- ఐదేళ్లు అధికారంలో ఉన్నా నిస్సారంగా వైసీపీ మేనిఫెస్టో
- మళ్లీ అధికారంలోకి వస్తే అదనంగా ఏమీ చేయలేమన్న ముఖ్యమంత్రి
- పలు కులాలు, వర్గాలు, రంగాల అభివృద్ధికి స్పష్టమైన బాటలు చూపిన కూటమి మేనిఫెస్టో
- పేదల సంక్షేమానికి అండగా ఉంటామన్న స్పష్టమైన హామీ
- నెలవారీ పింఛన్‌లో భారీ పెంపుÑ75 శాతం లబ్దిదారులకు పదేళ్లు ముందుగానే పింఛన్
- నేటి అవసరాలు, రేపటి ఆకాంక్షలను తీర్చే విధంగా కూటమి మేనిఫెస్టో
- సంక్షేమం, అభివృద్ధి పట్ల కూటమి, వైసీపీల భిన్న ధృక్పథాలను వెల్లడిరచిన మేనిఫెస్టోలు
రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్‌కు దాదాపు రెండు వారాలకు ముందు ప్రతిపక్ష కూటమి, అధికార వైసీపీ పార్టీలు తమ తమ ఎన్నికల మేనిఫెస్టోలను ప్రజలముందుంచాయి. ఎన్నికల ప్రచారానికి మిగిలిన 8 రోజుల్లో తమ తమ హామీలను ప్రజల వద్దకు తీసుకుపోవటానికి ఇరుపక్షాలు తీవ్రంగా శ్రమిస్తాయి. వాటిపై విస్తృతంగా చర్చ జరిగి తమకేది ఎక్కువ మేలు చేస్తుందో ప్రజలు నిర్ణయించుకునేలా వివిధ పార్టీలు తమ ప్రచారాన్ని విస్తృతం చేస్తాయి.
ఎన్నికల మేనిఫెస్టోలు సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలతో ముడిపడిన ప్రజల అభ్యున్నతి పట్ల ఆయా పార్టీల ఆలోచనలను, విధానాలను వెల్లడిస్తాయి. తమ అనుభవాల నేపథ్యంలో, తమ ఆశలు, ఆకాంక్షల ప్రాతిపదికన ఓటర్లు వివిధ పార్టీల మేనిఫెస్టోలను పరిశీలించి తమకు ఏది ఉపయోగకరమో తేల్చుకుంటారు. ఈ నేపథ్యంలో కూటమి ఉమ్మడి మేనిఫెస్టో, అధికార వైసీపీ ఎన్నికల ప్రణాళికలను వాటిలోని ప్రధాన అంశాల ఆధారంగా విశ్లేషిద్దాం.
1. సామాజిక భద్రతా పింఛన్లు
కూటమి మేనిఫెస్టో :
ఎ. నెలవారీ పింఛన్‌ను రూ.3 వేల నుంచి రూ.4లకు పెంపుÑ ఏప్రిల్ 24 నుండి చెల్లింపు
బి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్.
వైసీపీ మేనిఫెస్టో :
ఎ. ప్రస్తుత పింఛన్‌ను జనవరి 1, 2028న రూ.250 పెంచుటÑ సంవత్సరం తరువాత మరో రూ.250 పెంపు.
విశ్లేషణ: గత ఐదేళ్లలో పింఛన్లను కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెంచిన వైసీపీ ప్రభుత్వం, దాన్ని కేవలం మరో రూ.250 పెంచటానికి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవ్వా తాతలు మరో మూడున్నరేళ్లు వేచి ఉండాలని స్పష్టం చేసింది. అనునిత్యం ధరలు పెరుగుతున్నా మరో మూడున్నరేళ్లు నెలవారీ పింఛన్ పెంచను అనటం పేదలకు ద్రోహం చేయటం కాదా? వారి బ్రతుకులను మరింత భారం చేయటంకాదా? వైసీపీ మేనిఫెస్టో ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు చెందినవారు పింఛన్ కోసం మరో పదేళ్లు వేచివుండాలి. పేదల ఇక్కట్లు, పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని పింఛన్‌ను నెలకు వెయ్యి రూపాయలు పెంచుతామని కూటమి హామీ ఇస్తే.. అది నా వల్ల కాదని చేతులెత్తేసిన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పేదలపట్ల తనకు చిత్తశుద్ధి లేదని తమ మేనిఫెస్టో ద్వారా మరోసారి వెల్లడిరచుకున్నారు. పింఛన్ల అర్హత వయసును వివిధ వర్గాలకు 50 ఏళ్లకే కుదించి, రాష్ట్రంలో దాదాపు 75 శాతం పింఛనుదారులకు ప్రస్తుతానికంటే పదేళ్లు ముందుగానే పింఛన్ ఇస్తామని కూటమి స్పష్టం చేసింది. ఈ విధంగా పేదలపట్ల విభిన్న వైఖరులను కూటమి, వైసీపీ మేనిఫెస్టోలు వెల్లడిరచాయి.
2.యువత సంక్షేమం
కూటమి మేనిఫెస్టో :
ఎ.రానున్న ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు/ నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి
బి. మెగా డిఎస్సీ, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్
సి. దేశంలోనే మొదటిసారిగా స్కిల్ సెన్సస్ (నైపుణ్యాల స్థాయి సర్వే)
డి. నైపుణ్యాభివృద్ధి ప్రోత్సాహకానికి చర్యలు.
వైఎస్‌ఆర్ మేనిఫెస్టో :
ఎ. స్కిల్ డెవలప్‌మెంట్‌తో పాటు నైపుణ్య శిక్షణ పొందే అమ్మాయిలకు నెలకు రూ.3,000, అబ్బాయిలకు రూ. 2,500 స్టైఫెండ్.
విశ్లేషణ: గత ఐదేళ్ల జగన్ పాలనలో కొత్త పెట్టుబడులు రాకపోగా ఉన్న పరిశ్రమలు రాష్ట్రాన్ని వదలి పారిపోవడంతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కనుమరుగై రాష్ట్ర యువత తీవ్ర నైరాశ్యానికి గురై గంజాయి, మాదకద్రవ్యాల బారిన పడ్డారు. దేశంలోనే అత్యధికంగా నిరుద్యోగ యువత రాష్ట్రంలో 24 శాతం ఉన్నా ముఖ్యమంత్రి ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న స్కిల్‌డెవలప్‌మెంట్ గురించే తమ మేనిఫెస్టోలో ప్రస్తావించారు. చదువుకొని తల్లిదండ్రులకు భారమైన యువతకు కొంతమేరకైనా ఊరట కలిగించటానికి ఎటువంటి ప్రత్యక్ష సహాయం ప్రకటించలేదు. పైగా కూటమి హామీ అయిన నిరుద్యోగ భృతిని హేళన చేస్తూ మాట్లాడారు. యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచటానికి రాష్ట్రస్థాయిలో స్కిల్ సెన్సస్ చేపట్టి దాని ఆధారంగా స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు చేపడతామని కూటమి స్పష్టం చేసింది. ఇటువంటి ఆలోచన ముఖ్యమంత్రి చేయలేదు. నవ సమాజ నిర్మాణానికి కీలకమైన యువత పట్ల కూటమిది సానుకూల థృక్పథం అని.. వైసీపీది అందుకు పూర్తి విరుద్దమని రెండు మేనిఫెస్టోలు వెల్లడిరచాయి.
3.మహిళా సంక్షేమం
కూటమి మేనిఫెస్టో :
ఎ. ప్రతి మహిళకు నెలకు రూ.1500 (19-59 సంవత్సరాల వయసున్నవారికి)
బి. పిల్లలను బడికి పంపే తల్లులకు ఎటువంటి నిబంధనలు లేకుండా ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ.15 వేలు చొప్పున అందరి పిల్లలకు సాయం.
సి. మహిళల ఆరోగ్యం కోసం ప్రతి ఇంటికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు
డి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
ఇ. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాల పరిమితిని రూ.3 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంపు.
వైసీపీ మేనిఫెస్టో
ఎ. ప్రస్తుతం అమలులో ఉన్న కార్యక్రమాల ద్వారా లభించే లబ్దిలో ఎటువంటి పెంపు ఉండదు.
విశ్లేషణ : కూటమి మేనిఫెస్టోలో ఎటువంటి షరతులు లేకుండా అర్హులైన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున రానున్న ఐదేళ్లలో ప్రతి మహిళకు మొత్తం రూ.90 వేలు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి కనీసంగా ఇద్దరు మహిళలున్నా మొత్తం రూ. లక్షా 80 వేల లబ్ది ప్రతి కుటుంబానికి చేకూరుతుంది. అదేరీతిన ప్రతి కుటుంబంలో కనీసంగా ఇద్దరు చదువుకునే పిల్లలున్నా సంవత్సరానికి రూ.30 వేలు చొప్పున రానున్న ఐదేళ్లలో అదనంగా రూ. లక్షా 50 వేలు సాయం లభిస్తుంది. రానున్న ఐదేళ్లలో మొత్తం 15 ఉచిత గ్యాస్ సిలిండర్ల ద్వారా కనీసంగా మరో 15 వేల సహాయం. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా నెలకు కనీసంగా వెయ్యి రూపాయల చొప్పున మరో 60 వేల అదనపు లబ్ది. దీనికి భిన్నంగా జగన్‌రెడ్డి కేవలం అమ్మఒడి కింద రూ.2వేల అదనపు సాయాన్ని మాత్రమే ఇస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలకు శ్రీకారం చుట్టి ఒక మహిళా ఉద్యమంగా తీర్చిదిద్దిన చంద్రబాబు డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాల పరిమితిని ప్రస్తుతమున్న రూ.3 లక్షల నుండి రూ.10 లక్షల వరకు పెంచుతామని ప్రతిపాదించి వారికి భారీ స్థాయిలో అండగా ఉంటానని భరోసానిచ్చారు. మహిళల పట్ల మొసలి కన్నీరు కార్చే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తన తాజా ఎన్నికల ప్రణాళికలో తమ అసలు రంగుని ప్రదర్శించుకున్నారు.
4.బీసీల సంక్షేమం :
కూటమి మేనిఫోస్టో :
ఎ. ఇరవై ఐదు విస్పష్ట హామీలు, ప్రతిపాదనలతో కూటమి మేనిఫెస్టో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేసింది.
బి. ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్ల ప్రత్యేక వ్యయం
సి. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం
డి. ప్రత్యేక చర్యల ద్వారా రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించటంÑ స్థానిక సంస్థల్లో తిరిగి 34 శాతం రిజర్వేషన్.
ఇ. స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్ల వ్యయం
ఎఫ్. రూ.5వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరణ
జి. తొమ్మిది బీసీ కులాల సాధికారతకు వృత్తుల ఆధారంగా చర్యలు
వైసీపీ మేనిఫెస్టో :
ఎ. కొత్త పథకాలుగానీ, రాశి లబ్దిలో ఏమాత్రం పెంపుగానీ లేదు.
బి. మత్స్యకారులు చేనేత, నాయిబ్రాహ్మణులకు ప్రస్తుతం ఉన్న పథకాల గురించే ప్రస్తావించారు.
విశ్లేషణ: రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న వెనుకబడిన తరగతులవారి సాధికారిత, అభివృద్ధి పట్ల కూటమి, ముఖ్యమంత్రి దృక్పథాల్లో భిన్నత్వం వారి మేనిఫెస్టోల్లో స్పష్టంగా వెల్లడైంది. కూటమి బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ప్రకటించి వివిధ కుల వృత్తులవారికి వారి అవసరాల మేరకు సహాయ పథకాలను వెల్లడిరచింది. రాజకీయ అధికారంలో బీసీల భాగస్వామ్యాన్ని భారీగా పెంచే ఉద్దేశాన్ని సవివరంగా తెలియజేసింది. ఈ వర్గం సంక్షేమానికి రానున్న ఐదేళ్లలో భారీస్థాయిలో నిధులు వెచ్చిస్తామని తెలిపింది. గత ఐదేళ్లుగా వైసీపీ గణం బీసీలపై నిరంతర దాడులతో పలువురి హత్యకు కారణమయ్యారు. ఈ విషయం తీవ్రత దృష్ట్యా అట్టి దుర్మార్గులపై తగు విచారణలు చేపట్టి వారిని శిక్షిస్తామని కూటమి ప్రకటించి.. బీసీలపై దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించలేమనే తమ వైఖరిని స్పష్టం చేసింది. దీనికి భిన్నంగా వైసీపీ మేనిఫెస్టో బీసీల సంక్షేమం గురించి మొక్కుబడిగా ప్రస్తావించి రానున్న ఐదేళ్లలో వారి ప్రగతి, రక్షణల కోసం ఎటువంటి కొత్త నిర్దిష్ట ప్రకటనలు చేయకుండా బీసీల పట్ల తమ చిత్తశుద్ధి రాహిత్యాన్ని వెల్లడిరచుకుంది.
5. వ్యవసాయం
కూటమి మేనిఫెస్టో :
ఎ. ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.20 వేల పెట్టుబడి సాయం
బి. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, అన్ని సంక్షేమ పథకాల అమలు
సి. రైతు కూలీలకు ప్రత్యేక కార్పొరేషన్/ రాయితీలు సంక్షేమ పథకాల అమలు
డి. 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్‌కు ప్రోత్సాహం
ఇ. సాగునీటి ప్రాజెక్టుల సత్వర నిర్మాణం
వైసీపీ మేనిఫెస్టో :
ఎ. రైతులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.13,500 నుంచి రూ.16,000కు పెంపు
విశ్లేషణ: రేయింబవళ్లు శ్రమించినా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి విధానాలతో గత ఐదేళ్లుగా తీవ్ర కష్టాలుపడిన రాష్ట్ర రైతాంగం ఆత్మహత్యల్లో దేశంలో మూడోస్థానంలో ఉండే అపకీర్తిని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో రైతన్నల మేలు కోసం కూటమి పలు చర్యలను, విధానాలను ప్రకటిస్తూ రైతులకు ప్రస్తుతం ప్రతి యేడాది అందుతున్న రూ.13,500 సాయాన్ని మరో రూ.6,500 పెంచుతామని ప్రకటించింది. ఇది వైసీపీ అధికారంలోకి వస్తే పెంచుతామన్న సాయం కంటే రూ.4,000 అధికం. వైసీపీ మేనిఫెస్టోలో అరకొరగా అమలైన పథకాలను మాత్రమే పునరుద్ఘాటించారు. గత కొన్ని సీజన్లుగా సాగులో ఉన్న భూమి విస్తీర్ణం, వ్యవసాయ ఉత్పత్తి క్రమేణ తగ్గుతూ వచ్చినా దీని నివారణకు చేపట్టే చర్యలను ప్రకటించే కనీస బాధ్యతను కూడా వైసీపీ మేనిఫెస్టోలో విస్మరించారు.
6. వైద్యం, ఆరోగ్యం
కూటమి మేనిఫెస్టో :
ఎ. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా
వైసీపీ మేనిఫెస్టో :
ఎ. ప్రస్తుతం అమలులో ఉన్న ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని కొనసాగిస్తాం.
విశ్లేషణ: గత ఐదేళ్లుగా అధ్వాన్నంగా మారిన ఆరోగ్యశ్రీ వైద్య సేవల పరిస్థితిని రాష్ట్ర ప్రజలు ప్రత్యక్షంగా గమనించారు. భారీగా ప్రభుత్వ బకాయిలు పేరుకుపోవడంతో పలు నెట్‌వర్క్ ఆసుపత్రులు రోగులకు చికిత్సలు, వైద్య సేవలు తిరస్కరించటం పరిపాటి అయింది. గిరిజన ప్రాంతాల్లో సరైన రవాణా, వైద్య సదుపాయాలు లేక రోగులను, బాలింతలను డోలీల్లో మోసుకురావాల్సిన పరిస్థితి.. దారిలోనే కొందరు మరణించడం వంటి దుర్ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నామన్న జగన్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పటిదాక ఎంతమందికి ఆ మేరకు ఉచిత సేవలందించారో వెల్లడిరచకపోవడంతో ఈ పథకం అమలు తీరు పూర్తి సందేహాస్పదమైంది. చిన్న చిన్న బిల్లులే జగన్‌రెడ్డి ప్రభుత్వం ఆసుపత్రులకు చెల్లించలేక చేతులెత్తేస్తే.. రూ.25 లక్షల మేరకు బిల్లుల చెల్లింపుపై పూర్తి అనుమానంతో నెట్‌వర్క్ ఆసుపత్రులు ఆమేరకు సేవలు అందించిన దాఖలాలు లేవని సర్వత్రా వినపడుతోంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రతిపాదించిన ఆరోగ్యబీమా అత్యుత్తమ సదుపాయమని, దీంతో అనారోగ్యంపాలైన వారిలోనూ, ఆసుపత్రుల వారిలోను పూర్తి భరోసా ఏర్పడి అవసరమైన వైద్య సేవలు సరైన సమయంలో అందుతాయి.
ఈ విధంగా వైసీపీ మేనిఫెస్టో ముఖ్యమంత్రి గత ఐదేళ్ల వైఫల్యాలను, తద్వారా రానున్న ఐదేళ్లలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పట్ల జగన్ రెడ్డి నిస్సహాయతను స్పష్టం చేయగా.. పలు వర్గాల సంక్షేమం, ప్రగతి కొరకు అదనపు సాయంతో కూడిన విస్పష్ట పథకాలు, విధానాలతో కూటమి ఉమ్మడి మేనిఫెస్టో ప్రజల నేటి అవసరాలు, రేపటి ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ఉందని విశ్లేషకుల తీర్పు.