అమరావతి: వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉండాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదేశాలు జారీ చేశారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలంటూ జిల్లా కలెక్టర్లకు సీఎస్ కీలక ఆదే శాలు ఇచ్చారు. ఎన్నికలతో ముడిపడిన ఎలాంటి ప్రక్రియ లోనూ పాల్గొనకూడదని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఎన్నికల విధుల నుంచి తక్షణమే వాలంటీర్లను తొలగించాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటే ఈసీ మార్గదర్శకాలు ఉల్లం ఘనే అని స్పష్టం చేశారు. పోలింగ్ ఏజెంట్లుగానూ వాలంటీ ర్లు ఉండరాదని ఆదేశాల్లో స్పష్టం చేశారు.
ఇలాఉంటే సీఎస్ ఆదేశాల్లో చిత్తశుద్ధిపై పలు అనుమానా లు వ్యక్తమవుతున్నాయి. వాలంటీర్ల సేవలను వైసీపీ ప్రభుత్వం ఇష్టారీతిన దుర్వినియోగం చేస్తోందంటూ టీడీపీ కొంతకాలం గా తీవ్రస్థాయిలో పోరాడుతోంది. వాలంటీర్ల దుర్వినియోగం పై పలువురు టీడీపీ నేతలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదులు కూడా చేశారు. ఎన్ని విమర్శలు వచ్చినా లెక్కచేయ కుండా ముఖ్యమంత్రి జగన్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేయాల్సిందేనని బహి రంగంగానే చెబుతున్నారు. వాలంటీర్లకు తాయిలాలు, నగదు పంచుతున్నారు. ప్రజలను ప్రలోభపెట్టేందుకు,ప్రభుత్వ పథకా లు రావని బెదిరించేందుకు సైతం వాలంటీర్లను వైసీపీ నేతలు వినియోగించుకుంటున్నారు.
ఈపరిస్థితుల్లో సిటిజన్స్‌ఫర్ డెమో క్రసీ,తదితర స్వచ్ఛందసంస్థలు, మరికొందరు వ్యక్తులు వాలం టీర్ వ్యవస్థ దుర్వినియోగంపై హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. ఈ విషయంలో తగు ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టు సైతం ఎన్నికల సంఘానికి సూచించింది. ఆ నేపథ్యంలో ఎన్ని కల సంఘం కళ్లుకప్పేందుకు సీఎస్ ఆదేశాలు జారీ చేసినట్లు గానే పలువురు భావిస్తున్నారు. సీఎస్ ఆదేశాలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతాయనేది అనుమానమే.