- అమరావతి విధ్వంసంతో ప్రజల కలలు చెరిపేశాడు
- ఓటడగడానికి వచ్చే వైసీపీని నిలదీయండి
- మైనారిటీల సంక్షేమాన్ని గాలికొదిలేసి, మాపై విమర్శలా?
- మలి సంతకం.. భూహక్కు చట్టం రద్దుపైనే
- ముస్లింలకు 50ఏళ్లకే సార్వత్రిక పింఛనులు
- మైనారిటీల అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉంటుంది
- గుంటూరు ప్రజాగళం సభలో చంద్రబాబు స్పష్టం
- రోడ్ షోలో పోటెత్తిన జన సందోహం
గుంటూరు (చైతన్యరథం): గుంటూరు మిరపకాయ సత్తా మన రోడ్ షోలో కనిపిస్తోంది. మీ జోష్ చూస్తుంటే `ఐదేళ్లు పడిన బాధలు, ఇబ్బందులకు పరిష్కారం దొరికిందన్న ఆనందం మీలో కనిపిస్తోంది. చిన్నపిల్లలను భుజాలకెత్తుకున్న తండ్రుల కళ్లలో `పిల్లల బాధ్యత నాకు అప్పగించామన్న భావన కనిపిస్తోంది. ఆడబిడ్డలు మగవారికి ఏమాత్రం తీసిపోకుండా పోటీ పడి నడిచారు. ఇదంతా చూశాక.. మేడే శుభాకాంక్షలు చెబతూ మీకో మాట చెప్తున్నా. ఈ ఉత్సాహం మరో పది రోజుల్లో `వైసీపీకి డిపాజిట్లు లేకుండా చేస్తుందని గట్టిగా చెబుతున్నా అంటూ గుంటూరు రోడ్ షోలో చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. ర్యాలీ అనంతరం పోటెత్తిన జనంమధ్య నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు తన సుదీర్ఘ ఉపన్యాసంలో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పాలనా వైఫల్యాలపై నిప్పులు చెరిగారు. అమరావతిని నాశనం చేసి ప్రజల ఆశలను తుంచేసిన సైకో జగన్‌రెడ్డి అని విరుచుకుపడ్డారు. రాజధాని అమరావతిలో గుంటూరు భాగమంటూ `అమరావతి కలలు నెరవేరివుంటే గుంటూరు ఎక్కడో ఉండేదని అన్నారు. హైదరాబాద్, సికింద్రబాద్‌కు తోడుగా సైబరాబాద్ నిర్మించినట్టే.. ఇక్కడా ఓ అద్భుత నగరం ఆవిష్కృతమై ఉండేదన్నారు. జగన్ అధికారంలోకి వచ్చి మన కలలను తుంచేశాడని, రాజధానిని సర్వనాశనం చేసిన దుర్మార్గుడని దునుమాడారు. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు కేవలం 163 కి.మీ మాత్రమేనని, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 180 కి.మీ. ప్రణాళిక అని వివరించారు. ల్యాండ్ ఫూలింగ్ ద్వారా రైతులనే రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం చేశామని, 29 వేల రైతులు ముందుకొచ్చి 33 వేల ఎకరాలు భూములిచ్చారన్నారు. రూపాయి ఖర్చులేకుండా రాజధాని ప్రారంభించిన పార్టీ తెలుగుదేశమని అంటూ, ప్రణాళిక పూర్తైవుంటే నవ్యాంధ్ర ప్రగతి శిఖరసమానమయ్యేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఓటడగటానికి వచ్చిన వైకాపాను నిలదీయండి
2019లో మీ భూమి విలువ, ఇప్పుడు భూమి విలువ బేరీజువేయండి? మీ భూమి విలువ తగ్గిందా లేదా? ఇంటి బాడుగలకు నేడు డిమాండ్ ఉందా? మీ కొనుగోలు శక్తి పెరిగిందా? మీకు అమరావతి రాజధాని కావాలా వద్దా? అమరావతి రాజధాని కావాలంటే సైకోకు ఓటు వేయొద్దు. వైసీపీ కోసం ఓటడగటానికి వచ్చిన వాళ్లను ప్రశ్నించాలని అంటూ, అమరావతిని నాశనం చేసిన రోజే మీరు ప్రశ్నించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చంద్రబాబు అన్నారు.
ఒక మసీదుకు సాయం చేయని వ్యక్తి జగన్.
2019 కంటే ఈ ఐదేళ్లలో మీ జీవన ప్రమాణాలు పెరిగాయా? మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా? రైతులకు గిట్టుబాటు ధర వచ్చిందా? ఆడబిడ్డలు నిత్యవసర వస్తువులు కొనే పరిస్థితిలో ఉన్నారా? ముస్లిం సోదరులకు దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా వచ్చిందా? మరి జగన్‌కు ఎందుకు ఓటు వేయాలని బాబు నిలదీశారు. బీజేపీతో 2014లోనే కలిశాం. కర్నూలులో ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టాను. కర్నూలు, కడపలో హజ్‌హౌస్‌లు కట్టాం. ముస్లిం సోదరులకు, మౌజం, ఇమామ్‌లకు గౌరవ వేతనం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం. మసీదులకు ఆర్ధిక సాయం చేశాం. ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను రక్షించడానికి సుప్రీంకోర్టులో నాయాయవాదులను పెట్టి వారికి కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం. తెలుగుదేశం అధికారంలోకి వస్తే మసీదులు కూలీపోతాయని సైకో దుష్ప్రచారం చేస్తున్నాడు. ఏనాడైనా జరిగిందా అని అడుగుతున్నా? అని చంద్రబాబు ప్రశ్నించారు.ఈ నియోజకవర్గంలో ముస్లింలు ఎక్కువ మంది ఉన్నారు. గుంటూరు చుట్టుప్రక్కల ఎక్కువగా ఉన్నదీ ముస్లింలే. విశాఖకు రాజధాని తీసుకుపోతానని అంటున్నాడు. ఒక మసీదుకు సాయం చేయని వ్యక్తి జగన్. నేను మీటింగులు పెట్టి అడిగే వరకు మౌజంలకు, ఇమామ్‌లకు గౌరవ వేతనం ఇవ్వలేదు జగన్. అందుకే చాలా స్పష్టంగా హామీ ఇస్తున్నా. ముస్లింలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తాం. ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరస్తాన్‌లకు స్థలాలు కేటాయిస్తాం. హజ్ యాత్రకు లక్ష రూపాయలు ఆర్ధిక సాయం చేస్తాం. నూర్‌బాషా కార్పొరేషన్ పెట్టి ఏడాదికి వంద కోట్లు ఆర్ధిక సాయం చేస్తాం. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ల ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలిచ్చే బాధ్యత నాది. ఇమామ్, మౌజం 10, 5 వేలు గౌరవ వేతనం ఇస్తాం. అర్హత ఉన్న ఇమామ్‌లను ప్రభుత్వ ఖాజీలుగా నియమిస్తాం. మసీదుల నిర్వహణకు ప్రతీ నెల 5 వేలు ఇస్తాం. 4శాతం ముస్లిం రిజర్వేషన్లు కాపాడే బాధ్యత నాది అని చంద్రబాబు ప్రకటించారు.
జగన్ రెడ్డి ఒక విధ్వంసకారుడు
జగన్‌రెడ్డి ఒక విధ్వంసకారుడు. ఒక అహంకారి. దోపిడీదారుడు. రాష్ట్రంలోని సంపదను దోచేశాడు. జె.బ్రాండ్ల మద్యాన్ని తీసుకొచ్చి ప్రజారోగ్యం దెబ్బతీశాడు. మద్యం ఉత్పత్తి, పంపిణీ, అమ్మకాలు అన్నీ జగన్‌రెడ్డే. సైకో పంపే నాశిరకం మద్యం త్రాగి ఆడబిడ్డల తాలిబొట్లు తెగిపోతుంటే ఆయన్ను గొప్ప నాయకుడని పొగడాలా? అని చంద్రబాబు నిలదీశారు.
లాండ్ గ్రాబింగ్ యాక్టు రద్దుపై మలి సంతకం
జగన్ రెడ్డి ప్రమాదకరమైన లాండ్ గ్రాబింగ్ యాక్టు తెచ్చాడని, ఆ చట్టంతో మీ ఆస్తులు మీకు కాకుండా చేయగలడని చంద్రబాబు హెచ్చరించారు. ఏమాత్రం రక్షణ ఇవ్వకుండా ఆస్తులు దోచుకోవడానికి అవకాశమిస్తున్న చట్టాన్ని అధికారంలోకి రాగానే రద్దు చేస్తానని ప్రకటించారు. నిరుద్యోగ యువత కోసం డిఎస్సీపై తొలి సంతకం చేస్తానని, ప్రజల ఆస్తుల రక్షణం కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు దస్త్రంపై మలి సంతకం చేస్తానని చంద్రబాబు ప్రకటించారు.
మార్పింగులతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు
కంప్యూటర్‌లలో మనుషులనే మార్చేస్తున్నారు. నా పేరుతో తప్పుడు వార్తలు పెడుతున్నారు. నేను అనని వాటికి కూడా అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. నేను సంతకం పెట్టకపోయినా తప్పుడు సమాచారం రిలీజ్ చేస్తున్నారు. ఇలా మార్పింగులు చేసే వారు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ భూమి పత్రాలు మార్పింగ్ చేస్తే.. మీరెమవుతారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఒంటిమిట్టలో ఇలాంటి దురాగతమే జరిగిందని, చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబం సహా ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సుబ్బారావు కుమార్తెకు రూ.5 లక్షల ఆర్ధిక సాయం చేసి ఆదుకున్నామన్నారు. వైసీపీ కార్యకర్తలు రేపు ఇతరుల భూమి పత్రాలు మార్చరని గ్యారెంటీ ఏమిటి జగన్‌రెడ్డి? అని ముఖ్యమంత్రిని నిలదీశారు.
గంజాయిమీద శ్రద్ధ అభివృద్ధిపై చూపాల్సింది!
గుంటూరులో వైకాపా ఎమ్మెల్యే ముస్తఫా గుట్కా వ్యాపారం చేస్తున్నాడు, అవునా కాదా? సిటీలో దొరికే గంజాయి సరఫరా ఎవరు చేస్తున్నారు? జగన్‌రెడ్డి అనుచరులే ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నారు. ఆ తెలివితేటలు అభివృద్ధిపై చూపితే బాగుండేది. ముస్లిం కాలేజీ వద్ద ఖాళీ స్థలాలు కబ్జా చేశాడు. వక్ఫ్ బోర్డు ఆస్తులను కబ్జా చేశారు. ఆటోనగర్‌లో కబ్జాలకు పాల్పడ్డారు. ఇన్నర్ రింగురోడ్డు వద్ద 32 ఎకరాలు కబ్జా చేశాడు. ఇంటి పనిమనిషి కొడుకు టీడీపీలో తిరిగాడని దొంగతనం కేసు పెట్టించి చిత్రహింసలకు గురిచేశాడు. ఈ దుశ్చర్యలకు తగిన మూల్యం చెల్లించే రోజు వస్తుంది. గుంటూరు డిప్యూటీ మేయర్ వైసీపీ పార్టీతో విసిగిపోయి తెలుగుదేశంలో చేరుతున్నారు. ఒక మహిళ, ఉత్సాహవంతురాలు ఆమెను తప్పకుండా ఆదరిస్తాం. మంచి అవకాశాలు కల్పిస్తాం అన్నారు. పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలు తిరగబడుతున్నారు. కూటమి అభ్యర్థులను ఆదరించి, వైసీపీని తరమికొడదాం. ఆ రోజు ఇంకెంతో దూరంలో లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.