- విధ్వంసం కావాలా? అభివృద్ధి కావాలా?
- ముఖ్యమంత్రీ.. రాజధాని ఎక్కడ?
- మహిళలకు పెద్దపీట వేసింది దేశంలోనే మొదటిగా తెలుగుదేశం
- జగన్ దెబ్బకు ఎక్కువగా బలైంది దళితులే
- పట్టిసీమనూ పక్కనపెట్టిన దుర్మార్గుడు జగన్
- వాలంటీర్లూ, రాజీనామా చేయొద్దు.. నష్టపోతారు
- అధికారంలోకి వచ్చాక రెండో సంతకం జాబ్ క్యాలెండర్‌పైనే
- కుట్రతో కూడిన జగన్ భూరక్షణ చట్టాన్ని రద్దు చేస్తా
- కొల్లూరు ప్రజాగళం సభలో చంద్రబాబు
- పోటెత్తిన అశేష జనం
కొల్లూరు (చైతన్య రథం): సంక్షేమం కావాలా.. సంక్షోభం కావాలా? విధ్వంసం కావాలా? వికాశం కావాలా? ప్రజలు తేల్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. నవ్యాంధ్ర `గత టీడీపీ హయాంలో ఎలావుందో, ఇప్పుడెలా ఉందో చర్చించండి. రచ్చబండ, కాలనీలు, కిరాణాషాప్, పాన్‌షాప్, హోటళ్ల, బస్సులు.. వీలైనచోట చర్చించి నిర్ణయం తీసుకోండి. ఎన్నికలకు సమయం 30 రోజులే ఉంది. మే 13న పోలింగ్ స్టేషన్‌కు వెళ్లే ముందూ విజ్ఞతతో ఆలోచించండి. సంక్షేమమా? సంక్షోభమా? నిర్ణయించుకోవాల్సింది మీరే’ అని చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాగళం ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా శుక్రవారం కొల్లూరులో భారీఎత్తున నిర్వహించిన సభలో పోటెత్తిన జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
జగన్ విధ్వంస పాలనపై ధ్వజమెత్తుతూ `ముఖ్యమంత్రీ రాష్ట్రానికి రాజధాని ఎక్కడ? అంటూ నిలదీశారు. రోడ్లపై మట్టిపోసి గోతులను కూడా పూడ్చలేని జగన్, మూడు రాజధానాలు కడతాడా? అతనికి సాధ్యమేనా? అని బాబు ప్రశ్నించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన అనుభవంతో అమరావతి రాజధాని నిర్మాణానికి పిలుపునిస్తే `29వేలమంది రైతులు ల్యాండు పూలింగులో 35వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన విషయాన్ని బాబు గుర్తు చేశారు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగని అద్భుతమని, అమరావతిని ఆమోదిస్తామని ఎన్నికల ముందు చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల నాటకంతో రాష్ట్రానికి రాజధానే లేకుండా చేశాడని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి మొండెం ఉంచి తల తీసేసిన దుర్మార్గుడికి ఓటు వేస్తారా? అని ప్రజలను ప్రశ్నించారు. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తైవుంటే.. దేశంలో మహానగరాలను తలదన్నే అవకాశాలు, సౌకర్యాలు, అభివృద్ధి అందుబాటులోకి వచ్చి ఉండేదన్నారు.
టీడీపీ.. మహిళా పక్షపాతి
దేశంలోనే మొదటిగా మహిళలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీయేనని చంద్రబాబు అన్నారు. టీడీపీ అంటేనే మహిళా పక్షపాతి అంటూ, మహిళాభ్యున్నతికి, మహిళల ఆర్థికోన్నతికి ఇతోధిక కృషిచేసిన పార్టీ తెదేపా అన్నారు. ఆస్తిలో సమాన హక్కు, రాజకీయ రిజర్వేషన్లు, మహిళా వర్శిటీల ఏర్పాటు, నాయకత్వ లక్షణాలు నేర్పిన డ్వాక్రా సంఘాలు.. ఇలా ఎన్నో పథకాలతో రాష్ట్ర మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించగలిగామన్నారు. పల్లె మహిళలను ప్రపంచంతో అనుసంధానించిన ఘనతా టీడీపీదేనన్నారు. మహిళలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సూపర్ టెన్‌లో సింహభాగం వాళ్లకే ఇచ్చామని చంద్రబాబు వివరించారు. ఒక ఆడబిడ్డకు నెలకు రూ.1500 చొప్పున ఎంతమంది ఉంటే అందరికీ ఇస్తామన్నారు. తల్లికి వందనం పేరుతో ఒక్కో బిడ్డకు రూ.15000 చొప్పున ఎంతమంది విద్యార్ధులుంటే అందరికీ ఇస్తామన్నారు. ఏడాదికి 3 గ్యాస్ సిలెండర్లు ఇస్తామని, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. ప్రతి ఇంటికి కుళాయి నీళ్లు, వికలాంగులకు రూ.6వేలు పింఛను, పింఛనుదారులకు రూ.4వేల పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తామన్నారు. సంపదను సృష్టించి సంక్షేమ పథకాలు చేపట్టి పేదలకు పంచడం తమ అభిమతమన్నారు. వనరులను దిగమింగి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి రాష్ట్రానికి, రాష్ట్ర మహిళలకు భవిష్యత్ లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్ అని చంద్రబాబు తూర్పారబట్టారు.
దళిత పథకాలకు జగన్ పేరా?
జగన్ దెబ్బకు ఎక్కువ బలైపోయింది దళితులేనని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. నా ఎస్సీలంటూనే దళితులను ఊచకోత కోశాడన్నారు. రూ.25 వేల కోట్ల సబ్‌ప్లాన్ నిధులు మళ్లించాడు. మాస్క్ పెట్టుకోలేదని విక్రవమ్‌ను, మాస్క్‌లు అడిగాడని వైద్యుడిని చంపేశారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్యచేసి డోర్ డెలివరీ ఇచ్చిన ఎమ్మెల్సీని పక్కన తిప్పుకుంటున్నాడు. ఎస్సీల అభ్యున్నతికి తెదేపా ప్రవేశపెట్టిన 27 పథకాలనూ నిర్థాక్షిణ్యంగా రద్దు చేశాడు. విదేశీ విద్యా పథకాన్ని ప్రవేశపెడితే.. దానికి అంబేద్కర్ పేరు తీసేసి జగన్ పేరు తగిలించుకున్నాడు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లనూ నిర్లక్ష్యం చేసిన దళిత ద్రోహి జగన్‌కు ఏ దళితుడైనా ఓటేస్తారా? అని బాబు ప్రశ్నించారు. ఐదేళ్లుగా ప్యాలెస్ దాటి బయటకు రాని జగన్, ఇప్పుడు ఎన్నికల సభలకు వస్తూ విధ్వంసాన్నే సృష్టిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ కోసం పచ్చని చెట్లను నరికేస్తున్న వైసీపీ నైజాన్ని అర్థం చేసుకొమ్మని బాబు విజ్ఞప్తి చేశారు. తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్‌ను కలిసే అవకాశం మంత్రులకే లేదని, ఇక ప్రజలు ఎలా కలుస్తారని ప్రశ్నించారు. ప్రజలతో మమేకం అంటూ జగన్ ఎన్నికల నాటకాలు ఆడుతున్నాడని దుయ్యబట్టారు. తాను అధికారంలో ఉండగా `పేద ప్రజల కోసం ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉండేవన్నారు. జనసేన అధినేత పవన్‌తో కలిసి ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్వహించిన ప్రజాగళంతో గోదావరి గర్జించిందని, జీవితంలో గొప్ప అనుభూతి కలిగిందన్నారు. ఇటు కరువు అటు తుపాన్లతో రాష్ట్ర రైతాంగం అతలాకుతలమైతే `ఐదేళ్లలో ఒక్కసారైనా జగన్ రైతులను కలిశాడా అని చంద్రబాబు ప్రశ్నించారు. అసమర్ధ ముఖ్యమంత్రి నిర్వాకం వలన రైతన్నలు ఎంత నష్టపోయారో చూస్తున్నానన్నారు. కష్టాల్లోవున్న రైతన్నలను కలిసి సమస్యలపై ముఖ్యమంత్రిని నిలదీస్తే.. కనీసం స్పందించని వ్యక్తులు మనకు అవసరమా? అని బాబు ప్రశ్నించారు. ఐదేళ్లలో ఐదుసార్లైనా రైతు పొలాల్లోకి దిగని జగన్, ఎన్నికల సమయంలో మొసలి కన్నీరు కారుస్తున్నాడని దుయ్యబట్టారు. సూపర్ టెన్‌లో భాగంగా రైతులకు ఏడాదికి రూ.20వేలు పంట పెట్టుబడి ఇవ్వనున్నామని చంద్రబాబు ప్రకటించారు.
పట్టిసీమనూ వదలని దుర్మార్గుడు..
ప్రజావేదికతో మొదలు పెట్టిన విధ్వంసం పట్టిసీమ దాకా ఆపలేదని జగన్‌పై చంద్రబాబు నిప్పులు కురిపించారు. మొదటి పంటకే నీళ్లందని కృష్ణా డెల్టా పరిస్థితిని పట్టిసీమ పూర్తిచేసి చక్కదిద్దితే.. తెదేపాపై కక్షతో ఆపేశాడని దుయ్యబట్టారు. అప్పట్లో 13 లక్షల ఎకరాలకు నీరందించామని గుర్తు చేశారు. పోలవరం పూర్తిచేసి నదులను అనుసంధానిస్తే `గుంటూరుకు సమృద్ధిగా సాగునీరు అందించొచ్చన్నారు. 2020 లక్షంతో పనులను పరిగెత్తించి 72 శాతం పోలవరం పూర్తిచేస్తే.. బహుళ ప్రాజెక్టును గోదాట్లో ముంచేసిన జగన్‌ను రాష్ట్ర ప్రజలు క్షమించరన్నారు.
వాలంటీర్లూ.. రాజీనామా చేయొద్దు
వాలంటీర్ జీవితాలతో జగన్ ఆటాడుతున్నాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఉద్యోగం కోసం మీ ఉద్యోగాలు వదులుకుంటే తీవ్రంగా నష్టపోతారని హితవు పలికారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసేది లేదని, నెలకు రూ.10వేల జీతంతో ప్రజా సేవకులను గౌరవించుకుంటామని హామీ ఇచ్చారు. డబ్బులు చేతిలోపెట్టి రాజీనామాలు చేయమని వైకాపా బెదిరిస్తే బెదిరిపోవద్దని ధైర్యం చెప్పారు. అలాగే, పోలీసులకు జీతాలు సరిగ్గా రావడం లేదు. పీఆర్సీ, పీఎఫ్, డీఏలు లేవు. బకాయిలు ఇవ్వడం లేదు. నిన్న విశాఖలో కానిస్టేబుల్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది ప్రభుత్వ హత్య కాదా? అని నిలదీశారు. అధికారంలోకి రాగానే పోలీసుల సమస్యలను పరిష్కరించి ఆదుకుంటానని హామీ ఇచ్చారు.
మలి సంతకం జాబ్ క్యాలెండర్‌పైనే..
రాష్ట్రాభివృద్ధికి బెస్ట్ డ్రైవర్‌గా యువతను సేఫ్‌గా తీసుకెళ్లే బాధ్యత తనదేనని చంద్రబాబు హామీ ఇచ్చారు. మొదటి సంతకం డిఎస్సీపై పెడతానని ఇప్పటికే హామీ ఇచ్చానని, రెండో సంతకం జాబ్ క్యాలెండర్‌పై పెడతానని చంద్రబాబు ప్రకటించారు. 25 లక్షల ఉద్యోగాల కల్పనకు కంకణం కట్టుకున్నామని, ఈలోగా నిరుద్యోగ భృతిగా నెలకు రూ.3వేలు అందిస్తామని హామీ ఇచ్చారు.
కుట్రతో కూడిన జగన్ భూరక్షణ చట్టాన్ని రద్దు చేస్తా
రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్న జగన్, ప్రయివేట్ ఆస్తులనూ లాక్కోడానికి కుట్రతో భూరక్షణ చట్టాన్ని తెచ్చాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దురుద్దేశంతో తెచ్చిన చట్టాన్ని అధికారంలోకి రాగానే రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రాగానే ఏపీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ రద్దు చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. మీ భూమికి రక్షణగా నేనుంటానని బాబు హామీ ఇచ్చారు.
దోచుకున్నవాళ్లను ట్రాన్స్‌ఫర్ చేశాడు
ఒకచోట దోచుకున్న వైసీపీ ఎమ్మెల్యేలను గ్రాఫ్ పడిపోయిందని చెప్పి వేరే ప్రాంతాలను ట్రాన్స్‌ఫర్ చేసిన జగన్‌ను ఏమనాలి? అని ప్రశ్నించారు. నియోజకవర్గాన్ని దోచుకున్న మేరుగ నాగార్జునను సంతనూతలపాడు పంపారని, ఇప్పుడు వేమూరుకు దండుపాళ్యం బ్యాచ్ దిగుతుందని చంద్రబాబు దుయ్యబట్టారు. ‘జగన్ గ్రాఫ్ కూడా పడిపోయింది. ఆయనను ఎక్కడకు పంపుదాం’ అని చంద్రబాబు ఛలోక్తి విసిరారు. నియోజకవర్గ అభివృద్ధికి పూచీ ఉంటానని చెబుతూ.. సముద్రం బ్యాక్‌వాటర్‌తో ఉప్పుదేరుతున్న భూములను `చెక్‌డ్యాంల నిర్మాణంతో ఆదుకుంటానన్నారు. రూ.50 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసినా జగన్ చేపట్టలేని పోతర్లంక ఎత్తిపోతల పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. దళిత కాలనీల్లో రోడ్లు వేయించిన ఘనత ఆనంద్ బాబుదని అంటూ, నియోజకవరÊ్గ అభివృద్ధి కావాలంటే దుర్మార్గులను ఇంటికి పంపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
వైనాట్ పులివెందుల?
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 400 సీట్లు గెలవబోతుంది. ఏపీలో 150కి పైగా సీట్లు రావాలి. అందుకే వైనాట్ పులివెందుల అంటున్నాం. బాబాయ్‌ని గొడ్డలి వేసినందుకు జగన్‌కు ఓటు వేయాలా? 25కి 25 ఎంపీలు ఎన్డీఏనే గెలవాలి. నీతి నిజాయితీకి చిరునామాగా ఉన్న కృష్ణప్రసాద్‌ని ఎంపీగా గెలిపించాలి. ఐదోసారి ఆనంద్ బాబు ఎమ్మెల్యే అభ్యర్ధిగా మీ ముందుకు వచ్చారు. కూటమి అభ్యర్థులను గెలిపించి `నియోజకవర్గ ప్రగతికి బాటలు వేయాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.
తెదేపా గూటికి క్రిస్టియానా
గుంటూరు జిల్లాలో పాలకపక్షం వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ క్రిస్టియానా వైసీపీని వీడి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కొల్లూరులో నిర్వహించిన ప్రజాగళం సభలోనే క్రిస్టియానాతోపాటు సురేష్, కుర్రా నాగమల్లేశ్వరిలను పార్టీలోకి చంద్రబాబు మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. పార్టీ కండువాలు కప్పి తెదేపాలోకి చేర్చుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ `సైకో జగన్ అవమానాలు భరించలేక జడ్పీ ఛైర్మన్ క్రిస్టియానా, సురేష్, కుర్రా నాగమల్లేశ్వరిలు టీడీపీలో చేరినందుకు స్వాగతం పలుకుతున్నానన్నారు. ఏ ప్రాంతానికి వెళ్లినా అభ్యర్ధులను గెలిపించుకుంటామని ఘంటాపదంగా చెబుతున్నారు. నెత్తిన పెట్టుకున్న కుంపటిని దించాలని, రాక్షస ప్రభుత్వాన్ని దింపాలని ఇప్పటికే నిశ్చయించుకున్నారు. వైసీపీలో కొంత మంది మంచోళ్లు, కొంతమంది రౌడీలు ఉన్నారు. రౌడీలు మనకొద్దు, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అనుకున్న మంచోళ్లే మనకు కావాలి. ప్రజాగళం సభకు ప్రజలు స్వచ్ఛంధంగా వచ్చారు. కాని జగన్ సభలకు రూ.20 కోట్లు ఖర్చు, 1500 బస్సుల, బిర్యానీ ప్యాకెట్లు, క్వార్టర్ బాటిల్ పంచుతున్నా తుస్సుమంటున్నాయి. అది జగన్ ‘సిద్ధం’.. మనది నిజమైన ‘ప్రజాగళం’ అని చంద్రబాబు చమత్కరించారు.