ఆగిరిపల్లి (చైతన్యరథం): వైసీపీ పాలనలో దొంగలే దొంగ… దొంగ.. అని అరుస్తున్నారని, అమాయకు లను, ప్రతిపక్ష నేతలను కక్షపూరితంగా దొంగలుగా చిత్రీకరించేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తు న్నారని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో గురువారం నిజం గెలవాలి పర్యటన లో కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన అనం తరం తనకు సంఫీుభావం తెలిపేందుకు వచ్చిన కార్య కర్తలు, పార్టీ అభిమానులను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడుతూ… గంజాయి, డ్రగ్స్, ఇసుకమాఫియా, భూకబ్జాలతో రాష్ట్రాన్ని దోచుకుంటున్న వారు.. తమను ప్రశ్నించే వారిని దొంగలుగా చిత్రీకరించేందుకు ప్రయ త్నిస్తున్నారని తప్పుబట్టారు.
వైసీపీ నేతల అక్రమార్జనను నిలదీస్తున్నారనే కక్షతో టీడీపీ అధినేత చంద్రబాబును ఆధారాలు లేని తప్పుడు కేసులో ఇరికించి రూ.3వేల కోట్లు దోచుకున్నారని తొలుత ఆరోపించి చివరికి రూ.27కోట్లు అని చెబుతున్నారన్నారు. కానీ నెలలు గడిచినప్పటికీ చంద్రబాబు ప్రజాధనాన్ని దోచుకున్నా రని నిరూపించలేకపోయారన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని గంజాయి మత్తులో ముంచుతున్నారు. మహి ళలకు కూడా వైసీపీ నాయకులు గంజాయిని అలవాటు చేసి ఆ మత్తులో వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతు న్నారు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. చిత్తూరుజిల్లా, పూతలపట్టు నియోజకవర్గంలో హంస వేణి అనే మహిళ నీళ్లు కావాలని అడిగినందుకు ఆమె రెండుకళ్లను వైసీపీ కిరాతకులు పీకేశారు. నేడు హంస వేణి కుటుంబాన్ని పోషించేవారు లేక వాళ్లు అనాథల య్యారయ్యారని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.
రాజధాని లేకుండా చేశారు
రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. చంద్రబాబు పాలనలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి ప్రోత్సహించారు. వైసీపీ పాలనలో ఏపీకి ఒక్క పెట్టుబడి రాలేదు. ఒక్క కంపెనీ రాలేదు. టీడీపీ పాలనలో వచ్చిన కంపెనీలన్నీ ప్రస్తుత పాలకుల విధా నాల కారణంగా ఏపీని వదిలి పక్కనున్న రాష్ట్రాలకు పారిపోయాయి. దీనివల్ల యువతకు ఉద్యోగావకాశాలు పోయాయి. చంద్రబాబు ప్రారంభించిన అమరావతిని వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసింది.. మూడు రాజధాను లు పెడతామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి కనీసం ఒక్క రాజధాని కూడా లేకుండా చేసి ప్రజలను, రాష్ట్రాన్ని అవమానపరుస్తున్నారు. అమరావతికి భూము లిచ్చిన రైతులపై వైసీపీ ప్రభుత్వం అత్యంత కర్కశంగా వ్యవహరించింది. మహిళలు అని కూడా చూడకుండా అమరావతి రైతులను పోలీసులతో కొట్టించారు. అయినా వాళ్లు ఎక్కడా వెనక్కి తగ్గకుండా 1,600 రోజులుగా తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారని భువనేశ్వరి అన్నారు.
చంద్రబాబు వస్తేనే మహిళలకు రక్షణ
రాష్ట్రం బాగుండాలంటే, భావితరాల భవిష్యత్తు నిల బడాలంటే, మహిళలకు రక్షణ కావాలంటే చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావాలి. ఒక కుటుంబం అభివృద్ధి చెందాలంటే ఆ కుటుంబానికి పెద్దదిక్కు ఎంత అవస రమో…ఏపీ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్య మంత్రి స్థానంలో కూర్చోవడం కూడా అంతే అవసరం. మహిళా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. అధికారంలోకి వచ్చాకవాటిని తప్పకుండా అమలుచేస్తారు. దొంగల పాలనను అంతం చేయాలంటే రాష్ట్రంలోని పౌరులం దరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా విని యోగిం చుకోవాలి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థు లను గెలిపించుకోవాలని భువనేశ్వరి పిలుపు ఇచ్చారు.