలర్‌గా రాజకీయ జీవితం ప్రారంభించారు. 1985లో తొలిసారి నంద్యాల ఎమ్మెల్యేగా గెలుపొంది.. అప్పట్లో చక్కెర పరిశ్రమ మంత్రిగా పనిచేశారు. 1994లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1999లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది, మున్సిపల్‌ శాఖ, విద్యాశాఖ, ఉర్దూ అకాడమీ మంత్రిగా పనిచేశారు. 2017లో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2017-18లో శాసనమండలి చైర్మన్‌ గా బాధ్యతలు నిర్వర్తించారు. 2018-19 మధ్య ఆరోగ్యశాఖ, మైనార్టీ శాఖల మంత్రిగా వ్యవహరించారు.

21. ఆనం రామనారాయణ రెడ్డి (తెదేపా)
నియోజకవర్గం: ఆత్మకూరు (నెల్లూరు జిల్లా)
వయసు: 72
విద్యార్హత: బీకాం, బీఎల్‌
రాజకీయ అనుభవం: 1983లో నెల్లూరు అసెంబ్లీ ఎన్నికల్లో కేవీఎస్‌ రెడ్డిపై తెదేపా అభ్యర్థిగా విజయం సాధించారు. 1984లో రాష్ట్ర క్రీడామండలి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 1985లో రాపూరు అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా తరపున గెలుపొంది ఆర్‌అండ్‌బీ మంత్రిగా పనిచేశారు. 1989 రాపూరు నుంచి ఓడిపోయి.. 1990లో ఏపీ వ్యాయామ ఉపాధ్యాయ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. 1991లో కాంగ్రెస్‌ పార్టీలో చేరి 1999లో, 2004లోనూ రాపూరు నుంచి మళ్లీ వరుసగా గెలుపొందారు. రాష్ట్ర సమాచార, టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి గెలిచి మున్సిపల్‌ మంత్రిగా వ్యవహరించారు.

22. మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి (తెదేపా)
నియోజకవర్గం: రాయచోటి (అన్నమయ్య జిల్లా)
వయసు: 43
విద్యార్హత: బీడీఎస్‌
రాజకీయ అనుభవం: ఈయన తండ్రి దివంగత ఎమ్మెల్యే మండిపల్లి నాగిరెడ్డి రాయచోటి ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు గెలుపొందారు. రాంప్రసాద్‌ రెడ్డి పెద్దనాన్న కుమారుడు మండిపల్లి నారాయణరెడ్డి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. సమైక్యాంధ్ర పార్టీ తరపున రాంప్రసాద్‌ రెడ్డి రాయచోటి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. 2023 డిసెంబర్‌ లో తెదేపాలో చేరారు. ఇటీవలి ఎన్నికల్లో వైకాపాకు గట్టి పట్టున్న రాయచోటిలో 2495 ఓట్ల మెజార్టీతో గడికోట శ్రీకాంత్‌ రెడ్డిని ఓడిరచారు.

23. కొలుసు పార్థసారథి
నియోజకవర్గం: నూజివీడు (ఏలూరు జిల్లా)
వయసు: 59
విద్యార్హత: బీటెక్‌
రాజకీయ అనుభవం: ఈయనది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. తండ్రి కొలుసు పెద్దరెడ్డయ్య మచిలీపట్నం లోక్‌సభ నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2004లో తొలుత వుయ్యూరు నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2009, 2019లో పెనమలూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందే తెదేపాలో చేరి నూజివీడు నుంచి గెలుపొందారు.

24. సత్యకుమార్‌ యాదవ్‌ (భాజపా)
నియోజకవర్గం: ధర్మవరం
వయసు: 53
విద్యార్హత: ఎంఏ (పొలిటికల్‌ సైన్స్‌)
రాజకీయ అనుభవం: విద్యార్థి దశలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. మదనపల్లిలో చదువుకుంటున్న సమయంలో ఏబీవీపీ తరపున కళాశాల ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి వద్ద కొంతకాలం వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. సత్యకుమార్‌ సేవలను గుర్తించిన భాజపా 2018లో జాతీయ కార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర పార్టీ వ్యవహారాల సహ ఇన్‌ఛార్జిగా, అండమాన్‌ నికోబార్‌ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు.

Tags: ఏపీ మంత్రులు
Previous Post

మంత్రిగా లోకేష్‌ ప్రమాణ స్వీకారం

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 13-06-2024

మరిన్ని వార్తలు

ముఖ్య వార్తలు

Play Online Ports with Real Cash: A Comprehensive Overview

admin
@ July 26, 2025
ముఖ్య వార్తలు

admin
@ July 26, 2025
ముఖ్య వార్తలు

PayPal Accepted Online Casinos: A Secure and Practical Alternative for Online Gaming

admin
@ July 25, 2025
ముఖ్య వార్తలు

admin
@ July 25, 2025
వెయ్యి కోట్లతో కొత్త రోడ్లు
ఆంధ్రప్రదేశ్

వెయ్యి కోట్లతో కొత్త రోడ్లు

చైతన్యరధం
@ July 25, 2025
150 బిలియన్‌ డాలర్లు లక్ష్యం!
ఆంధ్రప్రదేశ్

150 బిలియన్‌ డాలర్లు లక్ష్యం!

చైతన్యరధం
@ July 25, 2025
ముఖ్య వార్తలు

Live Roulette Online USA: An Expert Guide

admin
@ July 25, 2025
ముఖ్య వార్తలు

Programas de Asociados de Finanzas con Altos Ingresos

admin
@ July 25, 2025
Load More

ముఖ్య వార్తలు

Play Online Ports with Real Cash: A Comprehensive Overview

admin
@ July 26, 2025

admin
@ July 26, 2025

PayPal Accepted Online Casinos: A Secure and Practical Alternative for Online Gaming

admin
@ July 25, 2025

admin
@ July 25, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దొంగలు, క్రిమినల్స్‌ కంపెనీ వైసీపీ!

చైతన్యరధం
@ July 25, 2025 6:09 AM

జగన్‌ అబద్ధాలకు బ్రేకులేయాలి!

చైతన్యరధం
@ July 12, 2025 6:20 AM

గొంతులు కోసే.. చెట్లు నరికే..గొడ్డలి వేట్లు వేసే లక్షణాలు జగన్‌ ముఠావే

చైతన్యరధం
@ July 8, 2025 6:15 AM

మామిడిపై మొసలి కన్నీరు!?

చైతన్యరధం
@ July 8, 2025 6:05 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఐ యమ్‌ ఏ మార్గదర్శి!

ఐ యమ్‌ ఏ మార్గదర్శి!

చైతన్యరధం
@ July 26, 2025
మూడేళ్లలో అమరావతి పూర్తి చేస్తాం

మూడేళ్లలో అమరావతి పూర్తి చేస్తాం

చైతన్యరధం
@ July 26, 2025
10 వేల మంది విద్యార్థులకు సైకిళ్లు

10 వేల మంది విద్యార్థులకు సైకిళ్లు

చైతన్యరధం
@ July 26, 2025
పీ4 మోడల్‌లో బీసీ హాస్టళ్ల అభివృద్ధి

పీ4 మోడల్‌లో బీసీ హాస్టళ్ల అభివృద్ధి

చైతన్యరధం
@ July 26, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist